వికీపీడియా:వికీప్రాజెక్టు/అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి

అనువాద ఉపకరణం (Content Translation)[1] 2014 జనవరి లో ప్రారంభమైంది. మెరుగైన ఉపకరణం (v2)[2] 2018 లో విడుదలైంది. ఈ ఉపకరణం వాడకుండా(2014 కు ముందు) మరియు దీనిని వాడి సభ్యులు చాలా వ్యాసాలు అనువదించి సృష్టించడం లేక ఇప్పటికే వున్న వ్యాసాలు మెరుగు చేయడం జరిగింది. కొత్తగా సృష్టించిన వ్యాసాలు కృతకంగా వున్నాయంటు కొన్ని తొలగింపుకు కూడా గురయ్యాయి. ఈ ప్రాజెక్టు లక్ష్యం అనువాద వ్యాసాల నాణ్యతాభివృద్ధి.

ఉపకరణంలో అప్రమేయంగా నాణ్యత పరిరక్షణ క్రియలు మార్చు

mw:Help:Content translation/Translating/Translation quality నుండి అనువాదం.


కంటెంట్ ట్రాన్స్లేషన్ తొలిగా ఇవ్వబడిన యాంత్రిక అనువాదానికి ఎన్ని మార్పులు చేశారో లెక్కిస్తుంది. దీని ద్వారా ఎన్ని పదాలు చేర్చారో, తొలగించారో లేక సరిచేశారో తెలుస్తుంది. ఇది పేరా స్థాయిలో, మొత్తం అనువదించిన వ్యాస స్థాయిలో లెక్కిస్తుంది. ఒక్కో స్థాయికి పరిమితులు క్రింద చెప్పినట్లు వర్తిస్తాయి.


మొత్తం అనువాద స్థాయి మార్చు

మెరుగుపరచిన యాంత్రిక అనువాదం 99% మరియు అంతకంటే ఎక్కువ వుంటే ముద్రణకు అనుమతించదు. దీనివలన చెడుగా వాడడం కట్టడి చేయబడుతుంది. ఈ పరిమితి వికీ భాషని బట్టి సవరించవచ్చు.

పేరా స్థాయి మార్చు

పేరా స్థాయి మెరుగుపరచిన యాంత్రిక అనువాదం 85 శాతంకంటె ఎక్కువ వుంటే సమస్య పేరాగా పరిగణించబడుతుంది. ప్రతి పేరాకు హెచ్చరిక చూపబడుతుంది. దీనివలన వాడుకరి అనువాదాన్ని మెరుగు చేసే వీలుంది.

కొన్ని సందర్భాలలో ముద్రణకు అనుమతించితే ఆ పేజీని సమీక్ష చేయాల్సిన పేజీల వర్గంలో చేర్చుతుంది. ఇతర సందర్భాలలో ముద్రణకు అనుమతించదు. ఈ క్రింద పేర్కొన్న అంశాలు ముద్రణకు అనుమతించాలా లేదా అన్నది ప్రభావితం చేస్తాయు.( ఇవి ఇంకా పరిశోధన లో వున్నాయి.)


  • సమస్యాత్మక పేరాల సంఖ్య సమస్యాత్మక పేరాల సంఖ్య50 కంటే ఎక్కువ వుంటే ముద్రణ అనుమతించదు. అవి 10 నుండి 49 వరకు వుంటే ముద్రణ అనుమతిస్తుంది, పేజీ సమీక్ష వర్గంలో చేర్చబడుతుంది.
  • ఇటీవల తొలగింపులకు గురైన అనువాదాలు. ఇటీవల తొలగింపులకు గురైన అనువాదాలు చేసిన రచయితల అనువాదాలకు పరిమతి మరింత తగ్గుతుంది. 10 కంటే ఎక్కువ సమస్యాత్మక పేరాలుంటే ముద్రణ అనుమతి వుండదు. 1 నుండి 9 వరకు ముద్రణ అనుమతి వుంటుంది, పేజీ సమీక్ష వర్గంలో చేర్చబడుతుంది.
  • వాడుకరి సమ్మతి. సమస్యాత్మక పేరాలను పరిశీలించి వాడుకరి సమ్మతిస్తే, అనువాద స్థాయి పరిమిత సడలించబడుతుంది. 95% కంటే ఎక్కువ ,99% కంటే తక్కువ యాంత్రిక అనువాదం వున్నా ముద్రణ అనుమతి వుంటుంది. ఇలా చేయటం వలన యాంత్రిక అనువాద నాణ్యత బాగా వున్న సందర్భాలను అనుమతిస్తు, దురుపయోగాన్ని అరికట్టగల సౌకర్యం వుంది.

