విజయవాడ పట్టణ మండలం

ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా లోని మండలం


ఆంధ్రప్రదేశ్ లోని పాత కృష్ణా జిల్లాలోని 50 మండలాల్లో విజయవాడ పట్టణ మండలం ఒకటి. ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 లో భాగంగా కృష్ణా జిల్లా పరిధి సవరించి, దీని స్థానంలో విజయవాడ తూర్పు, విజయవాడ మధ్య, విజయవాడ ఉత్తర, విజయవాడ పశ్చిమ అనే నాలుగు మండలాలు ఏర్పడ్డాయి. ఇవి కొత్తగా ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రెవెన్యూడివిజను పరిధిలో భాగం. [3]OSM గతిశీల పటం

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°30′32″N 80°37′08″E / 16.509°N 80.619°E / 16.509; 80.619
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఎన్టీఆర్ జిల్లా
మండల కేంద్రంవిజయవాడ
విస్తీర్ణం
 • మొత్తం62 కి.మీ2 (24 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం10,21,806
 • జనసాంద్రత16,000/కి.మీ2 (43,000/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి994

చరిత్ర

మార్చు

ఈ మండలం ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 కు ముందు విజయవాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండేది. దాని ప్రధాన కార్యాలయం విజయవాడ నగరంలో ఉండేది. ఈ మండలం విజయవాడ గ్రామీణ మండలం. పెనమలూరు మండలాల సరిహద్దులో కృష్ణా నది ఒడ్డున ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ అధికార పరిధిలోని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఈ మండలం ఒక భాగం. [4]

అయితే ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 లో భాగంగా విజయవాడ నగరంలోని గాంధీనగర్ లో ఉండే విజయవాడ అర్బన్ మండల కార్యాలయానికి అశోక్ నగర్, భవానీపురం, కబేళ, కండ్రిక వంటి శివారు ప్రాంతాల్లో నివసించే ప్రజలు వెళ్లేందుకు గత కొన్నేళ్లుగా పడుచున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ప్రజల సౌకర్యార్థం విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, విజయవాడ నార్త్ విజయవాడ వెస్ట్ అనే నాలుగు కొత్త అర్బన్ మండలాలను కృష్ణా జిల్లా పరిధిని సవరించగా కొత్తగా ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రెవెన్యూ డివిజను పరిధిలో భాగంగా ఈ మండలాలను ప్రభుత్వం ఏర్పాటుచేసిింది.[5] దాని ఫలితంగా ఈ మండలం రద్దై చారిత్రాత్మక మండలంగా మిగిలింది.

జనాభా గణాంకాలు

మార్చు

2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా మొత్తం 1,021,806. అందులో 512,417 మంది పురుషులు, 509,389 మంది స్త్రీలు. లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు 994 మంది మహిళలు. ప్రతి 1000 మందికి 309 మంది పిల్లలు 0–6 సంవత్సరాల వయస్సులో ఉన్నారు, వారిలో 51,950 మంది బాలురు 48,359 మంది బాలికలు ఉన్నారు. 749,635 అక్షరాస్యులతో సగటు అక్షరాస్యత రేటు 81.35% వద్ద ఉంది

మండలం లోని పట్టణాలు

మార్చు

విజయవాడ పట్టణ మండలాన్ని పరిపాలనా సౌలభ్యంకోసం 4 విభాగాలుగా విభజించారు

  • విజయవాడ తూర్పు
  • విజయవాడ మధ్య
  • విజయవాడ ఉత్తర
  • విజయవాడ పశ్చిమ

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "District Handbook of Statistics - Krishna District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KRISHNA, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972950, archived from the original (PDF) on 25 August 2015
  3. "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.
  4. "Vijayawada (Urban) Mandal Population Krishna, Andhra Pradesh, List of Villages & Towns in Vijayawada (Urban) Mandal". Censusindia2011.com. Retrieved 2021-08-16.
  5. India, The Hans (2018-09-12). "Urban mandal office divided into 4 offices". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2022-09-30.

వెలుపలి లంకెలు

మార్చు