చర్చ:టాంక్ బండ్

తాజా వ్యాఖ్య: వ్యాసం విస్తృతి టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: Vu3ktb
టాంక్ బండ్ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, 01 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


—ఈ వ్యాసం పేరు "టాంకు బండ పై విగ్రహాలు" అని పెట్టారు. తెలుగులో "బండ" ఆంటే రాయి లేదా లావుగా ఉన్నది అని అర్ధం. కాని TANK BUND అంటే చెరువు గట్టు అని అర్ధం కదా. కాబట్టి, వ్యాసపు పేరును "టాంక్ బండ్" మారిస్తే బాగుంటుంది. మనం ఆంగ్ల పేరును యధాతధంగా తెలుగులో వాడుతునాము. అలా వాడేటప్పుడు, అటువంటి ఆంగ్ల పదంలో సగం "టాంకు"యధాతధంగా ఆంగ్లపదాన్ని, మిగిలిన సగాన్ని "బండ" (బండ్ కు బదులుగా)అని తెలుగులో వ్రాస్తే, తెలియని వారు, అక్కడ ఒక యుద్ధ టాంకు పెట్టారు కాబట్టి టాంకు బండ అనె పేరు వచ్చింది అనుకునే ప్రమాదం ఉన్నది.

Untitled

మార్చు

నా ఉద్దేశ్యంలో, వ్యాసపు పేరు "టాంక్ బండ్" అని పెట్టి, ఆ వ్యాస భాగంగా, టాంకు బండ్ ఎలా ఏర్పడింది, ఎవరు ఏర్పరిచారు వంటి వివరాలతో పాటుగా, ఆ టాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాల వివరాలు పొందుపరస్తే బాగుంటుంది.--SIVA 10:37, 8 జూన్ 2008 (UTC)Reply

శివా సూచనలు చాలా సమంజసంగా ఉన్నాయి. విగ్రహాల జాబితా మాత్రమే కాకుండా ఒక్కొక్కరి గురించి రెండు మూడు వాక్యాలు పొదుపరస్తే బాగుంటుంది. "హైదరాబాదు టాంక్‌బండ్‌పై విగ్రహాలు" అని వ్యాసంపేరు మార్చాలని ప్రతిపాదిస్తున్నాను. కాని మూసలో మాత్రం "టాంకు బండ పై విగ్రహాలు" అని ఇప్పుడున్నట్లే ఉంచవచ్చుననుకొంటున్నాను--కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:48, 8 జూన్ 2008 (UTC)Reply
మరోమాట - హైదరాబాదులో ఉన్నవారెవరైనా ట్యాంకుబండ్ ఫొటో ఒకటి, కొన్ని విగ్రహాలు కూడా కనిపించేలా, తీసి జత చేయగలరా? --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:50, 8 జూన్ 2008 (UTC)Reply
నా వద్ద ఉన్నది, కాని అందులో నేనూ ఉంటాను. పర్వాలేదంటే అప్లోడ్ చేస్తా.--విశ్వనాధ్. 07:30, 9 జూన్ 2008 (UTC)Reply
పేరు మార్పు చెయ్యటమంటూ జరుగుతున్నప్పుడు, మళ్ళీ మూసలో ఒకటి మరొకచోట మరొకటి ఎందుకు? నా ఉద్దేశ్యంలో వ్యాసానికి పేరు "టాంక్ బండ్" అని పెట్టి, అందులో భాగంగా, టాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాల గురించి కాసుబాబుగారు చెప్పినట్టు ఒక్కొక్క విగ్రహం గురించి 4-5 వ్యాక్యాలు వ్రాస్తే చాల బాగుంటుంది. తరువాత, వ్యాసం టాంక్ బండ్ (Tank Bund)తొ ప్రారంభిస్తే, ఎవరైనా గూగుల్ లో ఆంగ్లంలో సెర్చ్ చేసినా ఈ వ్యాసం దొరుకుతుంది.--SIVA 17:35, 12 జూన్ 2008 (UTC)Reply
ఈ పేరు తప్పు నాదే అనుకుంటాను! ఆ రోజుల్లో చివరలో నకారప్పొల్లు ఉంటే వికీలొ కొంచెం అయోమయం ఉన్నట్టు గుర్తు, అందుకే ఇలా కానిచ్చేశాను. ఇప్పుడు భేషుగ్గా మంచి పేరుకు మార్చవచ్చు. Chavakiran 16:23, 15 జూన్ 2008 (UTC)Reply

దృశ్యమాలిక

మార్చు

పైన జరిగిన చర్చ తరువాత,వికిలో పరికించి చూస్తే, టాంక్ బండ్ మీది విగ్రహాల ఫొటోలన్నీ కూడ మనకి సభ్యులు వికిలోకి ఇప్పటెకే అప్లోడ్ చేసి ఉన్నారు. ఆ బొమ్మలన్ని కూడా ఆయా మహనీయులమీది వ్యాసాల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి, ఆ ఫొటోలన్నీ కూడ "టాంక్ బండ్" వ్యాసంలో ఒక దృశ్య మాలిక (Gallery)గా పొందుపరచాను. ప్రతి ఫొటోవద్ద ఆ విగ్రహం ఎవరిదో వాయబడింది మరియు వారికి సంబంధించిన వ్యాసానికి లింక్ ఇచ్చాను. దీనివల్ల, ఆ విగ్రహంలో ఉన్న వ్యక్తి గురించి పూర్తి వివరాలు తెలుసుకొనే అవకాశం కలుగుతుంది.

