చాందినీ బార్
చాందినీ బార్, 2001 సెప్టెంబరు 28న విడుదలైన హిందీ క్రైమ్ సినిమా.[1] మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టబు, అతుల్ కులకర్ణి, అనన్య ఖారే, రాజ్ పాల్ యాదవ్, మీనాక్షి సహాని, విశాల్ థక్కర్ తదితరులు నటించారు.[2] ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతోపాటు నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులను (ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ సహాయ నటుడు, సామాజిక సమస్యలపై ఉత్తమ సినిమా) గెలుచుకుంది.[3][4][5] ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.
చాందినీ బార్ | |
---|---|
దర్శకత్వం | మధుర్ భండార్కర్ |
రచన | మోహనం ఆజాద్ (స్క్రీన్ ప్లే, మాటలు) మసూద్ మిర్జా (మాటలు) |
నిర్మాత | లతా మోహన్ |
తారాగణం | టబు అతుల్ కులకర్ణి అనన్య ఖారే రాజ్ పాల్ యాదవ్ మీనాక్షి సహాని విశాల్ థక్కర్ |
ఛాయాగ్రహణం | రాజీవ్ రవి |
కూర్పు | హేమల్ కోఠారి |
సంగీతం | రాజు సింగ్ |
విడుదల తేదీ | 28 సెప్టెంబరు 2001 |
సినిమా నిడివి | 150 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
నటవర్గం
మార్చు- టబు (ముంతాజ్ అలీ అన్సారీ)
- అతుల్ కులకర్ణి (పొట్టి సావంత్)
- రాజ్‌పాల్ యాదవ్ (ఇక్బాల్ చమ్ది)
- శ్రీవల్లభ వ్యాస్ (హబీబ్ భాయ్)
- వినయ్ ఆప్టే (ఇన్‌స్పెక్టర్ గైక్వాడ్)
- అనన్య ఖారే (బార్ గర్ల్ దీప పాండే)
- ఉపేంద్ర లిమాయే (దీప భర్త)
- మనోజ్ జోషి (చంద్రకాంత్ భావు)
- రాజన్న (ఉమ శంకర్ పాండే)
- మీనాక్షి సహానీ (ముంతాజ్ కుమార్తె పాయల్ సావంత్)
- విశాల్ ఠక్కర్ (ముంతాజ్ కుమారుడు అభాల్ సావంత్)
- అభయ్ భార్గవ (హెగ్డే అన్న)
- సుహాస్ పాల్షికర్ (ముంతాజ్ మామ)
- షబ్బీర్ మీర్ (అంకుల్ పింటో)
అవార్డులు
మార్చుచాందినీ బార్ సినిమా నాలుగు జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఈ సినిమాలో నటించిన టబు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు, బాలీవుడ్ అవార్డులలో ఉత్తమ నటి విభాగంలో నామినేషన్ చేయబడింది. స్టార్ స్క్రీన్ అవార్డులలో అతుల్ కులకర్ణి ఉత్తమ సహాయ నటుడి నామినేషన్ అందుకున్నాడు. మధుర్ భండార్కర్ అనేక చోట్ల ఉత్తమ దర్శకుడిగా నామినేట్ అయ్యాడు కానీ అవార్డులు రాలేదు.
2002 భారత జాతీయ చలనచిత్ర అవార్డులు[6]
- జాతీయ ఉత్తమ నటి - టబు
- జాతీయ ఉత్తమ సహాయ నటుడు - అతుల్ కులకర్ణి
- జాతీయ ఉత్తమ సహాయ నటి - అనన్య ఖరే
- ఇతర సామాజిక సమస్యలపై ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డు
2002 ఐఐఎఫ్ఏ అవార్డులు
- ఉత్తమ నటి - టబు
2002 స్టార్ స్క్రీన్ అవార్డ్స్
- స్టార్ స్క్రీన్ అవార్డు ఉత్తమ కథ - మధుర్ భండార్కర్
2002 జీ సినీ అవార్డులు
- ఉత్తమ నటి - టబు
మూలాలు
మార్చు- ↑ "Chandni Bar". Bollywood Hungama. Retrieved 30 July 2021.
- ↑ "Happy Birthday Tabu: From Andhadhun, Astitva, Chandni Bar to Cheeni Kum, Drishyam, Haider; actor's best roles till date | Latest News & Updates at DNAIndia.com". DNA India.
- ↑ "'Chandni Bar' completes 13 years, Madhur Bhandarkar says it changed his life forever". 29 September 2014.
- ↑ "Directorate of Film Festival". 24 December 2013. Archived from the original on 24 December 2013.
- ↑ "Chandni Bar completes 19 years: Madhur Bhandarkar thanks Tabu, Atul Kulkarni with a special video". Mumbai Mirror.
- ↑ "49th National Film Awards" (PDF). Directorate of Film Festivals. pp. 34–35. Archived (PDF) from the original on 29 October 2013. Retrieved 30 July 2021.