అబ్దుల్ కలామ్ ద్వీపం
అబ్దుల్ కలామ్ ద్వీపంఒడీషా తీరంలో గల ఒక ద్వీపం. భుబనేశ్వర్ నుండి 150 కి.మీ. దూరంలో, బాలేశ్వర్ (బాలసోర్) జిల్లాలో ఉంది ఈ ద్వీపం. గతంలో దీన్ని వీలర్ ఐలాండ్ అని పిలిచేవారు. క్షిపణులను పరీక్షించే ఇంటెగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఈ ద్వీపంలోనే ఉంది.
అబ్దుల్ కలామ్ ఐలాండ్ బంగాళాఖాతంలో ఒరిస్సా తీరం నుండి 10 కి.మీ. దూరంలో చాందీపూర్ కు దక్షిణంగా 70 కి.మీ. దూరంలో ఉంది. ఈ ద్వీపం పొడవు 2 కి.మీ., వైశాల్యం 390 ఎకరాలు. సమీపంలోని నౌకాశ్రయం ధమ్రా. భారత్ తయారు చేసిన అనేక క్షిపణులకు పరీక్షా కేంద్రం అబ్దుల్ కలామ్ ఐలాండే; ఆకాశ్, అగ్ని, అస్త్ర, బ్రహ్మోస్. నిర్భయ్, ప్రహార్, పృథ్వి, శౌర్య, అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్, పృథ్వి ఎయిర్ డిఫెన్స్- వీటన్నిటినీ ఇక్కడే పరీక్షించారు. ఈ దీవికి చేరుకోవాలంటే ఓడమీదే వెళ్ళాలి. రోడ్డు గాని, రైలు మార్గం గానీ లేదు. చిన్న హెలిప్యాడ్ ఉంది. కానీ ఇక్కడికి రావలసిన సామానులు, ఇతర సరఫరాలూ ఓడల ద్వారానే వస్తాయి.[1]
2013 మేలో ఇసుక కోత కారణంగా, దీవి యొక్క రూపురేఖలు మారిపోవడం సమాజం దృష్టికి వచ్చింది. ఈ దీవి, రాయి మీద కాక ఇసుక తిన్నెల మీద ఉండడం చేత, ఇసుక చలనం కారణంగా ఈ కోత ఏర్పడుతోంది. ఈ సమస్యను పరిష్కరించడం కోసం DRDO చెన్నైలోని జాతీయ సముద్ర సాంకేతిక సంస్థ సాయం కోరింది.[2]
2015 సెప్టెంబరులో వీలర్ ఐలాండ్‌ను మాజీ రాష్ట్రపతి గౌరవార్థం అబ్దుల్ కలామ్ ఐలాండ్ గా పేరు మార్చారు [3][4]
చిత్రాలు
మార్చు-
అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి ప్రయోగం
-
ఆకాశ్ క్షిపణి ప్రయోగం
-
శౌర్య క్షిపణి ప్రయోగం
దీవిలో జరిగిన క్షిపణి ప్రయోగాలు
మార్చుఈ దీవిలో జరిగిన క్షిపణి పరీక్షా ప్రయోగాలు కింది పట్టికలో ఇవ్వబడ్డాయి. చాందీపూర్, అబ్దుల్ కలామ్ ఐలాండ్ రెండు చోట్లా జరిగిన ప్రయోగాలన్నీ ఈ జాబితాలో ఉన్నాయి.
ప్రయోగించిన తేదీ | Origin | క్షిపణి | రకం | అపరేటరు | పరిధి | |
---|---|---|---|---|---|---|
ఆకాశ్ | ||||||
24 మే 2012 26 మే 2012 6 జూన్ 2012 21 ఫిబ్రవరి 2014 24 ఫిబ్రవరి 2014 26 ఫిబ్రవరి 2014 2 మే 2014 19 జూన్ 2014 18 నవంబరు 2014 |
భారత్ | ఆకాశ్ | భూమి నుండి గాల్లోకి క్షిపణి (SAM) | భారత సైన్యం భారతీయ వాయు సేన భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ |
25 – 50 కి.మీ. | |
అగ్ని | ||||||
28 మార్చి 2010 25 నవంబరు 2010 1 డిసెంబరు 2011 13 జూలై 2012 12 డిసెంబరు 2012 8 నవంబరు 2013 11 ఏప్రిల్ 2014 11 సెప్టెంబరు 2014 |
భారత్ | అగ్ని-1 | మధ్య పరిధి బాలిస్టిక్ క్షిపణి (MRBM) | భారత సైన్యం
భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ |
700 – 1,250 కి.మీ. | |
23 నవంబరు 2009 17 మే 2010 10 డిసెంబరు 2010 15 నవంబరు 2011 30 సెప్టెంబరు 2011 9 ఆగస్టు 2012 7 ఏప్రిల్ 2013 9 నవంబరు 2014 |
భారత్ | అగ్ని-2 | మధ్య పరిధి బాలిస్టిక్ క్షిపణి (MRBM) | భారత సైన్యం |
2,000 – 3,000 కి.మీ. | |
12 ఏప్రిల్ 2007 7 ఫిబ్రవరి 2010 23 జూలై 2011 19 ఆగస్టు 2012 21 సెప్టెంబరు 2012 23 డిసెంబరు 2013 16 ఏప్రిల్ 2015 |
భారత్ | అగ్ని-3 | మధ్యంతర పరిధి బాలిస్టిక్ క్షిపణి (IRBM) | Strategic Forces Command |
3,500 – 5,000 కి.మీ. | |
19 సెప్టెంబరు 2012 20 జనవరి 2014 2 డిసెంబరు 2014 |
భారత్ | అగ్ని-4 | మధ్యంతర పరిధి బాలిస్టిక్ క్షిపణి (IRBM) | భారత సైన్యం |
3,000 – 4,000 కి.మీ. | |
19 ఏప్రిల్ 2012 15 సెప్టెంబరు 2013 31 జనవరి 2015 |
