చర్చ:పట్రాయని సంగీతరావు

Active discussions
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


ప్రచార వ్యాసమా?సవరించు

ఈ వ్యాసం మూలం సదరు వికీపీడియన్ బ్లాగ్ కి పూర్తి నకలు గా వుంది. వనరులు కూడా బ్లాగ్ మాత్రమే. అందువలన దీనికి వికీకరణ మూస చేర్చడమైనది. సంపాదకులకు సరియైన అవగాహన లేకపోవటం వలన ఇలా జరుగుతున్నట్లుంది.-- అర్జున 15:48, 7 అక్టోబర్ 2011 (UTC)

ఈ వ్యాసం ప్రచారంలాగే నాకూ అనిపిస్తోంది. బ్లాగులో ఉన్న సమాచారమే ఇక్కడ చేర్చబడినది. తెవికీ వ్యాసాలలో బ్లాగు మూలాలను చేర్చడం బాగుండదు. ప్రస్తుతానికి బ్లాగు మూలం నేను హైడ్ చేశాను. వ్యాసంలో ఇతర వనరుల సమాచారం చేర్చి రెఫరెన్సులు పెట్టాల్సి ఉంటుంది. లేనిచో వ్యాసంలో చాలా భాగం తొలిగించవలసి ఉంటుంది. బ్లాగు నిర్వాహకులే తెవికీలో ఈ వ్యాసాన్ని చేర్చినట్లుగా గమనించాను. దీనికి కాపీ హక్కుల సమస్య లేకున్ననూ (బ్లాగులోని సమాచారం ఎక్కడి నుంచి తీసుకోబడినదనేది కూడా ప్రధానమే లేనిచో కాపీ హక్కుల సమస్య ఉంటుంది) ప్రచారం, బ్లాగుకు మక్కికిమక్కి తదితర కారణాల వలన వ్యాసాన్ని వికీకరించాల్సి ఉంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:45, 7 అక్టోబర్ 2011 (UTC)
బ్లాగు మూలాలు బ్లాగు స్వంతదారు చర్చాపేజీలలో రాస్తే, వాటిని ఇతరులు పరిశీలించి వ్యాసంలో రాస్తే అభ్యంతరముండదు అనుకుంటాను.-- అర్జున 01:34, 8 అక్టోబర్ 2011 (UTC)
బ్లాగు లింకులు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయి. అసలు బ్లాగులకు ప్రామాణికతే లేదు. ఎవరి ఎన్నయినా బ్లాగులు ప్రారంభించి ఏమైనా వ్రాసుకోవచ్చు. వాటికి మనం ప్రాధాన్యత ఇవ్వడం దిగజారడమే అవుతుంది. ఇదివరకే పేరు ప్రఖ్యాతలు సంపాదించి వారు స్వయంగా నిర్వహిస్తున్న బ్లాగులకు, మామూలు వ్యక్తుల బ్లాగులకు చాలా తేడా ఉంటుంది. ఏ గ్రంథాన్నైనా కాపీ చేసి బ్లాగులో చేర్చిన విషయాన్ని తెవికీలో చేర్చి మూలంలో ఆ బ్లాగు లింకు చేర్చే అవకాశం కూడా ఉంటుంది. ఇదివరకు చాలా సార్లు బ్లాగులింకులపై చర్చలు జరిగాయి. ఉదా:కు ఇక్కడ చూడండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:48, 8 అక్టోబర్ 2011 (UTC)
సాంప్రదాయిక మాధ్యమాలు స్థాయి దిగజారి సామాజిక వెబ్ పెరుగుతున్న నేపథ్యంలో (ప్రస్తుతం అభివృద్ధిచెందిన దేశాల్లో, ముందు ముందు మన దేశంలో) బ్లాగులను మరీ కొట్టిపారేయకూడదు. కాకపోతే లింకుచేర్చే వారు పాటించవలసిన నియమాలు రూపొందిస్తే బాగుంటుంది. బ్లాగు స్వంతదారు ఇతర మాధ్యమాలలో పరిచితుడై వుండాలి. రాసిన బ్లాగుపోస్టుపై ప్రజాదరణని తెలిపే కనీస వ్యాఖ్యలు కొన్ని వుండాలి. బ్లాగు వ్యాసం వికీ వ్యాసంలో తెలపని మరిన్ని వివరాలు అందించేదిగా వుండాలి.-- అర్జున 01:13, 9 అక్టోబర్ 2011 (UTC)
Return to "పట్రాయని సంగీతరావు" page.