పరిమితులు వర్తించని భాగాలు మార్చు

మూలాలు, ఉపయుక్తగ్రంధాల విభాగాలకు పరిమితులు వర్తించవు. చాలా చిన్న విభాగ శీర్షికలకు, పట్టికలు, సమాచారపెట్టెలు కూడా పరిమితులు వర్తించవు.

యాంత్రిక అనువాద స్థాయి గణాంకాల పరిశీలన ఉపకరణం మార్చు

ఉపకరణంలో దోషం వలన ముద్రణ ప్రయత్నించినా ముద్రించకపోతే లేక, ఏ ముద్రించిన అనువాద వ్యాసానికైనా యాంత్రిక అనువాద స్థాయి, ఇతర గణాంకాలు, మూల వ్యాస సమాచారం, తొలిగా ఇవ్వబడిన యాంత్రిక అనువాదం, వాడుకరి మార్చిన యాంత్రిక అనువాదం, వ్యాస మునుజూపు, వ్యాస వికీపాఠ్య రూపం తెలుసుకోవడానికి వెబ్ ఉపకరణం[3] వాడవచ్చు. ఈ ఉపకరణం ద్వారా అనువదించిన వ్యాసంలో దోషాలు, సందిగ్ధంగా వున్న భాగాలను సరిచేయుటకు వీలవుతుంది.

హెచ్చు సంఖ్యలో తొలగింపులు మార్చు

ఇప్పటివరకు నెలవారి గణాంకాల ప్రకారం అత్యధికంగా డిసెంబర్ 2019 లో 111 వ్యాసాలు తొలగించబడ్డాయి, సృష్టించిన 148 వ్యాసాలు తొలగింపుకు గురికాలేదు. ఈ నెల కృషి చాలా వరకు ప్రాజెక్టు టైగర్ పోటీలో భాగంగా గుంటూరు వివిఐటి విద్యార్థులు 2019, డిసెంబరు 7,8,9 తేదీల్లో 24 గంటల ఎటిటథాన్ [4] చేయటంవలన జరిగింది.

మెరుగుపరచిన యాంత్రిక అనువాద స్థాయి పరిమితి 70 శాతంగా అమలు మార్చు

24 ఫిభ్రవరి 2020 న తెలుగు వికీలో యాంత్రిక అనువాద స్థాయి 70 శాతం కంటే తక్కువ వుంటే నే ముద్రణకు అనుమతించేటట్లుగా నిర్ణయం అమలులోకి వచ్చింది.[5] 19 అనువాద వ్యాసాలపై అధ్యయనం చేసి అందులో మెరుగుపరచిన యాంత్రిక అనువాదం 60శాతం కంటే తక్కువ ఉండాలని ఒక ప్రతిపాదకుడు, ఒక సభ్యుడు చర్చించి నిర్ణయం చేయగా, అమలు చేసే ప్రక్రియలో అధ్యయనం పరిమితులు, ఉపకరణ పరిమితులను పరిగణించి వికీమీడియా ఉద్యోగి 70 శాతం కంటే తక్కువవుండేటట్లుగా [5]అమలు చేశారు.[6][7]

