చర్చ:లాల్ బహదూర్ శాస్త్రి
సరీయైన పేరు "లాల్ బహాదుర్ శాస్త్రి". నిసార్ అహ్మద్ 16:13, 17 డిసెంబర్ 2008 (UTC)
2016 ఏప్రిల్ 16న అనామక వాడుకరి చేర్చిన మూలాలు లేని సమాచారం
మార్చుశాస్త్రి గారి మరణం ఇప్పటికీ మిస్టరీయే.. ఈ దేశంలో అలాంటి నాయకుడిని మళ్లీ చూస్తామా?? దేశ ప్రధాని కాకముందు లాల్ బహదూర్ శాస్ర్తీ గారు ఉత్తరప్రదేశ్‌లో అలహాబాద్ మునిసిపల్ ఎన్నికలలో గెలిచారు. దానితో సహజంగా ‘‘అలహాబాద్ ఇంప్రూవ్‌మెంట్ ట్రస్టు’’కు కూడా ట్రస్టీ అయ్యారు. అపుడు అక్కడ ‘టాగూర్‌నగర్’ అనే పేరుతో 1/2 ఎకరా భూమిని ప్లాట్లుగా విభజించి వేలానికి పెట్టారు. శాస్ర్తీగారు వూళ్ళో లేని సమయంలో, ఆయన అంతరంగిక మిత్రుడొకాయన కమీషనర్‌ను కలిసి ‘శాస్ర్తీ’గారికి సొంత ఇల్లులేదు. కాబట్టి ట్రస్టు సభ్యులందరూ ఒక్కో ప్లాటు దక్కించుకొనేలాగా ఒప్పించి, తనకు శాస్ర్తీగారికి ఒక్కో ప్లాటు సంపాదించగలిగాడు. ఆ విషయాన్ని శాస్ర్తీగారి భార్య లలితాశాస్ర్తీగారితో చెపితే ‘‘పోనీలెండి, అన్నయ్యగారూ, మీ ప్రయత్నం కారణంగా ఇన్నేళ్ళకు ‘స్వంత ఇల్లు’ అనే మా కల నెరవేరబోతుంది అని సంతోషించారట. రెండురోజుల తరువాత అలహాబాద్ తిరిగొచ్చిన శాస్ర్తీగారికి ఈ విషయం తెలిసింది. ఆయన చాలా బాధపడ్డారు. తన ఆంతరంగిక మిత్రుడిని పిలిచి ‘‘నాకు ఈ విషయం తెలిసినప్పటినుండి రాత్రిళ్ళు నిద్రపట్టడం లేదు. మనం ప్రజాప్రతినిధులం. ప్రజలముందు నిజాయితీగా నిలవాల్సిన వాళ్ళం. నేను నా ప్లాటును వాపసు ఇచ్చేస్తున్నాను. మీరుకూడా వాపసు ఇచ్చేయండి. లేదా రాజీనామాచేసి, సాధారణ పౌరుడిగా వేలంపాటలో పాల్గొని, కావాల్సి వుంటే ప్లాటును దక్కించుకోండి,’’అని చెప్పి ప్లాటును ట్రస్టుకే వాపసు ఇచ్చేసారట. జీవితాంతం స్వంత ఇల్లులేకుండానే జీవించారు. లాల్ బహదూర్‌శాస్ర్తీ దేశ ప్రధానమంత్రి అయిన తరువాత కూడా ఆయన కొడుకులు సిటీ బస్సుల్లోనే ప్రయాణించేవారు. కొందరు స్నేహితులు ఈ విషయంగా కొంచెం గేలిచేయడంతో, కారు కొనమని వాళ్ళు తండ్రి (శాస్ర్తీగారు) మీద వొత్తిడిచేస్తే ఇష్టంలేకపోయినా, ఆయన అక్కడక్కడ అప్పులుచేసి ఒక ఫియట్‌కారు కొన్నారు. కారు కొనేందుకు చేసిన అప్పు ఇంకా 4600 రూపాయలుండగా శ్రీ శాస్ర్తీగారు మరణించారు. ఈ విషయం దినపత్రికల్లో వచ్చిందట. దేశవ్యాప్తంగా శాస్ర్తీగారి అభిమానులు, ఆయన భార్య శ్రీమతి లలితాశాస్ర్తీగారికి మనీఆర్డర్ చేశారట. రెండు సంవత్సరాలపాటు ఆమె మనిఆర్డర్‌లు అందుకొన్నారట. కానీ ఆమె, డబ్బు పంపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలతో ఉత్తరం వ్రాస్తూ, డబ్బును కూడా వాపసు పంపించేసారట. మరో సందర్భంలో, లాల్‌బహదూర్‌శాస్ర్తీ ప్రధానిగా ఉన్న సమయంలో వారి పెద్దకొడుకు హరికృష్ణశాస్ర్తీ అశోక్ లేలాండ్ సంస్థలో ఉద్యోగం చేస్తుండేవారు. ఆ సంస్థవారు హరికృష్ణశాస్ర్తీకి సీనియర్ జనరల్ మేనేజర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. సంతోషించిన హరికృష్ణశాస్ర్తీ మరుసటిరోజు, లాల్ బహదూర్ శాస్ర్తీ గారికి ఈ విషయం తెలిపారు. ఒక నిమిషం ఆలోచించి, ‘‘హరీ, ఆ సంస్థ, ఆకస్మాత్తుగా నీకెందుకు ప్రమోషన్ ఇచ్చిందో నేనూహించగలను. కొన్నిరోజుల తరువాత, ఆ కంపెనీవాళ్ళు ఏదో ఒక సహాయంచేయండని నాదగ్గరకు వస్తారు. నేను వారికాసహాయం చేస్తే దేశ ప్రజలు దాన్నెలా అర్ధంచేసుకుంటారో నాకు తెలుసు, నీకూ తెలుసు. పాలకుల యొక్క నిజాయితీని ప్రజలు శంకించేలాగా జీవించడానికి నేను వ్యతిరేకం. కాబట్టి నీవు వెంటనే ఆ సంస్థలో నీ ఉద్యోగానికి రాజీనామా చేయి. నేను ప్రధానిగా వున్నంతకాలమూ నీవు ఆ సంస్థలో ఉద్యోగం చేయడానికి లేదు’’ అన్నారట. అటువంటి వ్యక్తిత్వాన్ని నేటి వ్యవస్థలో చూస్తామా? ప్రజల సొమ్ము చేతికి అంటకుండా బ్రతకగల నాయకులు మళ్లీ ఈ నేల మీద పుడతారా? పుట్టినా మనగలరా?? ఆలోచించాల్సిన విషయమే కదా...!
బోస్‌కు, గాంధీ అనుచరులకు మధ్య సైద్ధాం తిక వైరుద్యాలున్నాయన్నది జగద్వితం. హిట్లర్‌కు సహక రించడంతో బ్రిటీష్ ప్రభుత్వం బోస్‌పై కక్షగట్టింది. వారి మెప్పు కోసం గాంధీ అనుచరులు కూడా బోస్‌ను దేశద్రోహిగా చిత్రించే యత్నం చేశారు. దేశంలో దీర్ఘకాలం గాంధీ, నెహ్రూ వారసులే పాలకులుగా ఉన్నారు. దీంతో బోస్ మరణం ఇప్పటికీ చరిత్రలో ఓ రహస్యంగానే ఉండిపోయింది. దీన్ని ఛేదించే ప్రయత్నం ఇంతవరకు జరగలేదు. కానీ లాల్ బహదూర్ శాస్త్రి విషయం వేరు. ఆయన గాంధీ అనుచరుడు. నెహ్రూకు సహచరుడు. నెహ్రూ తర్వాత దేశ రెండో ప్రధానిగా ఆయన వ్యవహరించారు. ప్రధాని హోదాలోనే అప్పటి సోవి యట్ వె ళ్ళారు. అదికూడా పాక్‌తో జరుగుతున్న యుద్ద విరమణ ఒప్పందంపై సంత కాలు చేసేందుకు. తాష్కెంట్ (ఇది ప్రస్తుతం ఉజ్బెకిస్థాన్‌లో ఉంది) లో 1966జనవరి 10న ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఆ మర్నాడే జనవరి 11న ఆయన హృద్రోగంతో అక్కడే మరణించారు. ఓ దేశాధినేత అదీ మరో దేశానికి అతిధిగా ఒప్పందాలపై సంతకాలు చేసేం దుకెళ్ళి అక్కడే అసహజ, అనుమానాస్పదంగా మృతి చెందడం చరిత్రలో అంతకుముందెప్పడూలేదు.. ఆ తర్వాతె ప్పుడూ జరగలేదు. అయినా ఇంతవరకు శాస్త్రి మరణంపై సమగ్ర దర్యాప్తు చేపట్టలేదు. ఒకట్రెండు దర్యాప్తులు జరిగినా వాటి ఫలితాలు వెల్లడికాలేదు. ఆఖరకు వాటికి సంబంధించిన పత్రాలు కూడా ఇప్పుడు అందుబాటులో లేవు. వాస్తవానికి శాస్త్రి అనంతరం సొంత పార్టీ నేతలే దీర్ఘకాలం అధికారంలో ఉన్నారు. వారెవరికీ శాస్త్రి మరణం పట్టలేదు. కనీసం మరణం వెనుక ర హస్యాన్ని ఛేదించాలన్న ఆలోచన కూడా రాలేదు. ఎన్‌డిఎ అధికారంలోకొచ్చాక ఒక్కొక్కటిగా చరిత్రను తవ్వుతోంది. చరిత్రలోని లోపాల్ని సవరించేందుకు పూనుకుంది. చారిత్రక అవశేషాలుగా మిగిలిన పలు శేష ప్రశ్న లకు సమగ్ర దర్యాప్తుకు పూనుకుంది. ఇందులో భాగంగానే బోస్ కుటుంబీకులపై నెహ్రూ ప్రభుత్వం ఉంచిన దీర్ఘకాలపు నిఘాను పత్రాల్తో సహా బట్టబయలుచేసింది. ఇదే రీ తిలో శాస్త్రి మరణంపై ఉన్న సందేహాల నివృతికి కూడా మోడి ప్రభుత్వం ప్రయత్నించాలన్న డిమాండ్ వెల్లువెత్తుతోంది. తాష్కెంట్ ఒప్పందం చేసుకున్న మర్నాడే శాస్త్రి మరణించారు. ఈ మరణం హృద్రోగం వల్ల సంభవించిందని సోవియట్ ప్రభుత్వం ప్రకటించింది. భారత ప్రభుత్వం దీన్నే ధ్రువీకరించింది. కానీ ఆధారాల మేరకు శాస్త్రి బౌతికఖాయా నికి పోస్టుమార్టం నిర్వహించలేదు. అంతకుముందెప్పుడూ శాస్త్రికి ఎలాంటి అనారోగ్యం లేదు. విషప్రయోగం వల్లే శాస్త్రి మరణించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.