భారత్ | అగ్ని-5 | ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ICBM) | Strategic Forces Command |
5,000 – 8,000 కి.మీ. | |
అస్త్ర | ||||||
6 జూలై 2010 21 మే 2011 21 డిసెంబరు 2012 19 మార్చి 2015 |
భారత్ | అస్త్ర | Beyond Visual Range Air to Air క్షిపణి (BVRAAM) | భారతీయ వాయు సేన
భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ |
50 - 100 కి.మీ. | |
బ్రహ్మోస్ | ||||||
30 మార్చి 2012 29 జూలై 2012 8 జూలై 2014 |
భారత్ |
బ్రహ్మోస్ | సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి | భారత సైన్యం
భారతీయ నావికా దళం NPO Mashinostroeyenia |
300 – 500 కి.మీ. | |
నిర్భయ్ | ||||||
12 మార్చి 2013 17 అక్టోబరు 2014 |
భారత్ | నిర్భయ్ | దూర పరిధి సార్వకాలిక సబ్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి | భారత సైన్యం భారతీయ నావికా దళం |
1,000 - 1,500 కి.మీ. | |
ప్రహార్ | ||||||
21 జూలై 2011 | భారత్ | ప్రహార్ | వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి | భారత సైన్యం భారతీయ వాయు సేన |
150 - 200 కి.మీ. | |
పృథ్వి | ||||||
15 మార్చి 2010 6 మార్చి 2011 |
భారత్ | పృథ్వి I | స్వల్ప పరిధి బాలిస్టిక్ క్షిపణి (SRBM) | భారత సైన్యం భారతీయ నావికా దళం భారతీయ వాయు సేన భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ |
150 - 200 కి.మీ. | |
12 అక్టోబరు 2009 13 డిసెంబరు 2009 27 మార్చి 2010 18 జూన్ 2010 24 సెప్టెంబరు 2010 10 ఫిబ్రవరి 2011 26 సెప్టెంబరు 2011 4 అక్టోబరు 2012 5 అక్టోబరు 2012 20 డిసెంబరు 2012 12 ఆగస్టు 2013 7 అక్టోబరు 2013 3 డిసెంబరు 2013 7 జనవరి 2014 14 నవంబరు 2014 19 ఫిబ్రవరి 2015 |
భారత్ | పృథ్వి II/Dhanush | స్వల్ప పరిధి బాలిస్టిక్ క్షిపణి (SRBM) | భారత సైన్యం భారతీయ నావికా దళం |
250 - 350 కి.మీ. | |
శౌర్య | ||||||
12 నవంబరు 2008 24 సెప్టెంబరు 2011 |
భారత్ | శౌర్య | వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి | భారత సైన్యం
భారతీయ నావికా దళం |
700 - 2,000 కి.మీ. | |
అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్ | ||||||
15 మార్చి 2010 26 జూలై 2010 6 డిసెంబరు 2007 6 మార్చి 2011 23 నవంబరు 2012 |
భారత్ | అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్ (AAD) అశ్విన్ బాలిస్టిక్ క్షిపణి ఛేదక క్షిపణి |
బాహ్య వాతావరణ బాలిస్టిక్ క్షిపణి వ్యతిరేక క్షిపణి | భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ | 150 – 200 కి.మీ. | |
పృథ్వి ఎయిర్ డిఫెన్స్ | ||||||
27 ఏప్రిల్ 2014 | భారత్ | పృథ్వి ఎయిర్ డిఫెన్స్ (PAD) ప్రద్యుమ్న బాలిస్టిక్ క్షిపణి ఛేదక క్షిపణి |
అంతర వాతావరణ బాలిస్టిక్ క్షిపణి వ్యతిరేక క్షిపణి | భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ | 2000 కి.మీ. |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు వనరులు
మార్చు- ↑ "Wheeler Island". Global Security. Retrieved 2014-12-18.
- ↑ "India's lone missile test-firing range Wheeler Island face sand erosion". The Times Of India. 11 May 2013. Archived from the original on 2013-06-09. Retrieved 2016-07-29.
- ↑ "In tribute to India's 'Missile Man' APJ Abdul Kalam, Wheeler Island named after him". Zee News.
- ↑ "Kalam Island inspires youth in india. All India youth were proud to be a person lived in this generation for only india". TNP. Hyderabad, India. 5 September 2015.