ఈ వ్యాసంలో,

  1. టాంక్ బండ్ ఎత్తు ఎంత
  2. ఎందుకు అంత ఎత్తు కట్టవలసి వచ్చింది
  3. లోయర్ టాంకుబండ్ ప్రాంతం గురించి
  4. టాంక్ బండ్ ఎన్ని కిలోమీటర్లు పొడవు
  5. ఏ సంవత్సరం నుండి, టాంక్ బండ్ మీద నుండి రహదారిని వాహనాలకు తెరచారు
  6. టాంక్ బండ్ మీద జరుపుకుంటున్న ఉత్సవాలు-వినాయక నిమజ్జనం, రకరకాల పరుగులు, కొత్త సంవత్సర వేడుకలు మొదలగునవి
  7. ఈ పురాతన కట్టడాన్ని పరిరక్షించటానికి ప్రస్తుతం తీసుకొనబడుతున్న చర్యలు

ఇత్యాది వివరాలు కూడ చేరిస్తే, వ్యాసం పూర్తి అవుతుందని నా అభిప్రాయం ఇతర సభ్యులు, ముఖ్యంగా హైదరాబాదు నగరంలో ఉన్నవారు లేదా ఈ కట్టడం గురించి మరిన్ని వివరాలు తెలిసిన సభ్యులు, ఈ వ్యాసం మీద వారి దృష్టి సారించి ఈవ్యాసాన్ని పరిపుష్టం చెయ్యగలరు.నా ప్రయత్నంగా నేను వివరాల సేకరణ మొదలు పెట్టాను, కాలక్రమేణా పొందుపరచగలను.--SIVA 02:30, 15 జూన్ 2008 (UTC)Reply

శివా చేసిన మార్పులు, సూచనలు కూడా చాలా సముచితంగా ఉన్నాయి. అభినందనలు. టాంక్‌బండ్ మీద విగ్రహాలు ఉన్న మహానుభావులందరి గురించిన వ్యాసాలను సమగ్ర వ్యాసాలుగా తీర్చాలని నా ఆకాంక్ష. వీరి గురించి ప్రభుత్వం చిన్న చిన్న పుస్తకాలు (Booklets) ప్రచురించింది. క్రిందటి సెలవులలో 20 పుస్తకాలు విశాలాంధ్రలో కొన్నాను నేను. సమయం చూసుకొని ఆయా వ్యాసాలపై పని సాగిస్తాను. అందరూ సహకరించవలెనని విన్నపం. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 04:52, 15 జూన్ 2008 (UTC)Reply

వ్యాసం విస్తృతి

మార్చు

ఈ వ్యాసంలో టాంక్ బండ్ రోడ్డు గురించే కాక హుస్సేన్ సాగర్ చెరువు గురించి కూడా రాస్తున్నట్టున్నారు. హుస్సేన్ సాగర్ అనే మరో వ్యాసం కూడా ఉంది. ఈ రెండింటిని కలిపేద్దామా? లేక విడివిడిగా వ్యాసాలుగా తీర్చుదిద్దుదామా? --వైజాసత్య 14:28, 15 జూన్ 2008 (UTC)Reply

విడివిడిగానే ఉండనీయండి. కొంత ఓవర్‌లాప్ తప్పదు. హుస్సేన్ సాగర్ వ్యాసం విస్తరించినపుడు ఈ సమస్య పరిష్కారం కావచ్చును.--కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:39, 15 జూన్ 2008 (UTC)Reply
నాకేమీ పెద్దగా ఒవర్ లాప్పింగ్ కాని, వ్యాసంలో హుస్సేన్ సాగర్ గురించి ఎక్కువ వాక్యాలు గాని ఉన్నయనిపించట్లేదు. కాసుబాబుగారు అన్నట్టు, మనం వ్రాసేది హుస్సేన్ సాగర్ గట్టు గురించి. కాబట్టి కొద్దిగానన్నా ఆ చెరువు గురంచి వ్రాయటం వల్ల, ఈ వ్యాసం మాత్రమే చదెవే వారికి పూర్తి వివరాలు అందుతాయి. వారు మరిన్ని వివరాలు కావాలనుకుంటే, ఈ వ్యాసం నుండి హుస్సేన్ సాగర్ వ్యాసానికి లింక్ ఎలాగూ ఉన్నది. కాబట్టి, నా ఉద్దేశ్యంలో, ఈ రెండు వ్యసాలు విడివిడిగానే ఉంచి మరింత విస్తరిస్తేనె బాగుంటుంది.హైదరాబాద్ వ్యాసం నుండి కూడ ఈ వ్యాసానికి లింక్ ఇస్తే, ఆ వ్యాసం చదివే వారు మరిన్ని వివరాలకొరకు, ఈ వ్యాసం చదువుకోవచ్చు.--SIVA 00:52, 17 జూన్ 2008 (UTC)Reply

విగ్రహ విధ్వంసం

మార్చు

ధ్వంసం చెయ్యబడిన విగ్రహాల ఫోటోలు కూడా అప్లోడ్ చేస్తే టాంకు బండుమీద విగ్రహాల చరిత్ర పూర్తిగా వికీపీడియాలో నిక్షిప్తమవుతుంది. దయచేసి విధ్వంస విశేషాలను కూడా వ్యాసంలో భాగంగా చెయ్యగలరు.

Return to "టాంక్ బండ్" page.