చర్చ:బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన

తాజా వ్యాఖ్య: వ్యాసం తొలగించాలి టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ఈ వ్యాసాన్ని తొలగించాలి. ఎందుకంటే

  1. ఇది ఒక నాటకం యొక్క పూర్తి పాఠం. కాపీ రైట్ సమస్యలు ఉన్నాయి. రచయితే ఇక్కడ పెడుతున్నా - వికీ దానికి స్తానం కాదు, వికీసోర్స్లో ఉంచాలనుకుంటాను.
  2. ఈ నాటకం గురించి, దానికి వచ్చిన అవార్డులు గురించి, పుస్తకంగా ప్రచురించారా, లేదా, తొలి ప్రచురణ ఎక్కడ, కవర్ పేజీ వంటి వివరాలతో - ఈ నాటకానికి అర్హత ఉంటే వికీలో ఒక పుట సృష్టించవచ్చు, అంతే కాని ఇలా నాటకం మొత్తం వికీలో వ్రాయకూడదు. Chavakiran 20:08, 9 జూలై 2011 (UTC)Reply


  • రచయిత సమాధానం:
  • ఈ నాటకం నా స్వీయ రచన , ఇంత వరకు ఎక్కడా ప్రచురింపబడ లేదు. దీనిని టి.వి .సీరియల్'గా తీయాలని అబిలషించిన వారి కోసం ఇది వ్రాయబడింది. కాని ఆ సీరియల్ మొదలు కాలేదు. నిర్మాతలు ధన సంచయం చేయలేక పోవడమే దానికి కారణం. దీనికి అవార్డులు కాని, ప్రచురణ గాని లబించలేదు/ జరగలేదు
  • దీనిని మొదటిసారిగా నా బ్లాగులో ( క్షీరగంగలో) ప్రచురించాను. దానిని చదివిన కొంతమంది పాఠకులు , వికీపీడియాలో' పెట్టమని సలహా ఇవ్వడం వల్ల నేను ( ఎ.శ్రీధర్ ) పెట్టాను. ఈ కథ పురాణాలలో ఉన్నదే గాని, నా స్వకపోల కల్పన కాదు.
  • మొత్తం నాటకాన్ని వికీలో ఎందుకు పెట్టరాదో నాకు అర్థం కాలేదు. ఏమైనా నేను ఈ విషయంగా వాదనకి దిగడానికి సిధ్ధంగా లేను. ఒకవేళ ఇది సరియైన వేదిక కాక పోతే ఇంకేదైనా వేదికని నాకు చూపించండి. ఈ కృతికి కాపీరైటు లాంటి ఇబ్బందులు ఏవీ లేవని తెలియజేస్తున్నాను.
  • ఇక్కడితో దీనికి స్వల్ప విరామ చిహ్నం పెడుతున్నాను.
  • ఇది ఏడుకొండల స్వామి కృతి. అతని అనుగ్రహం ఉంటే తప్పక పూర్తవుతుంది. లేదంటే ఎంత ప్రాప్తి ఉందో అంతే ! అనవసరమైన ఆలోచనలు, వాదనలు చేసి దీనిని పాడుచేయకండి.
  • ఇట్లు అయలసోమయాజుల శ్రీధర్ 10జూలై 2011.

