చర్చ:బ్రాహ్మణగూడెం

తాజా వ్యాఖ్య: గ్రామ సమస్యలు టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: కాసుబాబు
బ్రాహ్మణగూడెం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2008 సంవత్సరం, 12 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

గ్రామ సమస్యలు మార్చు

గ్రామ సమస్యలు విభాగం విజ్ఞాన శాస్త్ర వ్యాసం లా లేదు కదా! ఏదో వార్తా పత్రిక వ్యాసం లాగా, బ్లాగు లాగా ఉన్నదిChavakiran 04:43, 17 మార్చి 2008 (UTC)Reply

నాకయితే ఆ వ్యాసం మొదటిపేజీలో ప్రదర్శింపతగినదా అనిపిస్తున్నది. ఇంకా ఎన్నో మంచి వ్యాసాలున్నాయి అనుకుంటున్నాను. ఉదాహరణకు టంగుటూరి ప్రకాశం ఇప్పటివరకు ప్రదర్శింపబడినట్లు దాఖలాలు లేవు. నిర్వాహకులు అందరూ చర్చించి మొదటి పేజీ వ్యాసాల గురించి ఒక క్రమాన్ని నిర్వచించితే మంచిదేమో!--Svrangarao 04:50, 17 మార్చి 2008 (UTC)Reply
పై వ్యాఖ్యలు సకారణమైనవనే ఒప్పుకొంటున్నాను. కాని ఇలా చూస్తే తెలుగు వికీలో సింహ భాగమైన గ్రామాల గురించిన వ్యాసాలు మొదటి పేజీలోకి రావడం అసలు మొదలయ్యే అవకాశమే కనిపించలేదు. 'ఈ వారం వ్యాసం' అంటే ఉత్తమమైన వ్యాసం అని కాకుండా 'మనకున్నంతలో మెరుగు' టైపుగా ఆలోచించాను. వ్యాసాలలో వైవిధ్యం కూడా అవుసరం. షుమారు 20వేల పై చిలుకు గ్రామాల వ్యాసాలలో బ్రాహ్మణగూడెం స్థాయిలో ఉన్న వ్యాసాలు వంద కూడా లేవేమో. ఏమైనా తెలుగు వికీ స్థాయి 'ఈ వారం వ్యాసం'లో ప్రతిబింబించక మానదు. వికీ నాణ్యత పెరిగే కొద్దీ మొదటి పేజీ వ్యాసాల స్థాయి కూడా పెరుగుతుందనుకొంటాను. ఇలాంటి లోపాలు కూడా చదువరులు గమనించే అవకాశం ఉండాలని, వాటిని మెరుగుపరచడం ప్రోత్సహించాలని నా అభిప్రాయం. టంగుటూరి ప్రకాశం వ్యాసం వీటికంటే మంచిదే. పొరపాటుగా విస్మరింపబడింది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 06:06, 17 మార్చి 2008 (UTC)Reply
అవును నేను కాసుబాబుగారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. ప్రస్తుత తెలుగువికీ నాణ్యతను ప్రతిభింబించే ఇలాంటి వ్యాసాలనే మొదటి పేజీలో ప్రదర్శిస్తే, తెలుగు వికీని మెరుగు పరచటానికి బోలెడంత అవకాశం ఉందని, వాటిని మెరుగుపరచటానికి ముందుకొచ్చేవారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. __మాకినేని ప్రదీపు (+/-మా) 12:05, 17 మార్చి 2008 (UTC)Reply
వేరే పేజీనుండి ఇక్కడికి మార్చబడిన చర్చ--

కాసుబాబు గార్కి, మా వూరి రైల్వే స్టేషన్ బ్రాహ్మణగూడెం చిత్రం చూసి చాలా ఆశ్చర్యపోయాను ఆనందించాను.మీరు ఎపుడు తీశారో కానీ (వీలైతే చెప్పండి) లోటు పూడ్చినందుకు చాలా సంతోషం. ఈ వారం వ్యాసం గా వుంచినందుకు కృతజ్ణతలు. ---Geddambabu

రైలులో విశాఖపట్నం వెళుతూ తీశాను! --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:11, 19 మార్చి 2008 (UTC)Reply

చావా కిరణ్ గారి వ్యాఖ్య చదివిన తరువాత నాకూ అదే అభిప్రాయం కలిగింది.కొంత మార్చాను.అవసరమైన మార్పులు చేద్దామని మనవి. రంగారావ్ గారి అభిప్రాయం తో ఏకీభవిస్తున్నాను. అదే సమయంలో కాసు బాబు మరియు ప్రదీప్ లతో పూర్తిగా ఏకీభవిస్తున్నా.సభ్యులను ఉత్సాహ పరచటానికి తద్వారా గ్రామాల గురించి మరింత సమాచారం రాబట్టడానికి ఇలాంటి చర్యలు అవసరమని నా అభిప్రాయం. ---Geddambabu

Return to "బ్రాహ్మణగూడెం" page.