2020 జులై వరకు సభ్యుల కృషి గుర్తింపు మార్చు

 
తెలుగు అనువాదాల కృషి గుర్తింపు పతకం

జూన్ 2015-జులై 2020 కాలంలో తెలుగులో కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణం వాడి తొలగింపుకు గురికాని కొత్తగా సృష్టించిన 1238 వ్యాసాలకు కృషిచేసిన 149 మందిలో వ్యాసాల సంఖ్యా పరంగా 80% వ్యాసాలు చేర్చిన 23 వికీపీడియా సభ్యులు Meena gayathri.s, Chaduvari, Pavan santhosh.s, K.Venkataramana, Subramanyam parinam, IM3847, Viggu, Apbook, యర్రా రామారావు, రహ్మానుద్దీన్, Ajaybanbi, దేవుడు, PhaniYesh99, Arjunaraoc, Rajani Gummalla Translation, Ballankipavan, Bhashyam Tharun Kumar, Ch Maheswara Raju, Krupa Vara Prasad, Somepalli Manikumar, Sumanth699, Praveen Illa, Vin09.

Special:ContentTranslationStats ప్రకారం 2020 ఆగస్టు 02 వరకు చిత్తుస్థితిలోనున్న అనువాదాలు 281, తొలగించిన అనువాదాలు 382. ముద్రించిన అనువాదాలు 1570 (ఒకే వ్యాసం క్రమేపీ ఎక్కువ అనువాదం చేసి మరల ముద్రించితే అది ఇంకొక ముద్రణగా లెక్కింపబడతుంది). అంటే తొలగించిన వాటితో కలుపుకొని ముద్రితమైన అనువాదాలు 1952. ఇక ఎపిఐ(API) వాడి లెక్కించినా 2020 జులై అంతానికి ముద్రితమైనవి తొలగించినవాటితో కలుపుకొని 1563 గా వున్నాయి. అంటే చిత్తు స్థితిలోవున్నవాటిని కలుపుకొని ఉపకరణం వాడినవి 2020 ఆగస్టు 2 వరకు 2203 దాటవు.

2020 ఫిభ్రవరికి ముందు అనువాద వ్యాసాల యాంత్రికానువాద స్థాయి విశ్లేషణ మార్చు

ప్రధాన పేరు బరిలో ముద్రించబడిన వాటిలో కొన్ని మార్చు

ఈ క్రింది విశ్లేషణలో యాంత్రికానువాద స్థాయి గణాంకాన్ని ఆయా అనువాద వ్యాసాలకు కృషి చేసిన వ్యక్తి యొక్క అనువాద నైపుణ్యంగా లెక్కకట్టవద్దు, ఎందుకంటే ఎంపిక చేసుకున్న వ్యాసం, అనువదించిన భాగాలు, అప్పటి యాంత్రిక అనువాద యంత్ర నైపుణ్యం,ఆ తరువాత అనువాదకుడు చేసిన మార్పులు, ఉపకరణం యాంత్రిక అనువాద స్థాయి లెక్కించే తీరు, దానికి గల పరిమితులు, వీటన్నిటి ఫలితమే ఆ సంఖ్య.

పై వివరాలు పరిశీలించితే అర్జున వ్యాసాలు ప్రస్తుత 70% పరిమితితో 40 శాతం అనగా 13 లో 5 మాత్రమే ముద్రణకు అనుమతించబడతాయి. మహేశ్వరరాజు గారి వ్యాసాలు 0 శాతం అనగా 8 లో ఏవీ ముద్రణకు అనుమతించబడవు.

ప్రధాన పేరుబరిలో ముద్రించబడి, 2020 ఫిభ్రవరికి ముందు తొలగించబడినవాటిలో కొన్ని మార్చు

ఈ వ్యాసాల యాంత్రిక అనువాద స్థాయి కనిష్టంగా 77.9 శాతం అధికంగా 98.9 శాతం వున్నా, ఫిభ్రవరి 2020 లో అమలైన 70% పరిమితితో శాతం అనగా 10 లో ఏవీ ముద్రణకు అనుమతించబడవు.

