చాగంటి కోటేశ్వరరావు

ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త.

చాగంటి కోటేశ్వరరావు ఒక ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త. అతను తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వాస్తవ్యులు. ఇతను తండ్రి చాగంటి సుందర శివరావు, తల్లి సుశీలమ్మ. 1959 జూలై 14వ తేదిన ఇతను జన్మించారు. కోటేశ్వరరావు సతీమణి సుబ్రహ్మణ్యేశ్వరి. వీరికి ఇద్దరు పిల్లలు; అతను ధారణ శక్తి, జ్ఞాపకశక్తి చెప్పుకోదగ్గవి. మానవ ధర్మం మీద ఆసక్తితో అష్టాదశ పురాణములను అధ్యయనము చేసి, తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచనాలను అందిస్తూ, భక్త జన మనసులను దోచుకున్నారు. ఉపన్యాస చక్రవర్తి, శారదా జ్ఞాన పుత్ర, ఇత్యాది బిరుదులను అందుకున్నారు.

చాగంటి కోటేశ్వరరావు
చాగంటి కోటేశ్వరరావు
జననం
చాగంటి కోటేశ్వరరావు
ఇతర పేర్లుప్రవచన చక్రవర్తి, శారదా జ్ఞాన పుత్ర
వృత్తిప్రభుత్వ ఉద్యోగి
ఉద్యోగంఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
జీవిత భాగస్వామిసుబ్రహ్మణ్యేశ్వరి
పిల్లలుషణ్ముఖాంజనేయ సుందర శివ చరణ్ శర్మ ,
నాగ శ్రీ వల్లి
తల్లిదండ్రులు
 • చాగంటి సుందర శివరావు (తండ్రి)
 • సుశీలమ్మ (తల్లి)
వెబ్‌సైటుశ్రీచాగంటి.నెట్
సతీమణితో చాగంటి కోటేశ్వర రావు

మండల దీక్షతో 42 రోజుల పాటు సంపూర్ణ రామాయణమును, 42 రోజుల పాటు భాగవతాన్ని, 30 రోజుల పాటు శివ మహా పురాణాన్ని,, 40 రోజుల పాటు శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రమును అనర్గళంగా ప్రవచించి పండిత, పామరుల మనసులు దోచుకొని, విన్నవారికి అవ్యక్తానుభూతిని అందిస్తున్నారు. కాకినాడ పట్టణ వాస్తవ్యులనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నఎంతో మంది తెలుగు వారికి తనదైన శైలిలో ఎన్నో అమృత ప్రవచనములు అందజేయుచున్నాడు. అతను ఎంతటి ఖ్యాతి గడించారో, కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు కానీ నెమ్మదిగా వాటినుంచి బయటపడ్డారు.

చాగంటి వారికి ఆరేడేళ్ల వయసులో జనకులు గతించారు. అతనుకు ఇద్దరు అక్కలు, ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. తల్లిగారు కస్టపడి నలుగురు పిల్లలను పెంచారు. వారికి ఆస్తిపాస్తులు లేవు. నిరుపేద కుటుంబం. సంసారానికి తాను మాత్రమే పెద్ద దిక్కు అన్న స్పృహ పొటమరించగా చాగంటి వారు అహోరాత్రాలు సరస్వతీ ఉపాసనే లక్ష్యంగా విద్యను అభ్యసించారు. పాఠశాల స్థాయినుంచి అతను విద్యాబుద్ధులు వికసించాయి. అతను యూనివర్సిటీ స్థాయివరకు గోల్డ్ మెడలిస్టుగా ఎదిగారు.

అతను ధారణాశక్తి గొప్పది. ఒకసారి శంకరుల సౌందర్యలహరి తిరగేస్తే అది మొత్తం అతను మదిలో నిలిచిపోతుంది. ఎక్కడ ఏ పేజీలో ఏమున్నదో చెప్పగలరు.

