చర్చ:నార్ల వెంకటేశ్వరరావు
తాజా వ్యాఖ్య: చనిపోయిన తేదీ టాపిక్‌లో 17 సంవత్సరాల క్రితం. రాసినది: Gsnaveen
చనిపోయిన తేదీ
మార్చునార్ల వెంకటేశ్వరరావు చనిపోయింది ఫిబ్రవరి 16 న అని ఉంది, ఈ పేజీలో. ఏది సరైనదో చూడాలి. __చదువరి (చర్చ • రచనలు) 05:35, 7 జూన్ 2007 (UTC)
- ఆంగ్ల వికీలో 13 అనే ఉంది http://en.wikipedia.org/wiki/Narla_Venkateswara_Rao --నవీన్ 05:40, 7 జూన్ 2007 (UTC)
ఈనాడు దినపత్రిక నుండి కాపీ
మార్చుఈనాడి దినపత్రికలో "యుగయుగాల బాట" టైటిల్‌తో నార్ల శతజయంతి సందర్భంగా వచ్చిన వ్యాసంలోని చాలా వాక్యాలను రహమతుల్లా గారు యథాతధంగా కాపీ చేశారనిపిస్తుంది. ఎలాంటి మార్పులు లేకుండా వాక్యాలకు వాక్యాలు కాపీ చేయడమే కాకుండా కనీసం రెఫరెన్స్ కూడా తీసుకోలేదు. ఇలా ఇతర వనరుల నుండి కాపీ చేయడం వికీ నైజం కాదు. వ్యాసాన్ని అర్థం చేసుకొని మనదైన పద్దతిలో వ్రాయడం మంచిది. తప్పని సరిగా ఒక వాక్యాన్ని తీసుకోవాల్సివచ్చినప్పుడు రెఫరెన్స్ ఇవ్వవలసి ఉంటుంది. -- C.Chandra Kanth Rao(చర్చ) 14:01, 1 డిసెంబర్ 2008 (UTC)
- క్రింద మూలాల్లో ఈనాడునే కాదు ఆంధ్రజ్యోతినీ పేర్కొన్నాను చూడండి.ప్రపంచంలో ఏజ్ఞానమూ నాసొంతం మీ సొంతం కాదు.ఎంతోకొంత ఎవరో ఒకరుచెప్పింది కాపీకొట్టకుండా ఎవరికీ ఏమీ తెలియదు."కనీసం రెఫరెన్స్ కూడా తీసుకోలేదు' అని ఎలా అన్నారూ?--Nrahamthulla 14:22, 1 డిసెంబర్ 2008 (UTC)
- రెఫరెన్స్ వేరు, వనరులు వేరు. నేను చెప్పినది ఖచ్చితంగా కరెక్టే. వనరులులో రాస్తే ఏ పత్రికలోనిది ఏ వాక్యం అని ఎలా తెలుస్తుంది. రెఫరెన్స్ నేను ఇచ్చాను చూడండి. జ్ఞానం ఎవరి సొంతం కాదు కాని అనుమతి లేకుండా కాపీచేయడం తప్పు. వనరులలో పేర్కొంటున్నాము కదాని యధాతథంగా కాపీచేయడం తగదు. ఎంతో కష్టపడి ఎవరో వ్రాసిన తయారుచేసిన వ్యాసాన్ని గుర్తింపు లేకుండా కాపీ చేయడం న్యాయమేనా? నాలుగైదు పుస్తకాలను తిరగేసి వ్యాసాలను అర్థం చేసుకొని మనమే తయారుచేయలేమా? కాపీహక్కులు, పేటెంట్లు లేకుంటే అంతా గందరగోళమౌతుంది. వికీ యొక్క ప్రాథమిక సూత్రం కాపీ హక్కులు లేని, ఉచిత వనరులు లేదా అనుమతి ఉన్న రచనలు మాత్రమే చేర్చాలి. మనం చేసే ప్రతి ఎడిట్‌కు అదే ప్రమాణం చేస్తున్నాము. -- C.Chandra Kanth Rao(చర్చ) 17:37, 1 డిసెంబర్ 2008 (UTC)