యాంత్రిక అనువాద ఉపకరణ వ్యాసాలపై అపోహలు, అసలు నిజాలు మార్చు

అపోహ అసలు నిజం
యాంత్రిక అనువాద ఉపకరణ వ్యాసాలు ఒక నొక్కు (క్లిక్) తో అనువాదం చేసి ముద్రించుతారు. అనగా తొలిగా వుండే యాంత్రిక అనువాద స్థాయి 100 శాతం. మెరుగుపరచిన యాంత్రిక అనువాద స్థాయి కూడా 100 శాతం అప్రమేయ వ్యాస నాణ్యత సంరక్షణ ప్రక్రియ చూస్తే ఇదీ పూర్తిగా నిరాధారమని తెలుస్తుంది. ఏమార్పులు జరగని అనువాదాలను ముద్రణకు అనుమతించదు. పైన తెలిపిన తొలగించిన వ్యాసాల గణాంకాలు పరిశీలించితే యాంత్రిక అనువాద ఉపకరణ సభ్యులు తమ శక్తి మేరకు, తమ అవగాహన మేరకు, యాంత్రిక అనువాదాన్ని మెరుగు చేశారు. తొలగించిన వ్యాసాలలో కొన్నిటికి గణాంకాల విశ్లేషిస్తే మెరుగుపరచిన యాంత్రిక అనువాద స్థాయి కనిష్టంగా 77.9 శాతం అధికంగా 98.9 శాతం వరకు వుందని తెలిసింది.
తక్కువ పరిమితి లేకపోతే యాంత్రిక అనువాద వ్యాసాలు అధిక సంఖ్యలో సృష్టించబడి తెవికీ నాణ్యతను దెబ్బతీస్తాయి గూగుల్ ప్రాజెక్టు అనువాద వ్యాసాలు రెండు సంవత్సరాలలో 1989 అనగా సగటున సంవత్సరానికి 995, రోజుకి సుమారు 3. అయితే సుమారుగా ఐదేళ్లలో యాంత్రిక అనువాద ఉపకరణం వ్యాసాలు 1620 వ్యాసాలు (తొలగించిన వాటితో కలుపుకొని) అనగా సంవత్సరానికి 324 మాత్రమే. అంటే రోజుకి ఒకటి కన్నా తక్కువ. వీటిలో కూడా దాదాపు రెండువందల వ్యాసాలు పోటీ ప్రాజెక్టు టైగర్ 2 లో భాగంగా జరిగిన ఎడిటథాన్ ద్వారా డిసెంబర్ 2019 లో చేరినవి. అంటే పోటీ ప్రాజెక్టు వదిలేస్తే పెద్దగా అనువాద వ్యాసాలు సృష్టించిన దాఖలా లేదు.
యాంత్రిక అనువాద ఉపకరణాన్ని కొత్త వ్యాసాల సృష్టికి మాత్రమే వాడతారు ఉపకరణం ద్వారా ఇప్పటికే ఉన్న వ్యాస అభివృద్ధికి కొద్ది భాగాన్ని అనువదించి వాడుకరి పేరుబరిలో ముద్రించుకొని తదుపరి ఆ విషయాన్ని అసలు వ్యాసంలో చేర్చవచ్చు. విజువల్ ఎడిటర్ వాడుకదారులు ముద్రించకుండా కూడా నకలుచేసి చేర్చవచ్చు. అయితే ఇలా చేర్చినపుడు, వ్యాసంలో దోషాలుండే అవకాశం ఎక్కువ. ఎందుకంటే మూలం ఒక పేరాలో నిర్వచించబడి, వేరే పేరాలో వాడివుండవచ్చు.