అతను ఉద్యోగంలో చేరాక తోబుట్టువుల బాధ్యతను స్వీకరించారు. అక్క, చెల్లెలు, తమ్ముడుకు తానే తన సంపాదనతో వివాహాలు చేశారు. కుటుంబం కోసం తన కష్టార్జితాన్ని మొత్తం ధారపోశారు.

అప్పుడపుడు కాకినాడలో అయ్యప్ప దేవాలయంలో సాయంత్రం కూర్చుని భక్తులముందు భారతభాగవత ప్రవచనాలు ఇచ్చేవారు. ఏనాడూ డబ్బు పుచ్చుకునే వారు కారు. అతను స్వరలాలిత్యం, ధారణ, విజ్ఞానం, విశదీకరణ భక్తులను ఆకర్షించాయి. అభిమానులు పెరిగారు.

పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అనుకుంటాను.. ఎక్కడో ఒకచోట చాగంటి వారిని కలిశారు. "మీ గురించి ఎంతో విన్నాను. మీ ఆధ్యాత్మిక పరిజ్ఞానం అసాధారణం. మీ ప్రవచనాలు నాకు బాగా నచ్చాయి. ముఖ్యంగా మీ పాండితీప్రకర్ష అమోఘం. ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నాను. ఏమైనా అడగండి. చేసిపెడతాను" అన్నారు పీవీ.

చాగంటి వారు నవ్వేసి "మీకూ, నాకు ఇవ్వాల్సింది ఆ పరమాత్మే తప్ప మరెవరూ కారు. మీ సహృదయానికి కృతజ్ఞతలు. నాకేమీ ఆశలు లేవు." అని నమస్కరించి బయటకు వెళ్లిపోయారు.

అతను బయటప్రాంతాల్లో ప్రవచనాలు ఇవ్వడం వారి అమ్మగారు 1998 లో స్వర్గస్తులు అయ్యాక ప్రారంభించారు. ఎందుకంటే చాగంటి వంశంలో గత ఆరు తరాలుగా ఆ సరస్వతి కటాక్షం ఎవరో ఒక్కరికే వస్తున్నది. ఈ తరంలో ఆ శారదాకృప నలుగురు పిల్లలలో చాగంటి కోటేశ్వర రావు గారిపై ప్రసరించింది. ఆ మాత దయను తృణీకరించలేక తనకు తెలిసిన జ్ఞానాన్ని లోకానికి పంచుతున్నారు చాగంటి వారు.

ప్రవచనాలు మార్చు

చాగంటి కోటేశ్వర రావు ప్రసంగించిన ప్రవచనాలు సంపూర్ణ రామాయణం, ఇవి బాల కాండ నుండి పట్టాభి షేకం వరకు చెప్పబడ్డాయి. శివ పురాణం లోని భక్తుల కథలు, మార్కండేయ చరిత్ర, నంది కథ, జ్యోతిర్లింగ వర్ణన, లింగావిర్భావము, రమణ మహర్షి జీవితము మొదలైన అనేక విషయాలు చోటు చేసుకున్నాయి. విరాట పర్వము అనే ప్రవచనంలో భారతము లోని అజ్ఞాత వాస పర్వము వివరించబడింది. భాగవతము అనే ప్రవచనంలో భాగవతుల కథలు, కృష్ణావతారం పూర్తి కథ చోటు చేసుకుంది. భాగవత ప్రవచనాలలో ప్రథమముగా శ్రీకృష్ణ నిర్యాణం, పాండవుల మహాప్రస్థాన కథ చోటు చేసుకున్నాయి. సౌందర్య లహరి ఉపన్యాసాలు ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరికి వివరణ ఉంది. శిరిడీ సాయి బాబా కథ చోటు చేసుకుంది. ఇంకా రుక్మిణీ కల్యాణం, కనకథారాస్తోత్రం, గోమాత విశిష్టత, భజగోవిందం, గురుచరిత్ర, కపిల తీర్థం, శ్రీరాముని విశిష్టత, తిరుమల విశిష్టత, హనుమజ్జయంతి, హనుమద్వైభవం, సుందరకాండ, భక్తి, సామాజిక కర్తవ్యం, శంకరాచార్య జీవితం, శంకర షట్పది, సుబ్రహ్మణ్య జననం మొదలైన ప్రవచనాలు చేసారు కోటేశ్వర రావు. అతను తన వాక్పటిమతో హృద్యమైన ప్రవచనములను చేసి ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకున్నారు..

