చర్చ:రామ రాయ
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
నమార్పులు
మార్చుఆంగ్ల వికీ లోని వ్యాసము నుండి మరియూ చారిత్రక గ్రంథముల నుండి సమాచారము సేకరించి మార్పులు చేయుచుంటిని.Kumarrao 06:46, 25 మే 2009 (UTC)
రామరాయలు కుతుబ్‌షా వద్ద పనిచేశాడా?
మార్చురామరాయలు కుతుబ్‌షా వద్ద పనిచేశాడనీ, అటుపైన ఆదిల్‌షా సేనలు అతని దుర్గాన్ని కొల్లగొట్టగా పారిపోయి కుతుబ్‌షాను ఆశ్రయించాడనీ, పిరికిపందవు నీవు నా సైన్యంలో ఉండతగవని అతను పంపేశాడనీ ఫెరిస్తా అనే చరిత్రకారుడు ఒక అనామక చరిత్రకారుని మాటలు నమ్మి వ్రాశారు. అదంతా సరికాదంటూ ప్రముఖ చరిత్రకారులు చిలుకూరి వీరభద్రరావు పరిశోధించి అళియ రామరాయలు అనే గ్రంథంలో ప్రతిపాదించారు. చరిత్ర నిలువనీరు కాదు కనుక ఈ పుస్తకాన్ని సహ వికీపీడియన్లు మొదటి రెండు అధ్యాయాలు చదివి ఆ వివరం చేరుద్దామా అన్న విషయంపై నిర్ణయించగలరు. ఎంత ప్రామాణికంగా కనుక్కున్నా భారతీయులు కొత్త వివరాలు చరిత్రలో చేర్చరన్న అపవాదు తప్పిదాం. --పవన్ సంతోష్ (చర్చ) 17:31, 27 జూన్ 2014 (UTC)