చర్చ:పాశంవారి వెంకట రామారెడ్డి
పింగళి వెంకట రామారెడ్డి, పాశంవారి వెంకట రామారెడ్డి
మార్చుపింగళి వెంకట రామారెడ్డి, పాశంవారి వెంకట రామారెడ్డి - ఈ ఇద్దరూ వేరువేరు వ్యక్తులు. ఇద్దరూ సమకాలికులు, నిజాం సంస్థానంలో ఉన్నతోద్యోగాలు చేసినవారే. ఇద్దరికీ విషయ ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ ఇద్దరూ ఒక్కరే అని పొరబడడం వలన తికమక ఏర్పడింది. దాన్ని తీసేస్తున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 04:52, 14 ఏప్రిల్ 2024 (UTC)
రాజా బహదూర్ వెంకట్రాం రెడ్డి వ్యాసంలోని అంశాలు
మార్చు> కోట రక్షణకు కొత్వాల్! ఇప్పటి అర్థంలో సిటీ (రాజధాని) పోలీస్ కమిషనర్! హైదరాబాద్ స్టేట్ చరిత్రలో ‘కొత్వాల్’ పదవి పురాతనం, శక్తిమంతం అని విదేశీ యాత్రికులు తమ రచనల్లో ‘కొత్వాల్’ను ఉదహరించారు. అందరిలో అద్వితీయుడు రాజబహదూర్ వెంకట్రామిరెడ్డి! ఆయన చివరి కొత్వాల్. తొలి హిందువు. రాష్ట్ర పోలీస్ అకాడమీ ‘రాజబహదూర్ వెంకట్రామిరెడ్డి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ’గా కొత్తపేరు అలంకరించుకున్న నేపథ్యంలో ఆయన జీవన తరంగాలను తలుచుకుందాం...
> మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి సంస్థానం, రాయనిపేట గ్రామంలో వెంకటరామిరెడ్డి 1869 ఆగస్ట్ 22న జన్మించాడు. తండ్రి 8 గ్రామాల పటేల్. వనపర్తి రాజాకు మేనల్లుని కుమారుడు. వెంక ట్రామిరెడ్డి పుట్టిన మూడు రోజులకు తల్లి, ఎనిమిదో ఏట తండ్రి చనిపోయారు. మేనమామ విలియం వాహెబ్ సంరక్షణలో పెరిగాడు. వాహెబ్‌ను అందరూ క్రిస్టియన్ అనుకునేవారు. వనపర్తి రాజా తన పిల్లలకు చదువు నేర్పేందుకు కేథలిక్ టీచర్‌ను నియమించాడు. ముస్లిం పాలకవర్గాల విద్యార్థుల పేర్లకు భిన్నంగా, పిలిచే ందుకు వీలుగా క్రిస్టియన్ పేర్లు పెట్టాడు. ఊర్లో చదువయ్యాక వెంకట్రామిరెడ్డి వనపర్తి వచ్చాడు. అక్కడ రెండో రాజా రామేశ్వరరావు సహవిద్యార్థి.
> వేర్వేరు జిల్లాల్లో పనిచేశాడు వెంకట్రామిరెడ్డి. సైన్యం నుంచి తప్పించుకున్న ఓ ఇంగ్లిష్ వ్యక్తిని నిజామాబాద్‌లో పట్టుకున్నందుకు రూ.11 బహుమానం పొందాడు. ఆయన సమర్థత, కుటుంబ నేపథ్యం పదోన్నతులకు దోహదం చేశాయి. స్టేట్ పోలీస్ చీఫ్ హెమ్కిన్.. వెంకట్రామిరెడ్డిని రాజ్యంలో ఉత్తమ పోలీస్‌గా ఎంపిక చేశాడు.