ప్రవచనాల జాబితా మార్చు

 1. అన్నవరం వైభవం
 2. అయ్యప్ప స్వామి దీక్ష
 3. అయ్యప్ప స్వామి వైభవం
 4. అరుణాచల మహత్యం
 5. అర్ధనారీశ్వర స్తోత్రం
 6. అష్ట పుష్ప పూజ
 7. అష్టమూర్తి తత్వము
 8. ఆదిశంకరాచార్య వైభవం
 9. ఆధ్యాత్మిక విషయాలు
 10. ఆలయ దర్శనము
 11. ఉపనయనం
 12. కనకధార స్తోత్రం
 13. కర్మ పునర్జన్మ
 14. కలియుగము-సాధన
 15. కాకినాడ గోశాల గృహప్రవేశం
 16. కాత్యాయని వైభవం
 17. కాత్యాయని వ్రతము
 18. కార్తీక మాస మహత్యం
 19. కార్తీక మాస వైభవం భక్తి టీవి కోటి దీపోత్సవం
 20. కాలం
 21. కాలం,మాట
 22. శ్రీకాళహస్తీశ్వర వైభవం
 23. శ్రీకాళహస్తీశ్వర శతకం
 24. కాశీ యాత్ర
 25. కాశీ రామేశ్వరం విశిష్టత
 26. కాశీ విశ్వనాధ వైభవం
 27. కుటుంబ వైభవం
 28. కోపము, పరిశుభ్రత
 29. గంగాది పంచనదుల ప్రాశస్త్యము
 30. గజేంద్ర మోక్షం
 31. గురు వైభవం
 32. గురుకృప
 33. గోమాత విశిష్టత
 34. గోమాత వైభవం
 35. చంద్రశేఖరమహాస్వామి ప్రస్థానం
 36. చెంగాలమ్మ వైభవం
 37. జగన్మాత వైభవం
 38. జీవన యాగం
 39. దక్షిణామూర్తి వైభవం
 40. దశావతారములు
 41. దాశరథీ శతకం
 42. దీపావళి చరిత్ర
 43. దేవాలయ వైశిష్ట్యము
 44. దేవి నవరాత్రులు
 45. దేవీ తత్వము
 46. దేవీ భాగవతం
 47. ద్రాక్షారామం
 48. ధర్మ వైశిష్ట్యము
 49. ధర్మ సోపానాలు
 50. ధర్మము
 51. ధర్మము,దానము
 52. ధర్మాచరణం
 53. ధ్యాన ప్రక్రియ
 54. నవరత్న మాలిక
 55. నవవిధ భక్తి స్వరూపం
 56. నేటి సమాజం
 57. నైమిశారణ్యము
 58. నైరాశ్యము
 59. పంచ మహా యజ్ఞములు
 60. పరమశివ వైభవం
 61. పార్వతి కళ్యాణం
 62. పురుషార్ధములు
 63. పూజ పరమార్ధము
 64. పూజ విధి
 65. పోతన భాగవతం
 66. ప్రకృతి మాతకు నీరాజనం
 67. ప్రశ్నోత్తర మాలిక
 68. ప్రశ్నోత్తరమాలిక
 69. ప్రహ్లాదోపాఖ్యానం
 70. భక్తి-సనాతన ధర్మం-రామాయణం
 71. భగవద్గీత
 72. భజ గోవిందం
 73. భద్రాచల మహత్యం
 74. భాగవత తత్త్వము
 75. భాగవత సప్తాహం
 76. భాగవతం
 77. భాగవతం కృష్ణ తత్త్వము
 78. భాగవతం-స్కందం-10
 79. భారతీయ సంస్కృతి వైభవము
 80. మంచి పుస్తకాలు మంచి నేస్తాలు
 81. మన గుడి
 82. మనస్సు, భక్తి
 83. మహాభారతం-ఆదిపర్వం
 84. మహాభారతం-విరాట పర్వం
 85. మహాభారత-సభా పర్వము
