వ్యాసంలోని వ్యాఖ్యలు

మార్చు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో కృష్ణాజిల్లాలోని తిరువూరు మండలంలోని తిరువూరు పేరు గల పట్టణం కలదు. ఇక్కడ జనాభా 1981లో 21,000 జనాభా వున్నట్లు పంచాయతీవారు లెక్కించి ప్రకటించారు. 1991 లో కేవలం ఓటర్ల సంఖ్య 22,000 ఉన్నట్లు లెక్కలు వున్నాయి. ఓటర్లే 22,000 మంది ఉంటే ఓటు హక్కు లేనివారు, ఓట్లు నమోదు కానివారు కలుపుకుంటే సుమారుగా 40,000 మంది పైగా ఉంటేనే ఓటర్ల సంఖ్య 22,000 ఉంటుంది. ఈలెక్క 1991ది. కానీ ఇక్కడ స్వార్థరాజకీయము పెరిగి తాండవం చేయడంవలన ఇక్కడ ప్రాంతమును ఒక పంచాయితిగానే ఉంచి 2001 జనాభాగా 25,000 అన్నట్లు లెక్కించకుండా పంచాయతి వారు ప్రకటించారు. ఈ ప్రాంతమును అభివృద్ధి కానివ్వకుండా తమ స్వార్థం కొరకు ఇక్కడ రాజకీయ నాయకులు మరియు కొంతమంది కలసి ఈ ప్రాంతమును పురపాలక సంఘముగా ప్రకటించకుండా అడ్డుకొంటున్నారు. పురపాలక సంఘముగా ఏర్పడితే ఈ ప్రాంతము విద్య పరంగా కొంతైనా అభివృద్ధి చెంది, నిరక్షరాస్యుల సంఖ్య తగ్గి విద్యావంతులు పెరిగి దేశమునకు ఆదర్శవంతులుగా మారి సహాయకులుగా మారుతారు. ఇక్కడకు పరిశ్రమలు వచ్చినట్లె వచ్చి వేరే ప్రాంతమునకు తరలిపోతుంటే కూడా ఇక్కడి రాజకీయ నాయకులు పట్టించుకోకుండా ఉంటున్నారు. ఉదాహరణకు 1983లో అప్పటి ప్రభుత్వం ఇక్కడ పాడి పరిశ్రమ నెలకొల్పేందుకు స్థలమును దానికి కావలసిన వనరులను సమకూర్చి ప్రకటించినది. ఆ పరిశ్రమను ఇక్కడి నుండి ఒక రాజకీయ నాయకుని స్వార్థము వలన గుంటూరు జిల్లాకు తరలించుకొన్నాడు. అయినా ఇక్కడి రాజకీయనాయకులు పట్టించుకోకుండా మిన్నకున్నారు. ఇక్కడ నవోదయ పాఠశాల ఏర్పాటుకు 1988లో స్థల సేకరణ చేసి ప్రకటించారు. అది కాస్త కృష్ణాజిల్లాలోని వేరే ప్రాంతము రాజకీయ నాయకుడు తమ పార్లమెంట్ నియోజకవర్గంనకు తన్నుకోపోయాడు. మరియు 2002లో ఇక్కడ మామిడి పండ్ల పరిశ్రమ పెడతామని ప్రకటించారు. అది కాస్త వేరే ప్రాంతంవారు తన్నుకోపోయారు. ఇదండి మాప్రాంత రాజకీయనాయకుల చరిత్ర.

పాత తిరువూరు వ్యాసంలో పట్టణ సమాచార పెట్టె తగినది కాదు.

మార్చు

ఇది తిరువూరు మండలంలో ఒక రెవెన్యూ గ్రామం.అదే మండలంలో నడిమి తిరువూరు అనే పట్టణం ఉంది.అది జనగణన పట్టణం.నగరపంచాయితీకి అది పరిపాలనా కేంద్రం. పాత తిరువూరులో సమాచారపెట్టె దానిలో చేర్చాలి.దీనిలో గ్రామానికి చెందిన సమాచారపెట్టె చేర్చాలి.అర్జునరావు గారూ దయచేసి ఒక నిర్వాహకుడుగా నేను చేసిన సవరణలు ఏక పక్షంగా తొలగించండి. పాత తిరువూరు వ్యాసంలో ఏక పక్షంగా జనగణన డేటా వివరాలు, మండలంలోని గ్రామాలు మూస ఇంకా ఏవేవో తొలగించారు.ఇది సమంజసంగా లేదు.ఎంత సేపటికి ఎదుటివారికి ఏమి తెలియదు అనుకోవద్దు.--యర్రా రామారావు (చర్చ) 06:54, 3 జూన్ 2022 (UTC)Reply

@యర్రా రామారావు గారు, క్షమించాలి. తిరువూరు నగరపంచాయితి కావున సంబంధిత పట్టణ వ్యాసానికి వివరాలు చేరుస్తుంటే పాత తిరువూరుకు లింకైనందున ఆ వ్యాసం మెరుగుచేయటానికి వివరాలు సవరించాను. మీకు తెలియదు అని నేనేమి అనుకోలేదు. అనవసరంగా అపార్ధం చేసుకుంటున్నారు. తిరువూరు కు లింకు కూడా సరిచేయండి. అర్జున (చర్చ) 07:11, 3 జూన్ 2022 (UTC)Reply
అర్జునరావు గారూ లింకు అవసరం అనుకుంటే మీరు మార్చండి.నాకేమీ అభ్యంతరంలేదు.అలాగే ఈ సమాచారపెట్టెను ఇక్కడ తొలగించి నడిమి తిరువూరు వ్యాసంలో చేర్చగలరు. ఇలాంటివి కొద్దిగా గమనించగలరు. మీ స్పందనకు ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 08:29, 3 జూన్ 2022 (UTC)Reply
@యర్రా రామారావుగారు, నా గూగుల్ పరిశోధన ప్రకారం, తిరువూరు పట్టణంలో పాత తిరువూరు ఒక గ్రామం కావున దారిమార్పు తొలగించి వ్యాసం చేశాను. నడిమి తిరువూరు దీనిలో చేరని వేరే గ్రామం. పాత తిరువూరు సమాచారపెట్టె పాత రూపం చేర్చాను. నడిమి తిరువూరుకు, తిరువూరుకు వికీడేటాలో మార్పులు చేశాను. అర్జున (చర్చ) 13:12, 3 జూన్ 2022 (UTC)Reply
Return to "పాత తిరువూరు" page.