చర్చ:విజయవాడ పట్టణ మండలం
తాజా వ్యాఖ్య: పునర్వ్యవస్థీకరణ 2022 లో ఈ మండలం ఉనికి లేదు టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు
పునర్వ్యవస్థీకరణ 2022 లో ఈ మండలం ఉనికి లేదు
మార్చుఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 లో విజయవాడ పట్టణ మండలం ఉనికిలో లేదు.ఇది అంతకుముందు విజయవాడ రెవెన్యూడివిజనులో ఒక భాగంగా ఉండేది.పునర్వ్యవస్థీకరణలో భాగంగా విజయవాడ పట్టణ మండల స్థానంలో కొత్తగా విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ నార్త్, విజయవాడ తూర్పు, అనే మండలాలు కొత్తగా ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రెవెన్యూడివిజను పరిధిలో కొత్తగా ఈ నాలుగు ఏర్పడినవి.ఈ మండలం ప్రస్తావన ప్రభుత్వ ఉత్తర్వులలో ఎక్కడాలేదు.కావున ఈ మండలం పేజీని తొలగించి, కొత్తగా ఏర్పడిన విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ నార్త్, విజయవాడ తూర్పు అనే మండలాలకు పేజీలు సృష్టించాలి.--యర్రా రామారావు (చర్చ) 17:40, 2 జూన్ 2022 (UTC)
- @యర్రా రామారావు గారు, చారిత్రక వివరాల కొరకు ఉపయోగం కనుక, ఈ వ్యాసాన్ని తొలగించకుండా, చారిత్రక మండలాల వర్గంలో చేర్చటం మెరుగు. అర్జున (చర్చ) 04:26, 3 జూన్ 2022 (UTC)
- చారిత్రిక సమాచారం ఉండాలి కాబట్టి ఈ వ్యాసాన్ని తొలగించరాదు. అలాగే, జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తరువాత వివిధ పేజీల్లో జరుగుతున్న మార్పుచేర్పుల్లో కూడా పాత సమాచారాన్ని తీసెయ్యకుండా, దాన్ని చారిత్రిక సమాచారంగా మార్చి, కొత్త సమాచారాన్ని చేర్చాలి. __చదువరి (చర్చ • రచనలు) 05:07, 3 జూన్ 2022 (UTC)
- చర్చకు అనుగుణంగా వ్యాసం సవరించి, వర్గం:ఆంధ్రప్రదేశ్ చారిత్రక మండలాలు అనే వర్గంలో చేర్చాను. యర్రా రామారావు (చర్చ) 08:19, 3 జూన్ 2022 (UTC)