చర్చ:గ్రంథచౌర్యం

తాజా వ్యాఖ్య: ఈ వారపు వ్యాసం గా స్వీకరణ అర్ధం టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Vjsuseela
గ్రంథచౌర్యం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2021 సంవత్సరం, 32 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

పేరు గురించి మార్చు

  1. "గ్రంథచౌర్యం అనేమాట గ్రంధాన్ని చౌర్యం చేయడమని అర్ధం సూచిస్తున్నా, 'ప్లగారిజం' పదం వలె ఈ పదాన్ని విస్తృత పరిథిలో ఉపయోగిస్తారు." అని వ్యాసంలో చెప్పేసినప్పటికీ, "గ్రంథచౌర్యం" అనే మాట ఒక్క పుస్తకాలకే వర్తిస్తున్నట్టుగా స్ఫురిస్తోంది. "మేధోచౌర్యం" "భావచౌర్యం" వంటి పేర్లను కూడా పరిశీలించవలసినది. అయితే నేను గ్రంథచౌర్యం అనే పేరుకు వ్యతిరేకం కాదు.
  2. వ్యాసం పేరులో బ్రాకెట్లో ఇంగ్లీషు పేరు పెట్టి క్వాలిఫై చెయ్యనక్కరలేదు. అవసరమనుకుంటే ఇంగ్లీషు పేరుతో ఒక దారిమార్పు సృష్టించవచ్చు.
  3. ఇంగ్లీషు మాటను పలికే విధానం "ప్లగారిజం" సరియేనా! నేను జాలంలో చూస్తే "ప్లేజరిజం" అన్నట్లుగా ఉంది. పరిశీలించగలరు.
  4. "గ్రంధ" కాదు "గ్రంథ"

__చదువరి (చర్చరచనలు) 04:43, 19 ఏప్రిల్ 2021 (UTC)Reply

ఈ వ్యాసం శీర్షిక గ్రంధకు బదులు గ్రంథ అని ఉండాలి.--యర్రా రామారావు (చర్చ) 03:17, 28 మే 2021 (UTC)Reply
అవసరమైన సవరణలు సూచించారు. చేసారు. ధన్యవాదాలు.
గ్రంథచౌర్యం అనే పదము పరిమితమైనది. కానీ ఎక్కువమంది రచయతలు పూర్వకాలము నుండి తెలుగులో వాడటముతో అర్జున్ రావు గారు ఈపదాన్ని సూచించారు. అందుకనే నేను ఈ పదాన్నే వాడాను.
గూగుల్ ఉచ్ఛారణ ప్రకారం ఈపదాన్ని ప్లేజరిజం అనవచ్చు. ఈ పదాన్ని వృత్తిపరంగా 'ప్లగారిజం ' అని ఉచ్ఛరిస్తారు. అందుకనే నేను ఈ పదాన్నే వాడాను. --VJS (చర్చ) 13:36, 29 మే 2021 (UTC)Reply

ఈ వారపు వ్యాసం గా స్వీకరణ అర్ధం మార్చు

Cscr-featured.svg గ్రంథచౌర్యం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2021 సంవత్సరం, 32 వ వారంలో ప్రదర్శించటానికి స్వీకరించారు. అని రాసి ఉంది నాకు అర్ధం కాలేదు. వివరించండి. --VJS (చర్చ) 13:36, 29 మే 2021 (UTC)Reply

VJS గారూ, వికీపీడియా మొదటి పేజీలో ఈ వారం వ్యాసం అనే శీర్షిక ఒకటుంది. సమాచార పరిమాణం పరంగాను, నాణ్యత పరంగాను మేలుగా అనిపించే వ్యాసాలను ఎంచి వారానికొకటి చొప్పున ఈ శీర్షికలో ప్రదర్శిస్తూంటారు. మొదటి పేజీలో ప్రదర్శించడం వలన ఆ వ్యాసాలను మామూలు కంటే ఎక్కువ మంది పాఠకులు చదువుతారు. "గ్రంథచౌర్యం" వాసాన్ని ఈ సంవత్సరం 32 వ వారంలో (ప్రస్తుతం 21 వ వారం నడుస్తోంది. ఇప్పుడు ఘట్టమనేని కృష్ణ వ్యాసాన్ని ప్రదర్శిస్తున్నారు) ప్రదర్శించేందుకు స్వీకరించారు.
ఈ వ్యాసాల నాణ్యతను ఎంచేందుకు ప్రస్తుతం గీటురాయి ఏమీ లేదు. ఈ శీర్షికను నిర్వహించేవారి విచక్షణా శక్తిని బట్టి ఈ ఎంపిక ఉంటుంది. ప్రస్తుతం ఈ శీర్షికను నేను నిర్వహిస్తున్నాను.
వాడుకరులకు మంచి వ్యాసమేదైనా కనిపించినపుడు, దానికి ఈ శీర్షికలో ప్రచురించే యోగ్యత ఉందని భావిస్తే సంబంధిత చర్చ పేజీలో {{ఈ వారం వ్యాసం పరిగణన}} అని చేర్చవచ్చు. ఈ పని ఎవరైనా చెయ్యవచ్చు. ఇలాంటి వ్యాసాలన్నీ వర్గం:ఈ వారం వ్యాసం పరిగణనలు అనే వర్గం లోకి చేరుతాయి. శీర్షిక నిర్వాహకులు దాన్ని పరిశీలించి ప్రదర్శనా యోగ్యత ఉందని తెలిస్తే దానికి వారాన్ని నిర్ణయించి, పై మూసను తీసేసి {{ఈ వారం వ్యాసం}} అనే మూసను చేరుస్తారు. ప్రతిపాదించిన తరువాతా, ఎంపిక చేసిన తరువాతా, ప్రదర్శించిన తరువాత కూడా ఈ వ్యాసాలపై పనిచేసి మరింతగా మెరుగుపరుస్తూండడం కద్దు.
"గ్రంథచౌర్యం" వ్యాసంలో ప్రతిపాదన ఎవరూ చెయ్యలేదు - నేరుగా వారాన్ని నిర్ణయించి ప్రకటించాను.
__చదువరి (చర్చరచనలు) 06:33, 30 మే 2021 (UTC)Reply

ధన్యవాదాలు--VJS (చర్చ) 06:54, 30 మే 2021 (UTC)Reply

Return to "గ్రంథచౌర్యం" page.