> హైదరాబాద్ శివారు జిల్లా (అత్రాఫ్-ఇ-బల్దా) అధికారిగా పదోన్నతి పొందాడు. ఈ నేపథ్యంలో రాజేశ్వరరావు-2 వన పర్తి రాజా అయ్యాడు. తన ఎస్టేట్‌కు కార్యదర్శిగా ఉండమని వెంకట్రామిరెడ్డిని ఆహ్వానించాడు. అదే సమయంలో హైదరాబాద్ కొత్వాల్‌గా బాధ్యతలు తీసుకున్న నవాబ్ ఇమాదత్ జంగ్ అసిస్టెంట్ కొత్వాల్‌గా వెంకట్రామిరెడ్డిని నియమించుకున్నాడు. 1920లో ఇమాదత్ జంగ్ చనిపోయే వరకు ఆరేళ్లు నగర పోలీస్ విభాగంలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టాడు.
> నిజాం తన పుట్టిన రోజు సందర్భంగా కొత్వాల్ వెంకట్రామిరెడ్డికి రాజబహదూర్ బిరుదునిచ్చాడు. మరుసటి ఏడాది బ్రిటిష్ ప్రభుత్వం ‘ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్’తో సత్కరించింది. అనేకసార్లు పదవీకాలం పొడిగించిన తర్వాత 1934లో ‘కొత్వాల్’ పదవీ విరమణ చేశాడు. జీతంలో సగం మొత్తం అనే ఆనవాయితీకి భిన్నంగా అంతకుమించి, నెలకు రూ.వెయ్యి నిజాం పెన్షన్‌గా మంజూరు చేశాడు. 1920 మార్చి 19 నుంచి 1934 జూలై 1 వరకూ 14 ఏళ్ల సుదీర్ఘకాలం కొత్వాల్‌గా పనిచేసిన రాజ బహదూర్‌ను మరుసటి రోజు నుంచే నిజాం తన ప్రైవేట్ ఎస్టేట్‌కు స్పెషల్ ఆఫీసర్‌గా నియమించాడు. తన వారసులు చేసిన అప్పులపై విచారణ జరిపేందుకు రాజ బహదూర్ అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేశాడు.
> ప్రభుత్వోద్యోగం చేస్తూ సమాజ సేవ చేసిన అరుదైన వ్యక్తి వెంకట్రామిరెడ్డి. తనలా గ్రామీణ ప్రాంతాల ప్రజలు బొటాబొటి చదువుకు పరిమితం కాకుండా ఉన్నత చదువులు చదవాలని.. అందుకు దోహదపడాలని భావించారు. అబిడ్స్‌లో 1918లో ‘రాజ బహదూర్ వెంకటరామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించారు. రెడ్డి హాస్టల్ నెలకొల్పారు. తన కులస్తులే కాదు ఇతర బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేశారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ బి.సత్యనారాయణరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి, యూజీసీ చైర్మన్ జి.రాంరెడ్డి, అనేక మంది న్యాయమూర్తులు, లాయర్లు, డాక్టర్లు ఈ హాస్టల్‌లో ఉండి చదువుకున్నవారే!వేలాదిమంది ఆయన గుప్తదానాల గురించి చెబుతారు. చట్టసభలో సభ్యుడిగా బాల్య వివాహాల రద్దుకు, వితంతు వివాహాల ప్రోత్సాహానికి మద్దతునిచ్చారు.
> 1956లో ఆయన పరమపదించారు. అప్పటి ఆయన పెన్షన్‌లో మిగులు ధనం రూ.30. ఒక పోలీసు ఉన్నతాధికారికి ప్రజలు పలికిన నీరాజ నానికి ప్రతీకగా.. నారాయణగూడ సర్కిల్‌లో వెంకట్రామిరెడ్డి విగ్రహం దర్పంగా, సౌజన్యంగా కనిపిస్తుంది. ప్రముఖ విద్యావేత్త కట్టమంచి రామలింగారెడ్డి మాటల్లో.. రాజ బహదూర్ ఛాతియే కాదు- హృదయమూ విశాలమే! ఉన్నతాధికారి మాత్రమే కాదు - నిస్సహాయులను ఆదుకున్న ఉత్తముడు! వ్యక్తులకు నమ్మకమైన మిత్రుడు. అంతేనా..! జనానికి కామ్రేడ్! -- 14:48, 22 నవంబర్ 2017 115.248.116.57 (9,257 బైట్లు) (+9,257)