చారులత (2012 సినిమా)

చారులత పొన్ కుమరన్ దర్శకత్వంలో రమేశ్ కృష్ణమూర్తి నిర్మించిన సినిమా. ఇది కన్నడ, తమిళ భాషలలో నిర్మించబడి కన్నడ నుండి మలయాళ భాషలోనికి, తమిళ భాష నుండి తెలుగులోనికి డబ్ చేయబడి నాలుగు భాషలలో ఏకకాలంలో విడుదలయ్యింది. తెలుగు సినిమాను అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ విడుదల చేసింది. ఈ సినిమా 2012, సెప్టెంబర్ 21వ తేదీన విడుదల అయ్యింది. ఈ సినిమాకు అలోన్ అనే థాయ్ సినిమా మూలం.

చారులత
చారులత సినిమా పోస్టర్
దర్శకత్వంపొన్ కుమరన్
దీనిపై ఆధారితంఅలోన్  
by బాంజోగ్ పిసంథనకున్, పర్క్‌పూమ్ వాంగ్‌పూమ్
నిర్మాతద్వారకీష్
రమేష్ కృష్ణమూర్తి
తారాగణం
ఛాయాగ్రహణంపన్నీర్ సెల్వం
కూర్పుడాన్ మాక్స్
సంగీతంసుందర్ సి.బాబు
నిర్మాణ
సంస్థ
గ్లోబల్ వన్ స్టూడియోస్
పంపిణీదార్లుగీతా ఆర్ట్స్
విడుదల తేదీ
20 సెప్టెంబరు 2012 (2012-09-20)
దేశంభారతదేశం
భాషలు
  • కన్నడ
  • తమిళం
  • తెలుగు
  • మలయాళం

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: పొన్ కుమరన్
  • ఛాయాగ్రహణం: పన్నీరు సెల్వం
  • సంగీతం: సుందర్ సి.బాబు

చారు, లత అవిభక్త కవలలు. వారిని విడదీస్తే ప్రాణాపాయం అని తెలిసి, తల్లి వారిని అలానే పెంచి పెద్ద చేస్తుంది. చారు బిడియస్తురాలు. లత ధైర్యవంతురాలు. తన అభిప్రాయాలను నిర్భీతితో వెల్లడిస్తుంది. ఈ ఇద్దరూ కవలలూ వయొలిన్ నేర్చుకోవడానికి ఓ గురువు దగ్గరకు వెళతారు. అక్కడే రవి పరిచయం అవుతాడు. చారులోని అమాయకత్వం అతనికి నచ్చుతుంది. రవి, చారు ఒకరిని ఒకరు ఇష్టపడతారు. అదే సమయంలో లత కూడా రవిని అభిమానిస్తుంది. కానీ చారు - రవి అప్పటికే ప్రేమించు కుంటున్నారని తెలిసి మనసు చంపుకుంటుంది. కసితో వారి ప్రేమకు అడ్డుగా నిలుస్తుంది. చిన్ననాటి అనుబంధాలు, ఆప్యాయతలు ఆ కవలల మధ్య ఈ ప్రేమ కారణంగా ఆవిరైపోతాయి. ఒకరికి ఒకరు భారంగా మారతారు. దాంతో ఆపరేషన్ ద్వారా ఇద్దరూ విడిపోవడమే సమస్యకు పరిష్కారంగా ఈ కవలలు భావిస్తారు. ఆపరేషన్ సమయంలో లత చనిపోతుంది. దాంతో సొంతవూరిని, అమ్మను వదిలి చారు శ్రీనగర్‌కు వెళ్ళిపోతుంది. అక్కడే రవితో రెండేళ్ళు గడుపుతుంది. చివరకు ఇద్దరూ పెళ్ళి చేసుకుని ఒకటి అవుదామనుకుంటున్న సమయంలో ఊహించని సమస్యలు వచ్చిపడతాయి. సొంతవూరిలోని చారు తల్లి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురౌతుంది. ఆమె కోసం వచ్చిన చారును, లత ఆత్మ చంపేయాలని చూస్తుంది. మొదట్లో ఇదంతా చారు భ్రమగా భావించిన రవి, ఆమెను సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళతాడు. చివరకు అతనికీ లత ఆత్మ కనిపించడంతో ఖంగు తింటాడు. సొంత సోదరిని లత ఆత్మ ఎందుకు చంపాలని చూసింది? ఆపరేషన్‌లో చనిపోయిన లతకు చారు అంటే ఎందుకంత కసి... వాటికి సమాధానమే పతాక సన్నివేశం.[1]

స్పందనలు

మార్చు
  • అవిభక్త కవలల సినిమా అనగానే అందంగా, హృద్యంగా, హాయిగా ఉంటుందని; మనసును కట్టిపడేస్తుందని ఎవరైనా అనుకుంటారు. కానీ అటువంటి ఛాయలేవీ ఈ సినిమాలో లేవు. పిల్లల చిన్నప్పటి సన్నివేశాలకు కేటాయించి సమయం కూడా చాలా తక్కువ. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ప్రేమ సన్నివేశాలు పెద్దగా పండలేదు. రెగ్యులర్ ఫార్మలా తరహాలోనే సినిమా ప్రారంభం కాగానే హీరోకి పెట్టినట్టుగా ఇందులో ప్రియమణికి ఓ సాంగ్ పెట్టేశారు. చారుగా, లతగా ప్రియమణి ఎంతో కష్టపడి నటించింది. అయితే స్క్రీన్ ప్లే ఆకట్టుకునే విధంగా లేకపోవడంతో ఆమె శ్రమ బూడిదలో పోసిన పన్నీరే అయింది.[1] -వడ్డి ఓంప్రకాశ్ నారాయణ్, ఫిల్మ్ జర్నలిస్ట్

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 వడ్డి ఓంప్రకాశ్ (24 September 2012). "ప్రేమ, పగలతో రగిలే అవిభక్త కవలల కథ చారులత!". జాగృతి వారపత్రిక. Retrieved 20 February 2024.

బయటి లింకులు

మార్చు