 86. మాతృవందనం
 87. మానవీయ సంబంధాలు
 88. మూక పంచశతి
 89. రామాయణ వైభవం
 90. రామాయణం-ధర్మము
 91. రుక్మిణి కళ్యాణం
 92. రూపం కన్నా శీలం మిన్న
 93. లక్ష్యము-తీర్ధయాత్ర
 94. లక్ష్యసిద్ది
 95. లలితా వైభవం
 96. లలితా సహస్ర నామ స్తోత్ర వివరణ
 97. వాగ్గేయకార వైభవం
 98. వాహన ప్రయాణం
 99. విద్యార్థులకు మార్గదర్శనం
 100. విద్యార్థులకు సందేశం
 101. వినాయక వైభవం
 102. వివాహ వైభవం
 103. వివేక చూడామణి
 104. వేదం
 105. వ్యక్తిత్వ వికాసం
 106. శంకర విజయం
 107. శాంతి
 108. శివ అష్టోత్తర నామ స్తోత్రం
 109. శివ దర్శనము
 110. శివ పరివారం
 111. శివ పురాణం
 112. శివ మహిమలు
 113. శివ లింగ తత్వము
 114. శివభక్తి-శరణాగతి
 115. శివానందలహరి
 116. శీలనిర్మాణం
 117. శృంగేరి జగద్గురువుల వైభవం
 118. శ్రద్ధ సబూరి
 119. శ్రద్ధ-పూజ
 120. శ్రావణ మాస విశిష్టత
 121. శ్రీ ఆదిత్య వైభవం
 122. శ్రీ కామాక్షి వైభవం
 123. శ్రీ కృష్ణ కర్ణామృతం
 124. శ్రీ దత్తాత్రేయ గురుచరిత్ర
 125. శ్రీ దుర్గ వైభవము
 126. శ్రీ మహాలక్ష్మి వైభవం
 127. శ్రీ మాత అన్నపూర్ణేశ్వరి వైభవం
 128. శ్రీ మాత వైభవం
 129. శ్రీ రామాయణ వైభవం
 130. శ్రీ రామాయణం ఆవశ్యకత
 131. శ్రీ రామాయణం-మానవీయ సంబంధములు
 132. శ్రీ వినాయక వైభవం
 133. శ్రీ వేంకటాచల వైభవం
 134. శ్రీ వేంకటేశ్వర విశేష సేవలు
 135. శ్రీ వేంకటేశ్వర వైభవం
 136. శ్రీ వేంకటేశ్వర సుప్రబాతం
 137. శ్రీ వ్యాస వైభవం
 138. శ్రీ శృంగేరి శారదా శ్రీ చంద్రమౌళీశ్వర వైభవము
 139. శ్రీరామ పట్టాభిషేకం
 140. శ్రీరామ వైభవం-రామాయణం
 141. శ్రీవారి మానసిక దర్శనము
 142. శ్రీశైల మహత్యం
 143. షట్పది
 144. సంపూర్ణ రామాయణము
 145. సంస్కారం
 146. సత్యనారాయణ వ్రతము
 147. సనాతన ధర్మము
 148. సనాతన ధర్మము,నిత్యకర్మానుష్టానం
 149. సాధన - మనస్సు
 150. సామాన్య ధర్మములు
 151. సాయి బాబా జీవిత చరిత్ర
 152. సింహాచల వైభవం
 153. సీతా కళ్యాణం
 154. సుందరకాండ
 155. సుబ్రహ్మణ్య జననం
 156. సుబ్రహ్మణ్య వైభవం
 157. సేవ
 158. సౌందర్య లహరి
 159. స్త్రీ వైశిష్ట్యము
 160. హనుమ జయంతి
 161. హనుమత్ విజయం
 162. హనుమద్వైభవం
 163. హరిహరాద్వైతము