- రహంతుల్లా గారూ, చంద్రకాంత్ గారు కాస్త కఠినంగా చెప్పినా ఆయనన్నది వాస్తవం. విజ్ఞానం ఎవరి సొత్తు కాదు కానీ అది వ్యక్తపరచిన వాక్యాలు మాత్రం కాపీరైట్లే. ఈ విషయం యొక్క తాత్వికతపై మనం వాదోపవాదాలు చేసినా నిజజీవితంలో మాత్రం చట్టాలు, కాపీహక్కులూ ఉంటాయి. వికీలో ఎవరు చేర్చిన సమాచారానికి వారే చట్టబద్ధంగా బాధ్యులు. ఈ విషయాన్ని పెద్దమనసుతో అర్ధం చేసుకోగలరు. ఈనాడులోని సమాచారం స్వీకరించడం తప్పుకాదు కానీ దాన్ని సొంత వాక్యాలలో తిరగవ్రాస్తే అందరికీ శ్రేయస్కరంగా ఉంటుంది. --వైజాసత్య 21:21, 1 డిసెంబర్ 2008 (UTC)
- రెఫరెన్స్ వేరు, వనరులు వేరు. నేను చెప్పినది ఖచ్చితంగా కరెక్టే. వనరులులో రాస్తే ఏ పత్రికలోనిది ఏ వాక్యం అని ఎలా తెలుస్తుంది. రెఫరెన్స్ నేను ఇచ్చాను చూడండి. జ్ఞానం ఎవరి సొంతం కాదు కాని అనుమతి లేకుండా కాపీచేయడం తప్పు. వనరులలో పేర్కొంటున్నాము కదాని యధాతథంగా కాపీచేయడం తగదు. ఎంతో కష్టపడి ఎవరో వ్రాసిన తయారుచేసిన వ్యాసాన్ని గుర్తింపు లేకుండా కాపీ చేయడం న్యాయమేనా? నాలుగైదు పుస్తకాలను తిరగేసి వ్యాసాలను అర్థం చేసుకొని మనమే తయారుచేయలేమా? కాపీహక్కులు, పేటెంట్లు లేకుంటే అంతా గందరగోళమౌతుంది. వికీ యొక్క ప్రాథమిక సూత్రం కాపీ హక్కులు లేని, ఉచిత వనరులు లేదా అనుమతి ఉన్న రచనలు మాత్రమే చేర్చాలి. మనం చేసే ప్రతి ఎడిట్‌కు అదే ప్రమాణం చేస్తున్నాము. -- C.Chandra Kanth Rao(చర్చ) 17:37, 1 డిసెంబర్ 2008 (UTC)
- ఇప్పటివరకు నేను అనేక వ్యాసాలలో ఎవరో ఒకరు కష్టపడి తయారుచేసిన విషయాలనే స్వల్పమార్పులతో అనుమతి లేకుండా వికీలోకి కాపీ చేశా.కొన్ని ఇంగ్లీషులో ఉంటే తెలుగులోకి మార్చా.రిఫరెన్సులూ,మూలాలూ పేర్కొంటున్నా కదాని ఖురాన్ ,హదీసుల్లాంటి లేఖనాలైతే మరీయధాతదంగా కాపీ చేశా.నా వల్ల జరిగిన మార్పులు చేర్పులు ఒకసారి పరిశీలించి ఇలా కాపీ చేసిన విషయాలను తొలిగిస్తాను.అసలు విషయం మనం సొంతంగా రాయలేనప్పుడు మూలాలు పేర్కొని వదిలేస్తే సరిపోతుందేమో--Nrahamthulla 01:17, 2 డిసెంబర్ 2008 (UTC)