SrIdhar 07:31, 10 జూలై 2011 (UTC)Reply

శ్రీధర్ గారూ, మీ రచనను స్వచ్ఛందంగా అందిరితోనూ పంచుకోవడం అభినందనీయం. అయితే, వికీపీడియా అన్నది దీనికి సరైన వేదిక కాదు. వికీపీడియాలో రచనల గురించి వ్రాయవచ్చు, కానీ రచనలనే ఇక్కడ ఉంచకూడదు. ఒక కారణమేమంటే వికీపీడియా వ్యాసాలను ఎవరైనా ఎప్పుడైనా మార్చవచ్చు. అంటే వ్యాసం కాలానుగుణంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇది మీ రచన కాబట్టి అది ఆరూపంలో అలానే కలకాలం ఉండాలి కదా. ఇకపోతే, మీ రచనకు సరైన స్థానం వికీమూలాలు. వికీమూలాలు అన్న వికీపీడియా యొక్క సహోదర ప్రాజెక్టు. అది అసలు కావ్యాలు మరియు రచనల వంటి మూల పాఠ్యాలకు ఉద్దేశించినది. మీ రచనను వికీమూలాలకు తరలించండి. ఈ విషయంలో సహాయం కావాలంటే అడగండి. నేను గానీ ఇతర ఔత్సాహికులు గానీ మీకు తప్పక సహాయం అందిస్తాం. — వీవెన్ 10:41, 10 జూలై 2011 (UTC)Reply
దీన్ని వికీమూలలకు తరలించినవలసిన పుటగా గుర్తించాను. — వీవెన్ 10:48, 10 జూలై 2011 (UTC)Reply

శ్రీ వివెన్ గారికి, నమస్కారం ! ఈ వ్యాసాన్ని మీరు సూచింనట్లు `వికీ మూలాలుకి' తరలించాను. కాని లింకులు ఎలా ఇవ్వాలో తెలియలేదు. విషయ సూచికకి లింకులిచ్చి పుణ్యం కట్టుకోండి. SrIdhar 15:36, 10 జూలై 2011 (UTC)Reply

  • మధ్యలో చేరుతున్నందుకు క్షమించండి. వ్యాసాన్ని వికీ మూలాలకు తరలించిన తర్వాత రచయిత శ్రీధర్ గారు తదుపరి మార్పుల్ని అక్కడే పూర్తిచేసుకోవచ్చును. వికీపీడియాలో దీనిని ఒక వ్యాసంగా మార్చితే బాగుంటుందని నా అభిప్రాయం. ప్రాధాన్యత, ప్రచురించిన వివరాలు, ముఖ్యమైన విశేషాలు మొదలైనవి ఈ వ్యాసంలో చేర్చవచ్చును. అప్పుడు వికీ పోలసీలకు భంగం కలుగదు కదా.Rajasekhar1961 09:26, 16 జూలై 2011 (UTC)Reply

s:బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన ఇక్కడ చూడండి.

వ్యాసం తొలగించాలి

మార్చు

 Y సహాయం అందించబడింది

ఈ వ్యాసంలోని కాల్పనిక రచన ఇప్పటికే రచయిత అనుమతిపై వికీసోర్సులోకి చేరుకుంది. ఆయనకు మనం చేయదగ్గ వివరణ ఇచ్చాము. వారూ సానుకూలంగా స్పందించారు. ఇక వ్యాసాన్ని వికీపీడియాలోంచి తొలగిస్తే బావుంటుంది. నిర్వాహకులు, అధికారులు ఎవరైనా ఆ పనికి పూనుకోగలరు.--పవన్ సంతోష్ (చర్చ) 11:55, 27 ఫిబ్రవరి 2015 (UTC)Reply

నేను తొలగించుతాను.--అర్జున (చర్చ) 12:50, 4 మార్చి 2015 (UTC)Reply
నేను చాలా కాలం క్రితమే రచయితకు ఈ మొత్తం నాటకాన్ని ఒక వ్యాసంగా మార్చి వ్రాయమని కానీ అతడు పట్టించుకోలేదు. పవన్ సంతోష్ మీరేమైనా దీనిని చాలా టూకీగా ఒక చిన్నవ్యాసాన్ని మాత్రం ఇక్కడ ఉంచి వికీసోర్స్ లోని పూర్తి నాటకానికి లింకులిస్తే సరిపోతుంది. తర్వాత అర్జునగారు దీనిని నిరభ్యంతరంగా తొలగించవచ్చును.--Rajasekhar1961 (చర్చ) 12:57, 4 మార్చి 2015 (UTC)Reply
@Rajasekhar1961 ,వికీసోర్స్ లో ఈవిషయం ఇప్పటికే వున్నది కావున తొలగించాను. కొత్త వ్యాసం ఆసక్తి గల వారు చేయవచ్చు. --అర్జున (చర్చ) 04:05, 5 మార్చి 2015 (UTC)Reply
Return to "బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన" page.