దీనిపై కేంద్రం రాజ్‌నారాయణ్ కమిటీని నియమించింది. ఈ కమిటీ అధ్య యనం నివేదిక ఇప్పటివరకు వెలుగుచూడలేదు. ఆఖరకు ఇది భారత పార్లమెంట్ లైబ్రరీలో కూడా అందుబాటులో లేదు. దీన్ని కావాలనే మరుగున పర్చారు.. లేదా ధ్వంసం చేసుంటారన్న ఆరోపణలున్నాయి. వాస్తవానికి పాక్‌తో యుద్ధం చివరిదశకొచ్చింది. భారత్ విజయంవైపు దూసుకు పోతోంది. ఈ దశలో ఐక్యరాజ్యసమితి పాక్‌తో విరమణ ఒప్పందాన్ని ప్రతిపాదించింది. అప్పటికే శాస్త్రి యుద్ద వీరుడిగా దేశంలో జేజేలందుకుంటున్నారు. ఈ దశలో ఒప్పందానికి అంగీకరించే విధంగా శాస్త్రిపై తాష్కెంట్‌లో తీవ్ర ఒత్తిళ్ళొచ్చా యన్న ఆరోపణలున్నాయి. భారత్‌కు తెచ్చిన శాస్త్రి భౌతికకాయం నీలంరంగులోకి మారుంది. శరీరంపై కొన్ని గాట్లు కూడా గమనించినట్లు ఆయన భార్య లలితాశాస్త్రి గుర్తిం చారు. శాస్త్రి ఆఖరుగా ఆయన కుమార్తె సుమన్‌తో మాట్లా డారు. ఫోన్‌లో మాట్లాడుతూ పాలుతాగి పడుకుంటానని చెప్పారు. ఈలోగా ఫోన్‌లైన్ డిస్కనెక్ట్ అయింది. తర్వాత దాదాపు పదిహేనునిమిషాలకు పైగా సుమన్‌లైన్ కోసం ప్రయత్నించారు. ఆ తర్వాత లైన్ దొరికింది కానీ శాస్త్రి ఎత్తలేదు. సోవియట్‌కు చెందిన ఓ అధికారి ఫోన్ ఎత్తారు. మీ తండ్రిగారు ఇప్పుడే మరణించారని సుమన్‌కు చెప్పారు. అంతవరకు ఎలాంటి అరోగ్యకర ఇబ్బందుల్లేని వ్యక్తికి ఒకవేళ గుండెపోటు సంభవించినా కేవలం పదిహేనునిమిషాల్లో మృత్యువాత పడతాడా అన్న సందేహాలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. శాస్త్రి వెంట ఆయన వ్యక్తిగత వైద్యుడు ఆర్‌ఎన్ చుగ్ కూడా తాష్కంట్ వెళ్ళారు. ఆయనా పక్కగదిలోనే ఉన్నారు. కనీసం శాస్త్రికి గుండెపోటు వచ్చిందన్న విషయాన్ని ఆయన వ్యక్తిగత వైద్యుడికి కూడా సోవియట్ అధికారులు వెల్లడించలేదు. మరణించిన తర్వాతే ఆ విషయాన్ని చెప్పారు. 1977లో శాస్త్రి మరణంపై దర్యాప్తుకు ఓ కమిటీని నియమించారు. ఈ కమిటీ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు డాక్టర్ చుగ్ బయలుదేరారు. కారులో ఢిల్లిd వైపు ప్రయాణిస్తుండగా ఎదురుగా ఓ లారీ వచ్చి ఢీ కొట్టింది. చుగ్ అక్కడికక్కడే మరణించారు. అలాగే శాస్త్రి వ్యక్తిగత సేవకుడు రామ్‌నాధ్ కూడా ఆయన్తో పాటు తాష్కండ్ వెళ్ళాడు. మృతదేహం వెంటే ఆయనా తిరిగొచ్చారు. ఆయన్నుకూడా కమిటీ సాక్షిగా పరిగణించింది. వాంగ్మూలం నమోదుకు పిల్చింది. మోతీలాల్‌నెహ్రూ మార్గ్‌లోని తన నివాసం నుంచి ఆయన ఒక్కడుగు బయటకేయగానే ఎదురుగా ఓ వాహనం వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రామ్‌నాధ్ రెండుకాళ్ళూ నుజ్జునుజ్జు అయ్యాయి. తలకు బలమైన గాయాలయ్యాయి. ఆయన గతాన్ని మర్చిపోయారు. 