చర్చ:స్టార్టప్ కంపెనీ

తాజా వ్యాఖ్య: అనువాదాన్ని మెరుగుపర్చటానికి సూచనలు టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

అనువాదాన్ని మెరుగుపర్చటానికి సూచనలు

మార్చు

User:Nskjnv.indicwiki గారు, తెవికీలో సభ్యులైనందులకు, అనువాద వ్యాసాలపై కృషి చేస్తున్నందులకు అభివందనాలు. గతంలో తెవికీలో అనువాద వ్యాసాల చరిత్ర, పాత చర్చల గురించి మీరు తెలుసుకున్నారని భావిస్తాను.( ఉదాహరణ లింకు) మీ కృషికి మరింత విలువచేరి, భవిష్యత్ లో తొలగింపుకు గురికాకుండా వుండటానికి అనువాద వ్యాసాలపై కొద్ది అనుభవమున్న సభ్యునిగా క్రింది సూచనలు చేస్తున్నాను.

  • అనువాద వ్యాసాల ఎంపిక, తెలుగు పాఠకులకు ఆసక్తి ప్రాధాన్యంగా తీసుకోవాలి. మీ ప్రాతిపదిక ఏమిటో తెలపండి
  • సాంకేతిక, పారిభాషిక పదజాలాన్ని అనువదించినపుడు స్పష్టత కొరకు తొలివాడుక కు ప్రక్కన బ్రాకెట్లలో ఆంగ్ల పదం, తెలుగులో వాడుక పెరిగినట్లైతే తెలుగులిపిలో ఆంగ్లపదం సూచించడం మంచిది. ఉదాహరణకు అంకుర సంస్థ (Startup, స్టార్టప్).
  • ఇతరులు మీ అనువాదం మెరుగు పరచడానికి సహాయం చేయడానికి అనువాద పరికరం వాడితే బాగుంటుంది. దాని ద్వారా మూల వ్యాసం(ఆంగ్ల), ప్రతిపేరాకు చేసిన అనువాదం ఎప్పుడైనా , ఎవరైనా పరిశీలించవచ్చు. అనువాద పరికరంలోని పరిమితి ఇబ్బందికరంగా వుంటే, ఇటీవల రచ్చబండలో తెల్పిన చిట్కాలు వాడండి.
  • తెలుగు వ్యాసం కావున కనీసం ఒక తెలుగు మూలమైన చేర్చి అభివృద్ధి పరచండి.
  • ముఖ్యంగా తెవికీ ఒక సమష్ఠి కృషి వేదిక, కావున చర్చలలో స్పందించండి.

ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 00:10, 3 ఫిబ్రవరి 2021 (UTC)Reply

ధన్యవాదాలు వాడుకరి:Arjunaraoc గారు! మీరు చెప్పిన అనువాద వ్యాసాల సమస్య గురించి రచ్చబండలో చదివాను. అనువాద వ్యాసాల గురించి మీ అనుభవం తెలియజెప్పినందుకు ధన్యవాదములు. నేను రాసిన వ్యాసాలను మరింత మెరుగు పరిచి వికీ శైలికి తగ్గట్టుగా మారుస్తున్నాను. Nskjnv.indicwiki (చర్చ) 17:22, 3 ఫిబ్రవరి 2021 (UTC)Reply
Nskjnv.indicwiki గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. అయితే మీ స్పందన అసంపూర్ణం అనిపించింది ఎందుకంటే నేను తెలిపిన సూచనలు, ప్రశ్నల గురించి స్పందించకుండా, వికీశైలి గురించి మాట్లాడారు. వికీశైలి మంచిదే కాని అదే తొలి ప్రాధాన్యం కాదు. --అర్జున (చర్చ) 21:20, 3 ఫిబ్రవరి 2021 (UTC)Reply
Return to "స్టార్టప్ కంపెనీ" page.