తల్లిదండ్రులకు పుట్టిన వారు చిన్నప్పుడు పిల్లలు (Children) అంటారు. వాక్యముని శుద్ధి పరచాలేమో??--బ్లాగేశ్వరుడు 10:34, 30 అక్టోబర్ 2007 (UTC)

శుద్ధిపరచిన అందరికి ధన్యవాదాలు --బ్లాగేశ్వరుడు 11:45, 30 అక్టోబర్ 2007 (UTC)

శాంభవి ఉండాల్సింది గుడిలో కాదు బడిలో

మార్చు

వీరభోగ వసంతరాయలు మళ్లీ పుడతాడు. టిబెట్‌కు స్వాతంత్య్రం వస్తుంది. చైనా నాశనమవుతుంది' అంటూ పెద్ద పెద్ద మాటలను ముద్దు ముద్దుగా వల్లించిన చిన్నారి పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్‌ దాఖలైంది.'ఆమెను ఉంచాల్సింది గుడిలో కాదు.. బడిలో' అంటూ అంతర్జాతీయ మానవవాద హేతువాద సంఘాల సమాఖ్య, అధికార భాషా సంఘం, అస్మిత, జన విజ్ఞాన వేదిక తదితర సంఘాలు శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేశాయి.రాష్ట్ర ప్రజలందరి ముందు నిరాటంకంగా, బాహాటంగా, బహిరంగంగా జరుగుతున్న బాల్యావస్థ దుర్వినియోగాన్ని (చైల్డ్‌ అబ్యూజ్‌) అడ్డుకోవాలని బాబు గోగినేని , ఏబీకే ప్రసాద్ ‌, వోల్గా , అచ్యుత్‌రావు , కొండవీటి సత్యవతి , కోటపాటి మురహరిరావు , టీవీ రావు ,చంద్రలత మానవ హక్కుల సంఘానికి విజ్ఞప్తి చేశారు. చిన్నారి శాంభవిపై మతం పేరిట జరుగుతున్న దోపిడీని అడ్డుకోవాలని కోరారు.నాలుగో ఏటనే ఆమెను సన్యాసినిగా మార్చడాన్ని తప్పుపట్టారు. సంరక్షకురాలిగా చెప్పుకొంటున్న ఉషారాణి శిక్షణలో శాంభవి వయసుకు మించిన మాటలు మాట్లాడుతోందని ఆరోపించారు. విజ్ఞానాన్ని సముపార్జించకుండా చేయడంతోపాటు ఆమెను ఆటపాటలకు దూరం చేస్తున్నారని, దానిని నిరోధించాలని హక్కుల కమిషన్‌ను అభ్యర్థిస్తున్నామని స్పష్టం చేశారు.శాంభవి తన వారసురాలు కావొచ్చన్న సంకేతాలిచ్చిన దలైలామా పాత్రను కూడా నిర్ణయించాలని కోరారు. దీనిపై మానవ హక్కుల కమిషన్‌ అధ్యక్షుడు జస్టిస్‌ బి.సుభాషణ్‌రెడ్డి స్పందించారు. శాంభవి తల్లిదండ్రుల వివరాలు, వారు ఎక్కడుంటున్నారు? ఒకవేళ వారు లేకపోతే చట్టబద్ధ సంరక్షకులెవరు? తదితర విషయాలను ఈ నెల 30లోగా తెలియజేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు."శాంభవిని క్షుద్రమైన పనుల కోసం వినియోగిస్తున్నారు. ఆమెను ముద్దుబిడ్డగా చూడాలి. భారత్‌-చైనా సంబంధాలను చెడగొట్టడంలో దలైలామా పాత్ర ఉంది' అని అధికార భాషా సంఘం అధ్యక్షుడు, సీనియర్‌ పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్‌ వ్యాఖ్యానించారు.బేబీ శాంభవిని నిర్బంధించి చిలక పలుకులు నేర్పించారు. శాంభవిని మామూలు బాలిక మాదిరిగా మనందరి ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం, న్యాయస్థానాల మీద ఉంది అని వోల్గా అభిప్రాయపడ్డారు.(ఆంధ్రజ్యోతి21.11.2009)

Return to "పిల్లలు" page.