చర్చ:భర్త పట్ల క్రౌర్యం

తాజా వ్యాఖ్య: వికీ కోట్ లో ఈ వ్యాసం లోని వ్యాఖ్యలు టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith

వీర శశిధర్ గారూ, మీరు ఈ వ్యాసాన్ని భర్తపై క్రూరత్వం అని వ్రాసారు. బాగుంది. కానీ ఆంగ్లంలో Violence against men మరియు Domestic violence against men వ్యాసాలు కూడా చూడండి. వాటిలో దేనికైనా ఈ వ్యాసం లింకు ఇవ్వవచ్చునేమో పరిశీలించండి.-- కె.వెంకటరమణ 16:58, 23 మార్చి 2015 (UTC)Reply

అలా మార్చాలంటే పై ఈ వ్యాసాన్ని పురుషులపై గృహహింస మరియు పురుషులపై క్రూరత్వం అనే వ్యాసాలలో ఏదో ఒకదానికి దారిమార్పు చేయాలి.-- కె.వెంకటరమణ 17:00, 23 మార్చి 2015 (UTC)Reply
నాకు అర్ధం అయినంత వరకు ఇది ప్రత్యేకంగా వివాహం తర్వాత భర్తలపైన భార్యలు జరుపుతున్న అఘాయిత్యాల గురించి మాత్రమే. మీరు చూపిస్తున్న రెండు వ్యాసాలు పురుషులపై స్త్రీలు లేదా ఇతరులు జరిపే హింసాత్మక చర్యలుగా భావించాలి.--Rajasekhar1961 (చర్చ) 04:44, 24 మార్చి 2015 (UTC)Reply

అభిప్రాయం మార్చు

కె.వెంకటరమణగారూ, నా లాంటి వికీపీడియనుల వ్యాసాలకి సొబగులు అద్దుతూ, అసంపూర్ణంగా ఉన్న వ్యాసాలని పూరిస్తూ నిర్వహణా బాధ్యతలు చేపట్టి తెవికీ నాణ్యతా ప్రమాణాలని పెంచే ప్రయత్నంలో మీ కృషి అసమానం. మీ వంటి వారి సలహాలు/సూచనలు నేను ఎప్పటికీ స్వాగతిస్తాను. ఈ వ్యాసానికి ఈ పేరే ఎందుకు ఎంచుకొన్నానో వివరించదలచుకొన్నాను. ఇవి పూర్తిగా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు.

  • భారతీయ శిక్షాస్మృతిలో సైతం దీని పేరు Cruelty Against Husband యే
  • పురుషుడు అనగా విస్తృతమైన అర్థం వస్తుంది. నిత్యజీవితంలో పురుషుడు పోషించే పాత్రలు అనేకం. తండ్రి/పిన తండ్రి/పెద తండ్రి, తాతయ్య, మేనమామ, అన్న, తమ్ముడు, స్నేహితుడు. భర్తతో పోలిస్తే వీరి పై జరిగే క్రూరత్వం తక్కువే.
  • ఒకవేళ అటువంటి క్రూరత్వాలు ఉన్నా అవి వేరే వ్యాసాలుగా ఉంచటమే సరి అని నా అభిప్రాయం

- శశి (చర్చ) 05:28, 24 మార్చి 2015 (UTC)Reply

శశి గారూ ఈ వ్యాసం బాగుంది. ఇలానే ఉంచినా మంచిదే. మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తాను. ధన్యవాదాలు. పైన తెలుపబడిన ఆంగ్ల వ్యాసాలను కూడా సృష్టించి విస్తరించే ప్రయత్నం చేద్దాం-- కె.వెంకటరమణ 09:25, 24 మార్చి 2015 (UTC)Reply

శుద్ధి మార్చు

శాస్త్రి గారు, ఎంతో ఓపికతో ఈ వ్యాసం లోని అక్షర/వ్యాకరణ దోషాలని సవరిస్తున్నందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా సంస్కృతములో నున్న వ్యాఖ్య యొక్క భావముని సరి చేసినందుకు కృతజ్ఞతలు. చిన్నప్పటి నుండి నేను ఆంగ్ల మాధ్యమం లోనే చదివాను. 'ని ' తప్పని, 'ను ' సరియని నాకు తెలియదు. మీ ద్వారానే తెలుసుకున్నాను. క్రూరత్వం పదం లేదని, సరియైన పదం క్రౌర్యం అని కూడా మీరే నాకు తెలియజేశారు. ఈ వ్యాసం పేరు కూడా భర్త యెడల క్రౌర్యము అనే పేరే సరియైనది అంటారా? సూచించగలరు. యెడల అంటే మరీ గ్రాంథికం అవుతుందేమో అని చిన్న మీమాంస. పట్ల అయితే అందరికీ అర్థం అయ్యేలా ఉంటుందని నా అభిప్రాయం. - శశి (చర్చ) 14:09, 24 జూలై 2015 (UTC)Reply

ఈ వారం వ్యాసం మార్చు

  భర్త పట్ల క్రౌర్యం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2015 సంవత్సరం, 47 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

 
Wikipedia

వర్గం:మూలాలు లోపించిన వ్యాసాలు మార్చు

 Y సహాయం అందించబడింది

ఈ వ్యాసానికి తగినన్ని మూలాలు ఉన్నవి కావున "మూలాలు లోపించిన వ్యాసాలు" వర్గం ఉండవలసిన అవసరం లేదని నా (వ్యక్తిగత) అభిప్రాయం. చర్చించగలరు. - శశి (చర్చ) 07:23, 25 సెప్టెంబరు 2015 (UTC)Reply