యాంత్రిక అనువాద ఉపకరణ వాడే వారికి భాషపై ప్రేమ లేదు యాంత్రిక అనువాద ఉపకరణం వాడేవారికి గతంలో గూగుల్ ప్రాజెక్టుకు పనిచేసిన వారిలాగా డబ్బు రూపంలో ప్రతిఫలం ముట్టదు. వారికి భాషపై ప్రేమ వుండబట్టే తెలుగు వికీలో అనువాద ఉపకరణం వాడుతున్నారు. గూగుల్ ప్రాజెక్టు సభ్యులవలె కాక, ముద్రించిన తరువాత కూడా పరిశీలించి దోషాలను సరిచేస్తారు.
యాంత్రిక అనువాద ఉపకరణం వాడే వారిలో చాలావరకు కొత్త వారే అనుభవమున్న సభ్యులు కూడా యాంత్రిక అనువాద ఉపకరణం వాడతారు. తగిన జాగృతి కలిగించడం, కొత్త వాడుకరులకు శిక్షణ సరిగా ఇవ్వకపోవటంవలన, కొన్ని సమయాలలో ఎక్కువగా కొత్తసభ్యులు ఉపయోగించి వుండవచ్చు. పైన ఉదహరించిన డిసెంబర్ 2019 ఉదంతం లో ప్రాజెక్టు టైగర్ పోటీలో భాగంగా జరిగింది. దీని నుండి నేర్చుకొని ముందు పోటీ ప్రాజెక్టుల నిర్వహణ మెరుగుగా చేయటం మంచిది.
యాంత్రిక అనువాద వ్యాసాలు పెద్దమొత్తంగా తొలగింపులకు గురవుతాయి. గూగుల్ ప్రాజెక్టు అనువాద వ్యాసాలలో 90.8 శాతం (1808/1989) తొలగించబడ్డాయి. అయితే ఐదు సంవత్సరాలలో ఉపకరణం వాడి కొత్తగా సృష్టించబడిన వ్యాసాలలో తొలగింపులు 23.5 శాతం, దానిలో సింహభాగం 2019 లో 20 శాతం. 2019 లో ఉపకరణం వాడకుండా సృష్టించిన వ్యాసాలు 15 శాతం తొలగింపుకు గురయ్యాయి. అంటే అనువాద వ్యాసాల తొలగింపులు సాధారణ కొత్త వ్యాసాల తొలగింపుల కంటే కేవలం 5 శాతం మాత్రమే ఎక్కువ.
అనువాద వ్యాసాల ఎంపిక తెలుగు వికీకి ఉపయోగపడేవి కావు ఈ అపోహ ప్రధానంగా గూగుల్ ప్రాజెక్టు వలన వచ్చింది. గూగుల్ ఆంగ్ల వికీలో ఎక్కువ వీక్షణలుగల వ్యాసాలు ఎంపిక చేసి అనువాద గుత్తేదారులద్వారా అనువాదం చేయించేది. అటువంటప్పుడు ఆ గుత్తేదారు ఉద్యోగికి ఆసక్తి లేని వ్యాసపు నాణ్యత తక్కువలోనే ప్రచురించివుండవచ్చు. గూగుల్ నాణ్యత పరిరక్షణ చర్యలు సరిగాలేవని ఆ ప్రాజెక్టు చరిత్ర చెపుతున్నది. అనువాద ఉపకరణం వాడిచేసేవారు, వారికి ఆసక్తివున్నవ్యాసాలను ఎంపిక చేసుకుంటారు కాబట్టి వ్యాస నాణ్యతపై ధ్యాసపెడతారు, ఆ వ్యాసం తెవికీకి ఉపయోగపడేగా వుండే అవకాశం హెచ్చుగా వుంది.
