చర్చ:మర్రి చెన్నారెడ్డి

తాజా వ్యాఖ్య: 13 సంవత్సరాల క్రితం. రాసినది: రవిచంద్ర
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


ఇన్నయ్య చెప్పిన విశేషాలు అనే విభాగంలో ఆధారాలు చూపించండి. ఆయన ఎక్కడ చెప్పారు? ఏ పుస్తకంలో చెప్పారు? అనే విషయాలు తెలియజేయాలి. లేకపోతే ఈ విషయాలు వ్యాసం నుంచి తొలగించబడతాయి. --రవిచంద్ర (చర్చ) 05:05, 15 ఏప్రిల్ 2010 (UTC)Reply

ఇన్నయ్య చెప్పిన విశేషాలు మార్చు

  • దేవర్స్ బాబా కాలు చెన్నారెడ్డి నెత్తిపై పెట్టి దీవించాడు. ఆయన ఉత్తర ప్రదేశ్ లో ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుండే బాబా. అక్కడ డా. చెన్నారెడ్డి గవర్నర్ గా చేశారు. ఆ ఫోటో సెక్యులరిస్ట్ ఇంగ్లీషు మాస పత్రికలో ముఖచిత్రంగా వేశారు. చెన్నారెడ్డి ఆగ్రహంతో ఊగిపోయి, ఆ పత్రికను చూపి విసిరికొట్టి, నా మీద నీకు ఎంత కోపం ఉంటే మాత్రం ఇలా చేస్తావా అన్నాడు.[ఆధారం చూపాలి]
  • స్వతంత్ర పార్టీ ఆవిర్భవించిన తొలి రోజులలో విజయవాడలో ఆచార్య రంగా మొదలైన వారి సమక్షంలో జరిగిన సభలో చెన్నారెడ్డి ఆవేశంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ లో ఉండేబదులు, కృష్ణలో దూకి చావటం మేలని చప్పట్ల మధ్య ప్రసంగించారు. తరువాత కాంగ్రెస్ లో చేరిపోయారు.
  • నా మీద ఎంత కోపమున్నా, మరొక పక్క ఆదరంగానే చూసేవాడు. చెన్నారెడ్డి రాగ ద్వేషాలు విపరీతంగా ఉన్న వ్యక్తి. ఆగ్రహావేశాలని దాచుకోకుండా వ్యక్తం చేసేవాడు. తులాభారాలు, జరిపించిన తీరు జనాకర్షణ అయింది. చెన్నారెడ్డి నిర్భీతిగా వ్యవహరించేవారు. సభలలో తనకు ఇష్టమైనవారిని స్టేజిమీదకు పిలిచి కూచోబెట్టేవారు. అలాంటి అదృష్టం శ్రీమతి దుర్గా భక్తవత్సలం వంటివారికి దక్కింది. చెన్నారెడ్డి పదవిలో వుంటే క్షేమం అని వి.బి. రాజు అనేవాడు. శత్రువులను సైతం లోబరచుకున్న రాజకీయ చతురత ఆయనకున్నది. తనపై పోటీ చేసిన వందేమాతరం రామచంద్రరావును పిలిచి అధికార భాషాసంఘాధ్యక్షుణ్ణి చేసిన చెన్నారెడ్డి, అరమరికలు లేకుండా తన మామ పేరిట కె.వి.రంగారెడ్డి జిల్లా అని రూపొందించారు. మార్క్సిస్టు పార్టీ నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్యను డ్రైనేజి బోర్డు ఛైర్మన్‌గా ఒప్పించటం చెన్నారెడ్డికే తగింది.
Return to "మర్రి చెన్నారెడ్డి" page.