2009లో దక్షిణాసియాపై సిఐఎ దృష్టి పేరిట అనుజ్‌ధార్ అనే రచయిత పుస్తకం రాసేందుకు ఉపక్రమించారు. ఇందుకోసం శాస్త్రి మరణానికి సంబంధించిన పత్రాలు కావాలంటూ సమాచారహక్కు చట్టం క్రింద భారత ప్రధాని కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. వీటి జారీకి పిఎమ్‌ఓ నిరాకరించింది. పైగా ఈ పత్రాల జారీ భారత సార్వభౌమత్వానికి, అంతర్గత భద్రతకు, ఆర్థిక ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని అతనికిచ్చిన రాతపూర్వకలేఖలో పిఎమ్‌ఓ అధికారులు పేర్కొ న్నారు. పైగా వీటిని ఓ డాక్యుమెంట్‌గానే పరిగ ణిస్తున్నట్లు పిఎమ్‌ఓ వెల్లడించింది. భారత ప్రధాని అసహజ, అనుమానాస్పద మరణానికి సంబం ధించిన అత్యంత విలువైన సమాచారాన్ని సాధారణ డాక్యుమెంట్‌గా పిఎమ్‌ఓ పరిగణించడం కూడా అనేక సందేహాలకు తావిస్తోంది. శాస్త్రి మరణం నాటికే భారత్, సోవియట్‌ల మధ్య విస్తృతమైన మైత్రిబంధముంది. దీంతో మరణం వెనుక సోవియట్ హస్తాన్ని ఎవరూ సందేహించలేదు. అప్పటికే యుద్ధంలో పాక్ ఓటమిదశకు చేరుకుంది. నిబంధనలు అడ్డురావడంతో ప్రత్యక్షంగా సాయం చేయకపోయినా అమెరికా పరోక్షంగా పాక్‌కు అండగా నిల్చింది. ఈ కారణంగా సిఐఎ ప్రమేయాన్ని కూడా తక్కువగా అంచనావేయలేం. పైగా ఆ సమయంలో సిఐఎలో డైరెక్టర్ ఆఫ్ ప్లాన్స్‌గా ఉన్న రోబర్డ్ క్రోలీ అమెరికాకు చెందిన గ్రెగరీడగ్లస్ అనే జర్నలిస్ట్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ శాస్త్రితో పాటు భారత అణు పితామహుడు డాక్టర్ హోమీబాబా మరణాలకు సిఐఎ ప్రణాళికలు రచించి అమలు చేసిందని వెల్లడించారు. అయితే తన మరణానంతరమే ఈ ఇంటర్వ్యూను ప్రచురించాలని ఆయన డగ్లస్‌ను కోరారు. శాస్త్రి, హోమీబాబా మరణాలు ఒకేనెల్లో జరిగాయి. రెండిం టికి మధ్య రెండు వారాల వ్యవధే ఉంది. పైగా ఈ రెండు దేశానికి వెలుపలే చోటు చేసుకున్నాయి. శాస్త్రి మరణంలో హృద్రోగాన్ని సాకుగా చూపితే బాబా మరణానికి పైలెట్ తప్పిదాన్ని కారణంగా ప్రచారం చేశారు. 60వ దశకంలో అమెరికాకు సహకరించని వివిధ దేశాల నేతల్ని హతమార్చడం సిఐఎ పనిగా పెట్టుకుంది. 1960నుంచి 65మధ్యలో క్యూబా అధ్యక్షుడు ఫెడరల్ క్యాస్ట్రోపై అనేక సార్లు దాడులు చేసింది. భారత్ అణు కార్యక్రమాన్ని నిలిపేయడానికి అంగీకరించలేదు. పైగా అమెరికాకు సహకరించే పాక్‌పై విజయానికి చేరువలో ఉంది. ఈ రెండు కార ణాలు శాస్త్రిపై సిఐఎ పగపెంచుకోవడానికి దారితీసుం టాయన్న సందేహాలున్నాయి. 10:03, 16 ఏప్రిల్ 2016 నాటి కూర్పు 175.101.68.61
నాణ్యత తనిఖీ జాబితా
మార్చు- ప్రస్తుత సమస్యలు క్రింద ఇవ్వబడినవి. మీరు గుర్తించిన సమస్యలు చేర్చండి లేక సమస్యలు లేకపోతే కొట్టివేసినట్లుగా చూపండి.
Wikipedia:నాణ్యత తనిఖీ జాబితా
WikiProject Physics Quality Control నుండి తెలుగుకి అన్వయింపబడింది
దీనిలోని అంశాలను తొలగించవద్దు. ఉపయోగం కాకపోతే లేక అంశం తనిఖీ తరువాత సరిగా వుందనిపిస్తే
<s>కొట్టివేయవలసిన పాఠ్యం</s>)
విభాగంలోని వాటినన్ని తనిఖీ చేసి సమస్యలు లేకపోతే విభాగం శీర్షిక రంగుని ఎరుపునుండి ఆకుపచ్చకి మార్చండి.
ఈ జాబితా ఎవరైనా వడవచ్చు
దీనిని సంబంధిత వ్యాస చర్చా పేజీలో చేర్చుటకు {{subst:వికీపీడియా:నాణ్యత తనిఖీ జాబితా}} మొదటి విభాగానికి ముందుగా చేర్చి భద్రపరచండి.