మెరుగుపరచిన యాంత్రిక అనువాద స్థాయి పరిమితి తక్కువగా వుంటే అనువాద వ్యాసాల నాణ్యత మెరుగుగా వుంటుంది. స్థాయి పరిమితి తక్కువగా వున్నప్పుడు, ఉపకరణ పరిమితుల వల్ల, చిన్న వ్యాసాలు, పెద్ద పేరాలు లేని వ్యాసాలు, పట్టికలు, సమాచారపెట్టెలు గల వ్యాసాలు అనువదించడం వీలవుతుంది. మెరుగుపరచిన అనువాద యాంత్రిక స్థాయి పరిగణనలో ఇవి వుండవు, ఒక చిన్నా పేరా వున్న, కొద్ది పదాలు మార్చగానే స్థాయి పరిమితిలోనికి వస్తుంది. మెరుగుపరచిన యాంత్రిక అనువాద స్థాయి 0 వున్న వ్యాసాలు కూడా ప్రచురించబడ్డాయి. అంటే యాంత్రిక అనువాదం లేదని అర్ధంకాదు. యాంత్రిక అనువాద సమాచారం దాదాపు ఏమీ మార్పులు లేకుండా ప్రచురించబడిందనే అర్ధం. ఉదాహరణగా అనువాద సమస్యల పరిష్కరణ ఉపకరణం [3]తో ఆంగ్ల వికీపీడియా నుండి తెలుగులోకి అనువదించబడిన "Administration" అన్న వ్యాస వివరాలలో తొలిగా ఇవ్వబడిన అనువాదాన్ని, సభ్యుడు మార్పులు చేసిన అనువాదాన్ని పరిశీలించండి. విషయం విస్తారంగల వ్యాసాలకు అనువాదస్థాయి పరిమితి అడ్డంకి అయి, వాటి అనువాదాలు జరగవు.
70% కంటే తక్కువ మెరుగపరచిన యాంత్రిక అనువాద స్థాయి విధానం శాస్త్రీయంగా జరిగింది. అది శిలాశాసనంగా పరిగణించాలి. మార్చనవసరం లేదు సంబంధిత చర్చలు పరిశీలిస్తే విధాన నిర్ణయంలో అనుభవంగల వికీపీడియా సభ్యుడు పాల్గొనడం తెలుస్తుంది. అది మంచిదే కాని 70% నిర్ణయం అధ్యయన పరిమితులు,ఉపకరణ పరిమితులను పరిగణించి చేయబడిందని తెలుస్తుంది. అంటే అధ్యయనంలో కొన్ని లోపాలున్నాయనే కదా. ఉదాహరణకు ఈ విధానం వలన వికీపీడియా సభ్యుల అనువాదాలపై ప్రభావం ఉరామరికగా అంచనా వ్యాఖ్యలు చేశారు. ఇప్పడు కొంత గణాంకాల విశ్లేషణ చేయబడింది, ఈ విధానం వలన ఇతర సమస్యలు కూడా వెలుగులోకి వచ్చాయి. కావున విధానం సమీక్షించి కొత్త విధానం నిర్ణయం చేయటం మంచిది. ఇదే సంగతిని విధానం అమలు చేసిన వికీపీడియా ఉద్యోగి తన అమలు అభ్యర్ధనలో[5] పేర్కొన్నారు.