అందుకున్న పురస్కారాలు మార్చు

దస్త్రం:Pravachana-chakravarti-birudu.jpg
చాగంటివారికి లభించిన ప్రవచన చక్రవర్తి బిరుదు.

శారదా జ్ఞాన పుత్ర మార్చు

జగద్గురు ఆది శంకరులు స్థాపించిన కంచి కామకోటి పీఠము యొక్క ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శంకర జయేంద్ర సరస్వతీ స్వామి, ఉప పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి ఆశీఃపూర్వకంగా చాగంటి కోటేశ్వర రావును నందన నిజ బాధ్రపద పౌర్ణమినాడు (30-09-2012) కంచి కామకోటి పీఠం తరఫున సత్కరించి, ప్రవచన చక్రవర్తి అనే బిరుదును ప్రదానం చేసారు. 2015 విజ్ఞాన్ విశ్వ విద్యాలయము వారు గౌరవ డాక్టరేట్ బహుకరించారు.

వాచస్పతి పురస్కారం మార్చు

మన దేశంలోని ప్రతిష్ఠాత్మక రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, తిరుపతి వారు విజయనామ సంవత్సర ఫాల్గుణ పంచమి (05-03-2014) నాడు గౌరవ పురస్కారమైన వాచస్పతి (సాహిత్యమునందు డాక్టరేట్) పట్టాను ప్రధానం చేశారు.

పిన్నమనేని పురస్కారం మార్చు

డాక్టర్‌ పిన్నమనేని అండ్‌ శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ పిన్నమనేని అండ్‌ సీతాదేవి ఫౌండేషన్‌ 26వ వార్షిక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో అతనుకు డాక్టర్‌ పిన్నమనేని అండ్‌ శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్‌ పురస్కారం అందజేసారు.[1]

కళారత్న పురస్కారం మార్చు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కళారత్న (హంస) పురస్కారం (2016, ఏప్రిల్ 8)[2]

వ్యక్తిత్వం మార్చు

చాగంటివారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ గా పనిచేస్తున్నారు. అతను భార్య వ్యవసాయశాఖలో ఉన్నతాధికారిణి. చాగంటివారు ఆఫీసుకు సాధారణంగా సెలవు పెట్టరు. ఒక్కసారి కూడా లేట్ పెర్మిషన్స్ తీసుకోరు. ప్రవచనాలకు అతను పారితోషికం తీసుకోరు. ఎక్కడికైనా బయట నగరాలకు వెళ్లి ప్రవచనాలు ఇవ్వాల్సివస్తే అతను తన సొంత డబ్బుతో టికెట్ కొనుక్కుని ప్రయాణం చేస్తారు తప్ప నిర్వాహకులనుంచి డబ్బు తీసుకోరు. ఇంతవరకు అతనుకు కారు లేదు. ఆఫీసుకు కూడా మోటార్ సైకిల్ మీద వెళ్తారు.

మూలాలు మార్చు

 1. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, ఫొటోగ్రాఫర్‌ శ్రీనివాసరెడ్డిలకు డాక్టర్‌ పిన్నమనేని అండ్‌ సీతాదేవి ఫౌండేషన్‌ అవార్డు ప్రదానం
 2. "23మందికి కళారత్న పురస్కారం". www.andhrabhoomi.net. 2016-04-09. Archived from the original on 2016-04-10. Retrieved 2023-03-24.

బయటి లింకులు మార్చు