- Add/Expand :
- The following sections needs to be expanded/created :
- Lead
- Overview
- References
- Lists
- See also
- Disambiguation :
- The following elements needs to be disambiguated :
- The following pages should redirect here :
- Consider referring these section to a main article :
- The following elements may be too technical for the casual reader, consider defining and explaining them to non-experts:
- Merge/Split :
- Consider merging or splitting these sections with another article, or merging another article's section with this one (give reason):
- Infoboxes and Navboxes :
- Update :
- These sections or statements are out of date :
- Cleanup
- Article MoS Compliance :
- Acronyms and abbreviations are spelled out on first use
- Appropriate use of reference templates
- En dashes, em dashes, hyphens, and minus signs are properly used
- External Links
- Images/Diagrams
- Captioned
- Correctly aligned
- Copyediting :
- 'completed
- Wikilink :
- The following elements needs to be wikilinked :
- People
- Experiments
- First use of units
- Do not wikilink/autoformat dates and years. Consider placing a link to pages such as 2003 in Physics in the "See Also" section rather than writing "Jimmy Longshort discovered this phenomena on January 15, 2003".
- Verify :
- The following needs to be verified :
- Values of the various constant and measurements
- Factual accuracy
- References
- Name of the article
- Up-to-date-ness
- Problems:
- The following problems have been identified :
- Talk Page :
- Please structure and clean up the talk page according to this:
- Archive old and irrelevant discussions
- Consider structuring discussion according to "topics"
- Sort boxes in this order (consider adding them if they aren't there):
- {{skiptotoctalk}}
- {{talkheader}}
- {{ArticleHistory}}
- Wikiprojects (browse to find other relevant projects)
- If there are more than one WikiProject, use {{WikiProjectBanners}} and order them alphabetically within the banner.
- WP 0.5/1.0 Editorial Team,
- WP Echo
- Other boxes
- To do box
- Archive box
- Update importance and rating
- Categorize
- Make sure the article is properly categorized :
- Do not overcategorize
- Categorize alphabetically
- Copyright :
- The following elements are copyrighted and are not fair use.
- Requests :
- Consider making a request to these people (give reason):
- Miscellaneous remarks :