అయినా విధానం మార్చగూడదని పట్టుపట్టేవారు, తొలిగా చేసిన నిర్ణయంపై నిర్హేతుకంగా పక్షపాత ధోరణి ( ఆంగ్ల వికీవ్యాసం) కలిగివున్నారేమో ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది.

మెరుగుపరచిన యాంత్రిక అనువాద స్థాయి పరిమితి తక్కువగా వుంటే నిర్వహణ భారం తగ్గుతుంది సభ్యుల అనువాదాలను కొంత వరకు నిరోధిస్తుంది కాని అనువాద వ్యాసాలు చేరటం నిరోధించలేదు. సభ్యులు దొడ్డిదారులలో అనువాద వ్యాసాలు చేరుస్తారు కాబట్టి ఇది నిర్వహణ భారాన్ని తగ్గించదు. అలా చేసినపుడు అనువాద వ్యాసాల నాణ్యతను పెంచటానికి ఇతర సభ్యులకు వీలుపడదు ఎందుకంటే మూల వ్యాసం పరిగణించిన తేది తెలియదు, అనువాద గణాంకాలు తెలియవు. అనువాద సమస్యల పరిష్కరణ ఉపకరణం వాడలేము. నిర్వహణ భారం తగ్గాలంటే , అనువాద వ్యాసాలు చేర్చే ప్రాజెక్టుల నిర్వహణ సమర్ధంగా జరగాలి.
అనువాద వ్యాసాల నాణ్యత బాగా వుండాలి. వికీపీడియా శైలిని పాటించాలి. వేరేమాటలలో చెప్పాలంటే తెలుగు వికీలో ఈ వారం వ్యాసంగా ప్రచురించటానికి అనువుగా వుండాలి. శైలిని ప్రస్తుత యాంత్రిక అనువాద ఉపకరణం నియంత్రించలేదు. కొంతవరకు శైలిపై నియంత్రణకు దుశ్చర్యల వడపోత ఉపయోగపడుతుంది. ఉదాహరణకు "మరియు" పదం వాడకుండా. వీటిని తేదీ రూపం లాంటివాటికి కూడా విస్తరించవచ్చు. అవగాహన పెంచటం ద్వారానే శైలి మెరుగుయ్యే అవకాశం ఎక్కువ. కొంతమంది సభ్యులు ఎడబ్ల్యుబి(AWB) ద్వారా, బాట్ ద్వారా అక్షర దోషాలు సవరించడం, ఇతర శైలి పనులు కూడా చేస్తారు.

ఎవరైనా పాల్గొన కలిగే వికీపీడియా ప్రాజెక్టులో ఏకరీతిశైలి సాధించడం చాలా కష్టసాధ్యం. విషయం అర్ధం అయ్యేటట్లు వుండటమే ముఖ్యం. నేరుగా సృష్టించే కొత్త వ్యాసాల నాణ్యతపై అన్ని ఆశలు లేనప్పుడు, అనువాద వ్యాసంపై అలా ఆశలు పెట్టుకోవడం ఎందుకు. వికీపీడియాలో ప్రతి వ్యాసం మార్పుల ద్వారానే కదా మెరుగయ్యేది.

ఇవీ చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. మీడియావికీలో కంటెంట్ ట్రాన్స్లేషన్ పేజీ (తెలుగు భాషలో)
  2. మీడియావికీలో కంటెంట్ ట్రాన్స్లేషన్ పేజీ రెండవ విడుదల(ఆంగ్ల భాషలో)
  3. 3.0 3.1 Santhosh T. "Translation debugger (అనువాద పనితీరు పరిశీలించు మరియు వివరాలు,గణాంకాల వెబ్ పేజీ)". WMF. Retrieved 2020-08-14. దీనిలో మూల వికీ భాష (en for English), అనువదించిన వికీ భాష (te for Telugu), మూల వికీభాషలో పేజీ శీర్షిక ప్రవేశ పెట్టి అనువాదం కొరకు వెతకాలి. అప్పుడు ఆ అనువాదం వివరాలు కనబడతాయి. ఆ తరువాత Fetch page నొక్కితే మూలం, ప్రారంభ యాంత్రికఅనువాదం, సభ్యుని మార్పులతో అనువాదం ఒకే తెరలో చూడవచ్చు. ఇతర ఆదేశాల ద్వారా మునుజూపు, వికీటెక్స్ట్ రూపం పొందవచ్చు
  4. "ప్రాజెక్టు టైగర్ 2 రచనా పోటీ". WMF.
  5. 5.0 5.1 5.2 Pginer-WMF (2020-02-10). "Adjust the threshold for Telugu to prevent publishing when overall unmodified content is higher than 70%". WMF.
  6. "వికీపీడియా:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం". 2020-02-09.
  7. తెవికీ లో యాంత్రిక అనువాదం 70 శాతానికన్నామించకుండా నిర్ణయం అమలు చర్చ