చర్చ:మురుడేశ్వర ఆలయం

మురుడేశ్వర ఆలయం వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, 01 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


మురుదేశ్వర అనే కన్నడ పదానికి మురుడేశ్వర్ అని తెలుగు లో వ్రాయడం (దీనిని తెంగ్లీకరణం : ఇంగ్లీషు ద్వారా తెలుగు లోకి రావడం అందాం)సబబు కాదు. ----కంపశాస్త్రి 13:15, 15 ఆగష్టు 2007 (UTC)
మురుడేశ్వర్ అని అనడమే సరి అని నాఅభిప్రాయం, కన్నడ పదం చూడండి మురుడేశ్వర అని ఉంటుంది, కాని మనం తెలుగు లొ మురుడేశ్వర్ అని పొల్లు తో అనడమే ఉత్తమమేమో ఆలో చించండి. కన్నడ పదాల మీద జరిగిన చర్చ కి ఒకసారి ఈ పేజిలు చూడండి చర్చ:చికమగలూరు జిల్లాచూడండి--మాటలబాబు 13:22, 15 ఆగష్టు 2007 (UTC)
తెలుగు పదాలు సాధారణంగా అచ్చు(vowel) శబ్దంతో అంతమవుతాయని చెబుతారు. అందుకనేదీనిని "Italian of the east" అని అంటారు. ఆ లెక్కన చూస్తే "మురుడేశ్వర" అని పెట్టటమే సరయినది. __మాకినేని ప్రదీపు (+/-మా) 14:02, 15 ఆగష్టు 2007 (UTC)
హలాంతము మాట ఎలాఉన్నా కన్నడలో మురుడేశ్వర అని ఉంది కదా మరి మురుదేశ్వర అని ఎందుకు రాశారు ?? తెలుగు వాళ్ళు ఎలా పిలిస్తే అలాగే రాయాలని నా ఉద్దేశము ఉదాహరణకి ఢిల్లీ అన్నదానికి స్థానిక హిందుస్తానీ పదం ధిల్లీ, ఆంగ్ల పదం డెల్హీ. స్థానిక పదం ఉపయోగించాలని ధిల్లీ అనట్లేదు కదా? అలాగే ఇంకో ఉదాహరణ భువనేశ్వర్ ని స్థానికంగా ఒరిస్సాలో బొబనేశ్వర్ అంటారు. కాబట్టి మనకు తెలిసిన పదాలనే ఉపయోగిద్దామని నా అభిప్రాయం --వైజాసత్య 14:46, 15 ఆగష్టు 2007 (UTC)
అవును "మురుదేశ్వర"ని నేను మొదట చర్చా పేజీలో ఉన్న అచ్చుతప్పు అని అనుకున్నాను, వ్యాసంలో కూడా అలాగే ఉంది. కన్నడవాళ్ళు కూడా "మురుడేశ్వర" అనే పలుకుతారు, "మురుదేశ్వర" అని కాదు. __మాకినేని ప్రదీపు (+/-మా) 15:14, 15 ఆగష్టు 2007 (UTC)
తప్పు సరిదిద్దుకున్నాను. మృదేశ్వర అంటే మట్టి లో ఉన్న ఈశ్వరుడు. దాని భ్రష్ట రూపం మురుదేశ్వర. ఇది మరీ భ్రష్టమై మురుడేశ్వర గా మారిందేమో. ----కంపశాస్త్రి 16:28, 15 ఆగష్టు 2007 (UTC)
అయ్యా మీరు తప్పు సరిదిద్దు కోవడం కాదు, కాలంలొ పదాలు భ్రష్టు పట్టి పోయి ఇలా అవుతున్నాయి. నేను మురుడేశ్వర్ దేవాలయాన్ని దర్శించాను , అక్కడ కన్నడ వాళ్ళు కూడా మురుడేశ్వర అనే పిలుస్తున్నారు. పదం వివరం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మృదుమృత్=మట్టి అని తెలిపి నందుకు ధన్యవాదాలు--మాటలబాబు 23:54, 17 ఆగష్టు 2007 (UTC)
మృత్ అంటే మన్ను,మృత్+ఈశ్వర = మృదేశ్వర.ఇందులో మృదు అనే పదం లేదు.----కంపశాస్త్రి 03:24, 18 ఆగష్టు 2007 (UTC)
సరిచేసినందుకు ¡ధన్యవాదాలు --మాటలబాబు 03:31, 18 ఆగష్టు 2007 (UTC)

మురుడేశ్వర ఆలయం గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
Return to "మురుడేశ్వర ఆలయం" page.