చర్చ:నాగులవంచ వసంతరావు
తాజా వ్యాఖ్య: "తొలగించు" నుండి "దారి మళ్ళింపు" వరకు టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: కాసుబాబు
"తొలగించు" నుండి "దారి మళ్ళింపు" వరకు
మార్చుకవిత స్వీయ కవితే కానీ బాగుంది. దీనిని ఇతర వికీమీడియా ప్రాజెక్టుల్లోకి తరలించే ఏర్పాటు చేద్దామా? రవిచంద్ర(చర్చ) 12:50, 4 ఏప్రిల్ 2008 (UTC)
- అనుకొన్నాను కాని (1) ఆ రచయిత సభ్యునిగా చేరలేదు గనుక రచన ఎవరిదో నిర్దుష్టంగా తెలియదు. వారికి ఇష్టమో కాదో కూడా తెలియదు. (2) వికీ సోర్స్ కూడా స్వీయ రచనలు ప్రచురించే స్థలం కాదు. పాత ప్రచురణలకే సరైనది. (3) అందుకే నోటీసు పెట్టాను. తొలగించడమే మంచిదనుకొంటాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:08, 4 ఏప్రిల్ 2008 (UTC)
- ఈ వ్యాసంలో గేయాన్ని 12:10, 26 మే 2007 నాడు 203.199.181.251 ఐ.పి. చిరునామా నుండి ఎవరో వికీపీడియాలో "నవయువకులారా లేవండీ" అనే పేరుతో వ్రాశారు. ఇటువంటి రచనలు (స్వీయ కవితలు) వికీలో ఉండ తగవు గనుక "స్వీయ కవిత లాగుంది. తొలగించవలెను" అన్న నోటీసు పెట్టబడింది. ఆ నేపధ్యంలో పై చర్చ జరిగింది. తరువాత నేను ఇంటర్నెట్లో జరిపిన శోధన ద్వారా ఆ రచయిత "నాగులవంచ వసంతరావు" బ్లాగు లభించింది. http://nagulavancha.blogspot.com/ మరియు http://vasantharao.blogspot.com/ అన్నవి. అక్కడినుండి ఆ రచయిత బయోడేటా ఆధారంగా క్రొత్త వ్యాసం సృష్టించి, అందులో ఉదాహరణగా ఆ గేయాన్ని ఉంచుతున్నాను. ఈ విషయం బ్లాగు ద్వారా వారికి తెలియజేస్తాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:26, 9 ఏప్రిల్ 2008 (UTC)