శశి గారూ, మీరు రాసిన విషయాలన్నింటికీ మూలాలు ఉన్న మాట వాస్తవం అయినా " క్రితంతో పోలిస్తే ఇప్పుడు వరకట్న వేధింపులు, గృహహింస తగ్గుముఖం పట్టాయనే చెప్పాలి" అనే వాక్యం సరియైనది అనుటకు మూలాలు ఏవీ లేవు. అందువల్ల ఆ వాక్యం చివర {{fact}} మూసను చేర్చడం జరిగినది. ఆ మూసను చేర్చిన వ్యాసాలన్నింటికీ కొన్ని వాక్యాలకైనా మూలాలు లేనందున "మూలాలు లోపించిన వ్యాసాలు" వర్గం వస్తుంది.-- కె.వెంకటరమణచర్చ 15:12, 25 సెప్టెంబరు 2015 (UTC)Reply
ధన్యవాదాలు కె.వెంకటరమణ గారు! ఈ వ్యాసం ఈ వారం వ్యాసానికి ప్రతిపాదించబడినది కావున, "మూలాలు లోపించిన వ్యాసాలు" అనే వర్గం ఉండకపోవటమే మంచిదని నేననుకొంటున్నాను. ఈ వర్గం ఉండటానికి కారణం ఆ వాక్యమే అయితే, ఎలాగూ దానికి మూలాలు లేవు కావున, ఆ వాక్యాన్ని, (ఇంకా అటువంటి వాక్యాలను) తీసివేయటమే మంచిది అని నాకు అనిపిస్తోంది. మూలాలు దొరికినపుడు మరల మనం తగిన వాక్యాలను చేర్చుకొనవచ్చును. (ఈ వ్యాసం విస్తరణ ఇంతటితో ఆగిపోదు, ప్రత్యేకించి మూలాలు. ఎందుకంటే, భారతదేశంలో పురుషుల హక్కుల ఉద్యమం విస్తరిస్తోన్న నాకు అందులో ఈ వ్యాసానికి సంబంధించిన మూలాలు కూడా లభ్యమౌతున్నాయి. పురుషవాదానికి సంబంధించి భవిష్యత్తులో నేను వ్రాయబోయే మరిన్ని వ్యాసాలలో సంబంధిత మూలాలు నాకు మరిన్ని దొరకవచ్చును!) ఈ వర్గం ఉన్ననూ, "ఈ వారం వ్యాసానికి" వచ్చిన ఢోకా ఏమీ లేదన్నచో, ఈ వర్గం అలానే ఉంచేసినా ఫర్వాలేదు. తదనుగుణంగా మార్పులు చేయగలరని మనవి. - శశి (చర్చ) 13:15, 26 సెప్టెంబరు 2015 (UTC)Reply

వికీ కోట్ లో ఈ వ్యాసం లోని వ్యాఖ్యలు మార్చు

 Y సహాయం అందించబడింది

ఈ వ్యాసంలోని వ్యాఖ్యలు వికీ కోట్ లో చేర్చవచ్చునా? ఇందులో పలు న్యాయమూర్తుల, న్యాయవాదుల, పురుషవాదుల, స్త్రీవాద వ్యతిరేకుల, కుటుంబ సంరక్షక కాంక్షితుల వ్యాఖ్యలు ఉన్నవి. వాటికి తగినన్ని మూలాలు కూడా ఉన్నవి. ఒక వేళ చేర్చవచ్చునంటే వీటిని చేర్చి, ఇతర పురుషవాద/స్త్రీవాద వ్యతిరేక వ్యాఖ్యలను కూడా చేర్చుతాను. ప్రత్యేకించి వికీ వ్యాఖ్యలో మూలాల చేర్పు గురించి కూడా తెలుపగలరు. (మూలాలు లేవు కావున వీటిని తొలగించాలి అనే అభిప్రాయం భవిష్యత్తులో రాకూడదు అనే ఉద్దేశ్యంతో చెబుతున్నాను.) చర్చించగలరు - శశి (చర్చ) 14:29, 14 అక్టోబరు 2015 (UTC)Reply

శశి నా ఉద్దేశ్యం ప్రకారం న్యాయవాదులు,న్యాయమూర్తులు అనేక మంది వివిధ రకాలుగా వ్యాఖ్యలు వ్రాసియుండవచ్చు. కానీ ఆయా వ్యక్తులు నోటబిలిటీ లేనివారైతే వారి వ్యాసాలు లభ్యము కావు. వారు ఒక సందర్భంలో ఒక వ్యాఖ్య చేసి ఉంటారు. ఒక వ్యాఖ్య కొరకు వ్యాసం అవసరం లేదనుకుంటాను.! కనుక వికీ వ్యాఖ్య లో కూడా "భర్త పట్ల క్రౌర్యం" వ్యాసం మొదలుపెట్టి అందులో ఆయా న్యాయమూర్తుల వ్యాఖ్యలను చేర్చవచ్చు. మూలాలు కూడా చేర్చవచ్చు.-- కె.వెంకటరమణచర్చ 15:16, 18 అక్టోబరు 2015 (UTC)Reply
Return to "భర్త పట్ల క్రౌర్యం" page.