చర్చ:సంభోగం

తాజా వ్యాఖ్య: Misinformation టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Hhhjjuwiuw2

ఈ విషయం గురించి పరిశోథనలు చాలానే జరిగాయి, జరుగుతున్నాయి, భవిషత్తులో జరుగుతాయి కూడా. "సంభోగం వల్ల ఈ మంచి జరుగుతుంది, ఆ ఉపయోగముంది అని వ్రాసిన విషయాలకు పెద్దగా శాస్త్రీయమైన ఆధారాలేమీ లేవు" అని వైజాసత్యగారి అభిప్రాయం తెలియ చేసారు. ఆది ఆయన 'పర్సనల్ ఒపీనియన్' అని నేను భావిస్తున్నాను. ఓక్కసారి ఆయన శాస్త్రీయంగా, వైజ్గ్నానిక సిద్దాంతా లను అనుసరించి, వివిధ శాస్త్రజ్గ్నులు జరుపిన పరిశోధనలు గురించి కాస్త తెలుసుకుని, వ్రాసివుంటే బాగుండేది. ఆందరికీ అన్నీ తెలియాలని లేదు. అయితే మనకు తెలియని/అవగాహన లేని విషయాల్ని కొట్టిపారేయడం శాస్త్రీయం అనిపించుకోదని నా భావన.

ఇక అసలు విషయానికి వస్తే, వికీపీడియా వ్యాసాలు విషఈకరించి, ఉన్నతమైన స్తాయిలో 'ఇన్ఫర్మేషన్' అందించాలని నాఅభిప్రాయం. ఈ విషయంలో,వైజాసత్యగారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఈ వ్యాసానికి, (అసలు మరే వ్యాసానికి కూడా) అనవసరమైన బొమ్మలు తగిలించకుందా వుంటే బాగుంటుంది. ముఖ్యంగా నీలిఛాయాగ్రహ పటాలు లేకుండా ఉంటే బాగుంటుంది. విషయయం శాస్త్రీయంగా వివరింపబడిందిగా అది చాలు. బలవంతంగా బొమ్మలుగాని, రచనలు గాని తొలగించడం భావ్యంకాదని కినికు వహిస్తున్నాం. ఈ విషయం ఆ బొమ్మ(డాగీ పొజిషన్)పెట్టినవారు, కాస్త సావధానంగా ఆలోచించి, గ్రహిస్తారని తలుస్తాను. గ్రహించి తొలగిస్తారని ఆశిద్దాం. Sampadakudu 07:58, 2 సెప్టెంబర్ 2011 (UTC)

ఈ వ్యాసం యొక్క శైలి

మార్చు

ఇందులోని చాలామటుకు సమాచారం ఒక తెలుగు వారపత్రికలో వచ్చిన వ్యాసం నుండి సేకరించబడినది. వారపత్రికల వ్యాసాలకు, వికీపీడియా వ్యాసాలకు పద్ధతిలోనూ, శైలిలోనూ చాలా తేడా ఉంది. ఉదాహరణకు: సంభోగం వళ్ల ఈ మంచి జరుగుతుంది, ఆ ఉపయోగముంది అని వ్రాసిన విషయాలకు పెద్దగా శాస్త్రీయమైన ఆధారాలేమీ లేవు. అయినా తెలుగు వారపత్రిక పాఠకులు వాటిని ప్రశ్నించరు. కానీ వికీవ్యాసం అలా కాదు. సంభోగంలో పాల్గొన్న స్త్రీ ముఖం వన్నెవస్తుంది అంటే దాన్ని ఎవరు చెప్పారు? ఎక్కడ చెప్పారు? ఏవిటి ఆధారం అని సవాలక్ష ప్రశ్నలు ఉదయిస్తాయి. నిజానికి చాలా విషయాలు అంత ఖరాఖండిగా వ్రాయలేం --వైజాసత్య 06:20, 4 సెప్టెంబర్ 2010 (UTC)


ఈ వ్యాసానికి తగిలించిన బొమ్మను తొలగిస్తే మంచిదని భావిస్తున్నాను --సూరి
అవును. ఈ వ్యాసానికి, ఇలాంటి మరికొన్ని వ్యాసాలకు తగిలించిన బొమ్మలు పెద్దగా ఆయా వ్యాసాలకు అవుసరం లేదు. ఆంగ్ల వికీలో ఉండవచ్చునుగాక. కాని తెలుగు వికీలో ఈ బొమ్మలు ఉండడం నాకు అంతగా నచ్చడం లేదు. సభ్యులు అంగీకరిస్తే నేను ఆ బొమ్మలను తొలగిస్తాను. --కాసుబాబు 17:49, 16 సెప్టెంబర్ 2010 (UTC)
ఒక బొమ్మ ఉంచవచ్చేమో.Kumarrao 17:55, 16 సెప్టెంబర్ 2010 (UTC)
బొమ్మలు తొలగించాల్సిన అవసరమేమీ నాకు కనిపించటంలేదు. కాకుంటే ఇటువంటి వ్యాసాలకు పెద్దలకు మాత్రమే అనే ఒక మూసను పై పేజీలో ఉంచితే బాగుంటుంది. బొమ్మలు కిందికి జరపాలి. Chavakiran 03:20, 17 సెప్టెంబర్ 2010 (UTC)
అవును. కిరణ్ గారు చెప్పింది సబబుగా ఉంది. ఇటువంటి వ్యాసాలలోని బొమ్మలన్నింటినీ వ్యాసం క్రింద ప్రత్యేక విభాగంలో ఉంచితే సరి.--సుల్తాన్ ఖాదర్ 06:38, 17 సెప్టెంబర్ 2010 (UTC)
బాగుంది. ఐతే బొమ్మని చూపించకుండా లింకు మాత్రమే ఇస్తే బాగుంటుంది. మూస ఎత్తుని కూడా ఒక సాధారణ స్థాయి 480 పిక్సెళ్లుకి పెంచితే మంచిది.--అర్జున 15:04, 17 సెప్టెంబర్ 2010 (UTC)
బొమ్మను తొలగించగలరు. అన్ని మీరు సూచించిన విధంగా 18 సం. దాటిన వారే పరిశీలించరు. 18 సం. లోపు వారు కూడా అంతర్జాలం వీక్షిస్తారని గమనించగలరు.Somu.balla (చర్చ) 12:43, 5 ఫిబ్రవరి 2013 (UTC)Reply
సాధారణంగా మేజర్లే తెలుగు వికీపిడియాకు సహకరించడం, వికీపిడియాను వాడుకోవడం జరుగుతుంది. సెక్స్ గురించి సరైన అవగాహన లేకపోవడం వలనే భారతదేశంలో యువత పెడదారి పడుతున్నది. కనుక సరైన బొమ్మలు వుంటేనే ఈ వ్యాసానికి అందం అని నా అభిప్రాయం. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 12:37, 22 ఫిబ్రవరి 2015 (UTC))Reply

Misinformation

మార్చు

ఇందులో స్వలంగ సంపర్కం గురించి misinformation ఉంది Hhhjjuwiuw2 (చర్చ) 12:15, 17 డిసెంబరు 2021 (UTC)Reply

Return to "సంభోగం" page.