చర్చ:తిరువూరు
తాజా వ్యాఖ్య: తిరువూరు అనే పేరుతో అధికారంగా గ్రామం/పట్టణం లేదు టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు
సంబంధిత పాత చర్చ
మార్చుచర్చ:పాత తిరువూరు చూడండి. --అర్జున (చర్చ) 13:15, 3 జూన్ 2022 (UTC)
తిరువూరు అనే పేరుతో అధికారంగా గ్రామం/పట్టణం లేదు
మార్చుఈ శీర్షిక లేదా పేరుతో అధికారకంగా తిరువూరు మండలంలో గ్రామంగానీ లేదా పట్టణం గానీ లేదు.తిరువూరు మండలంలో గ్రామం పాత తిరువూరు రెవెన్యూ గ్రామంగా, నడిమి తిరువూరు , జనగణన పట్టణంగా, తిరువూరు మండలం, తిరువూరు నగరపంచాయితీ (ఇంకా పేజీ సృష్టించబడలేదు) గా మాత్రమే ఉన్నవి.తిరువూరు అనే పేరుతో అధికారంగా గ్రామం/పట్టణం లేదు.గమనించగలరు.--యర్రా రామారావు (చర్చ) 09:18, 4 జూన్ 2022 (UTC)
- @యర్రా రామారావు గారు, అధికారిక పట్టణాల జాబితాలో పేరు వున్నది. పట్టణం లేకుండా నగర పంచాయితి భౌగోళిక పరిధి బొమ్మ వుంటుందా, నగర పంచాయితీకి ఎన్నికలు జరుగుతాయా? వ్యాసంలో ఇచ్చిన మూలాలు పరిశీలించలేదా? అర్జున (చర్చ) 00:09, 9 జూన్ 2022 (UTC)
- మండలం ప్రధాన కేంధ్రం వేరుగా ఉంటుంది.మండలం పేరు వేరుగా ఉంటుంది.ఇది అలాంటిదే! తిరువూరు నగర పంచాయితీ ప్రధాన కేంద్రం పాత తిరువూరు లేదా నడిని తిరువూరు కావచ్చు. తిరువూరు అనే పేరుతో అధికారక గ్రామం ఉన్నట్లు నేను భావించుటలేదు. మీరు అధికారిక పట్టణాల జాబితా లింకు ఉదహరించగలరు.మూలాలు పరిశీలించే నేను ఈ చర్చను సాగిస్తున్నాను. పట్టణం లేకుండా నగర పంచాయితి భౌగోళిక పరిధి బొమ్మ వుంటుందా అని ప్రశ్నించారు.ఈ లింకులు పరిశీలించండి. తోకపాలెం, తానంచెర్ల, వేపినాపి అక్కమాంబాపురం ఈ గ్రామాలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, రాపూరు మండలంలోని నిర్జన గ్రామాలు.ఈ వ్యాసాలలోని సమాచారపెట్టెలలో ఆ గ్రామాల పటాలు ఉన్నాయి. గమనించండి.పై విషయం కూడా అలాంటిందే! భౌగోళిక పరిధి వేరు, గ్రామం వేరు, అధికారక పేరు వేరు.ఇక నా అభిప్రాయాలు చెప్పాను. ఇక మీ ఇష్టం.అయితే ప్రతి విషయం చాలా లోతుగా అధికారంగా ఎలా ఉంటే అలా ఉండాలి అనే అభిప్రాయంతో పరిశీలిస్తాను.దీనికి మాత్రమే నేను విలువస్తాను.ఒక వేళ నా పరిశీలనలో లోపాలు ఉంటే సవరించుకోవటానికి ఎప్పుడూ వెనకాడను.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 04:04, 9 జూన్ 2022 (UTC)
- @యర్రా రామారావు గారు, అధికారిక పట్టణాల జాబితా (ఆర్కైవ్ లింకు) (వ్యాసంలో(శాశ్వత లింకు) మొదటి మూలం, రెండవ మూలం) చూడండి. మొదటి మూలం( విస్తీర్ణం, జనాభా మూలాలకు) గతంలో జనగణన లింకు వుండగా, ఈ రోజు అది సరిచేశాను. 2011 జనగణనలో నడిమి తిరువూరు జనగణన పట్టణంగానే వుంది, కాని ఆ తరువాత ప్రభుత్వం తిరువూరును పట్టణంగా ఏర్పరిచినట్లుంది. అయితే పై లింకులో జి.ఒ నంబరు స్థానంలో "Newly constituted" అని పేర్కొన్నారు. ఇక నేను సూచించిన భౌగోళిక పరిధి బొమ్మకు మూడవ మూలం చూడండి.ఎన్నికల వార్త కొరకు నాల్గవ మూలం చూడండి. అర్జున (చర్చ) 01:13, 10 జూన్ 2022 (UTC)
- సరియైన అధికారక మూలం లభించేంతవరకు నా అభిప్రాయంలో ఎలాంటి మార్పులేదు. దీని విషయంలో కొంత కాలం వేచిచూద్దాం. యర్రా రామారావు (చర్చ) 03:47, 10 జూన్ 2022 (UTC)