చర్చ:పెళ్ళి కాని పిల్లలు (1961 సినిమా)
ముందు కలిసుంటా... తర్వాతే పెళ్లి! అయినా అమ్మ ఏమీ అనదు కాబోయేవాడిలో నాన్న సుగుణాలుండాలి ఇషాడియోల్ వెల్లడి పెళ్లికి ముందే కాబోయే వాడితో కొంతకాలం కలిసుంటాను. తర్వాత అతను నచ్చితేనే పెళ్లి చేసుకుంటాను...' అని నటుడు ధర్మేంద్ర , అందాల తార హేమమాలిని గారాల పట్టి అయిన ఇషా డియోల్ చెప్పింది. ఇందుకు అమ్మ కూడా ఎదురు చెప్పదని విశ్వసిస్తున్నట్లు తెలిపింది. తనకు కాబోయే భర్తలో మాత్రం తన తండ్రి సుగుణాలు కచ్చితంగా ఉండి తీరాలంటోంది. 'ప్రేమ వివాహం పై నాకు నమ్మకుముంది. మా నాన్న లాంటి సుగుణాలున్న అందగాడి కోసం వేచి చూస్తున్నా'అని ఇషా తన మనసులో మాట చెప్పింది. 'తనకు కాబోయే వాడిలో తన తండ్రి గుణాలు కొన్నైనా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుందని నా అభిప్రాయం. నేను కూడా అదే కోరుకుంటున్నా. ప్రస్తుతానికి మా నాన్న తో మాత్రమే నేను సన్నిహితంగా ఉన్నాను. నాన్న గుణాలు నచ్చాయి. అందుకే నాకు కాబోయేవాడు కూడా మా నాన్నలాగే ఉండాలనుకుంటున్నాను'అని ఇషా పేర్కొంది. అయితే మరోపక్క 25 ఏళ్ల ఇషాకు తల్లిదండ్రులుపెళ్లి సంబంధాలు చూస్తున్నారు. 'మా అమ్మ ఆధునిక మహిళ . ఒకవేళ నేను పెళ్లికి ముందే ఒకరితో కొన్నేళ్లు కలిసి ఉన్నా ఏమీ అనదు. కనీసం రెండేళ్లు కలసి ఉండాలనుకుంటున్నాను. తర్వాతే అతనితో పెళ్లి గురించి ఆలోచిస్తా'అని ఇషా వివరించింది.విడాకులు తీసుకున్నాక ఓ వ్యక్తి మంచివాడా, కాదా? అని ఆలోచించడం కంటే పెళ్లికి ముందే అర్థం చేసుకోవడం మంచిది కదా? అని ప్రశ్నించింది. 'నాకు, అమ్మకు కూడా డ్యాన్స్, నటన అంటే ఇష్టం. అందువల్ల ఇద్దరం చాలా విషయాలు పరస్పరం పంచుకుంటాం. అంతేకాదు జీవితంలో అమ్మ ఇప్పటి వరకు ఎన్నో విషయాల్లో నాకు బాసట గా నిలిచింది' అని ఇషా వివరించింది.(ఈనాడు 5.9.2008)
పెళ్ళి కాని పిల్లలు (1961 సినిమా) గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. పెళ్ళి కాని పిల్లలు (1961 సినిమా) పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.