తండ్రి

(నాన్న నుండి దారిమార్పు చెందింది)

కుటుంబములోని సంతానానికి కారకులు తల్లితండ్రులు. వీరిలో పురుషున్ని తండ్రి, అయ్య లేదా నాన్న (Father) అంటారు. తండ్రిని కొంతమంది డాడీ, పా లేదా పాపా అని కూడా పిలుస్తారు. ఒక పెద్ద కుటుంబంలో ఒక వ్యక్తి (స్త్రీ/పురుషుడు) యొక్క తండ్రికి అన్నయ్య ఆ వ్యక్తికి పెత్తండ్రి లేదా పెదనాన్న అంటారు. అలాగే తల్లి యొక్క అక్క భర్త కూడా ఇదే వరసగా భావిస్తారు.

కుమారున్ని ఎత్తుకున్న తండ్రి

బాధ్యతలు

మార్చు

మన సంఘంలో కని పెంచే బాధ్యత తల్లిది అయితే, పోషించే బాధ్యత తండ్రిదని బావిస్తారు. తండ్రి మూలంగా పిల్లలకు సంఘంలో గుర్తింపు, ఆస్తి హక్కు లాంటివి వస్తాయి. ఈ వ్యవస్థని పితృస్వామ్య వ్యవస్థ అంటారు . కొన్ని సంస్కృతలలో తల్లి పరంగా గుర్తింపూ, ఆస్తి హక్కు వస్తాయి, వీటిని మాతృ స్వామ్య వ్యవస్థ అంటారు. ఉదాహరణకి మన దేశంలో మేఘాలయలో నివసించే ఖాసీ తెగ ఒక మాతృస్వామ్య వ్యవస్థ

దత్తత వెళ్లినా సొంత తండ్రి తండ్రే

మార్చు

కుమారుడు మరో ఇంటికి దత్తత వెళ్లినంత మాత్రాన అసలు తండ్రితో సంబంధాలు పూర్తిగా తెగతెంపులు చేసుకున్నట్లు కాదు. అసలు తండ్రి కుటుంబ సభ్యుడే.బహుమతి ఒప్పంద దస్తావేజును(గిఫ్టు డీడ్‌) కుటుంబ సభ్యుల మధ్య రాసుకుంటే దాని రిజిస్ట్రేషన్‌కు ఒక శాతం స్టాంపు రుసుం చెల్లిస్తే సరిపోతుంది. అదే దస్తావేజును కుటుంబేతర సభ్యులతో రాసుకొంటే 6 శాతం రుసుం కట్టాలి. (ఈనాడు7.3.2010)

 
విశాఖలో ఒక తండ్రి కూతురు
  • కన్నతండ్రి
  • పెంచిన తండ్రి
  • దత్తత తీసుకున్న తండ్రి
  • వీర్యదానం ఇవ్ననఈ తండ్రి

పితృ సమానులైన వ్యక్తులు

మార్చు

పిత్రు సమానులైన వారిని పితరులు లేదా పితృలు అంటారు. అటువంటి వారిలో పదనొక్కమంది: ఉపాధ్యాయుడు లేదా గురువు, తండ్రి, అన్న, ప్రభువు, మేనమామ, మామగారు, అభయప్రదాత, మాతామహుడు, పితామహుడు, బంధువు (ఆత్మ బంధువు), తండ్రి సోదరుడు

నిర్ధారణ

మార్చు

ఒక బిడ్డకు తండ్రి ఎవరు అన్నది ఒక్క తల్లికి మాత్రమే తెలుస్తుంది అన్నది ప్రాచీనకాలం నుంచి వస్తున్న తల్లి మీద నమ్మకం.

ఆధునిక కాలంలో కొన్ని కారణాల మూలంగా శాస్త్రీయంగా పరీక్షల ద్వారా ఒక వ్యక్తికి తండ్రి ఎవరు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవచ్చును.

  • ఎ.బి.ఓ. రక్త వర్గాల పరీక్ష
  • హెచ్.ఎల్.ఎ. ప్రతిరక్షకాల పరీక్ష
  • డి.ఎన్.ఎ. పరీక్ష - అన్నింటికన్నా నిర్ధిష్టమైనది.

సినిమాలు

మార్చు

పితృహత్య

మార్చు

పితృహత్య (Patricide) అనగా (i) ఒకరి తండ్రిని చంపే చర్య, లేదా (ii) తండ్రిని చంపిన వ్యక్తి. మహాభారతంలో బభ్రువాహనుడు తండ్రిని హతమార్చిన వ్యక్తిగా నిలిచిపోయాడు. పితృ లేదా మాతృ హంతకులను దేవుడు పిడుగుపాటుతో చంపుతాడని చైనీయుల నమ్మక.

"https://te.wikipedia.org/w/index.php?title=తండ్రి&oldid=2957139" నుండి వెలికితీశారు