చార్ల్ లాంగేవెల్డ్ట్
చార్ల్ కెన్నెత్ లాంగేవెల్డ్ట్ (జననం 1974, డిసెంబరు 17) దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్. ప్రస్తుతం దక్షిణాఫ్రికా జాతీయ క్రికెట్ జట్టులో బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | చార్ల్ కెన్నెత్ లాంగేవెల్డ్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | స్టెల్లెన్‌బోష్, దక్షిణాఫ్రికా | 1974 డిసెంబరు 17|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 10 అం. (1.78 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్-మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 298) | 2005 2 January - England తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2006 2 January - Australia తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 67) | 2001 14 October - Kenya తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2010 31 October - Pakistan తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 67 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 6) | 2005 21 October - New Zealand తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2010 19 May - West Indies తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 67 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1997/98–2013/14 | Boland | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2003/04 | Border | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2004/05–2006/07 | Highveld Lions | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2005 | Somerset | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2007 | Leicestershire | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2007/08–2011/12 | Cape Cobras | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008 | Derbyshire | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2009–2010 | Kolkata Knight Riders | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011 | Royal Challengers Bangalore | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011 | Kent | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricInfo, 2016 12 December |
క్రికెట్ ఆటగాడిగా క్రికెట్ లోని అన్ని ఫార్మాట్‌లలో ఆడాడు. కుడిచేతి ఫాస్ట్-మీడియం బౌలర్ గా రాణించాడు. 2001 - 2010 మధ్యకాలంలో దక్షిణాఫ్రికా తరపున ప్రధానంగా వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడాడు. వన్డే ఫార్మాట్‌లో హ్యాట్రిక్ సాధించిన తొలి దక్షిణాఫ్రికా ఆటగాడు లాంగెవెల్డ్.
అంతర్జాతీయ కెరీర్
మార్చు2005 జనవరిలో తన సొంత మైదానం కేప్ టౌన్‌లో ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసాడు, మొదటి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకు 5 వికెట్లు తీసుకున్నాడు.[1] 2001 అక్టోబరులో వన్డే అరంగేట్రంలో కింబర్లీలో కెన్యాపై రెండు వికెట్లు తీసుకున్నాడు. న్యూలాండ్స్‌లో జరిగిన తదుపరి మ్యాచ్ లో 21 పరుగులకు 4 వికెట్లు తీశాడు. దక్షిణాఫ్రికా 2003 ప్రపంచ కప్ జట్టులో చేర్చబడ్డాడు, కెన్యాతో పూల్ దశలో ఉన్న ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు.
2005లో, బార్బడోస్‌లో వెస్టిండీస్‌తో జరిగిన 3వ వన్డేలో, చివరి ఓవర్‌లో హ్యాట్రిక్ సాధించాడు, దక్షిణాఫ్రికా 1 పరుగుతో మ్యాచ్‌ను గెలుచుకుంది. ఇయాన్ బ్రాడ్‌షా, డారెన్ పావెల్‌లను బౌల్డ్ చేసి కోరీ కోలీమోర్ ఎల్‌బిడబ్ల్యు పొంది విజయం సాధించాడు. దక్షిణాఫ్రికాకు ఇది తొలి వన్డే హ్యాట్రిక్.[2]
2007లో తన రెండవ క్రికెట్ ప్రపంచ కప్‌లో ఆడాడు. శ్రీలంకపై వారి విజయంలో 5/39 సాధించిన తర్వాత ప్రపంచ కప్‌లో 5 వికెట్లు తీసిన మూడవ దక్షిణాఫ్రికా ఆటగాడిగా నిలిచాడు.[3] 2007 ప్రపంచ కప్ లో ఇది కూడా మొదటి 5 వికెట్లు.[4]
కోచింగ్ కెరీర్
మార్చులాంగేవెల్డ్ట్ దక్షిణాఫ్రికా బౌలింగ్ కోచ్‌గా రెండు స్పెల్‌లను కలిగి ఉన్నాడు. మొదటిది 2015 జూన్ [5] నుండి 2017 అక్టోబరు వరకు.[6] లాంగేవెల్డ్ట్ 2019 జూలైలో బంగ్లాదేశ్ జాతీయ క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు.[7] 2019 డిసెంబరులో దక్షిణాఫ్రికాతో కోచింగ్ పాత్రకు మారాడు.[8]
మూలాలు
మార్చు- ↑ "3rd Test: South Africa v England at Cape Town, Jan 2-6, 2005". ESPNcricinfo. Retrieved 2011-12-18.
- ↑ "One Day Internationals – Hat Tricks". ESPNcricinfo. Archived from the original on 26 January 2007. Retrieved 2007-04-23.
- ↑ "World Cup 5 wickets in an innings". ESPNcricinfo. Archived from the original on 27 July 2004. Retrieved 2007-04-23.
- ↑ "South Africa survive Malinga's menacing spell". ESPNcricinfo. Retrieved 2007-04-23.
- ↑ "Langeveldt appointed SA bowling coach". ESPNcricinfo. 2015-06-02. Retrieved 2020-08-06.
- ↑ "Gibson to take over SA bowling coach role from Langeveldt". ESPNcricinfo. Retrieved 2017-10-30.
- ↑ "BCB appoints Langeveldt as bowling coach". The Daily Star (in ఇంగ్లీష్). 2019-07-27. Retrieved 2019-07-27.
- ↑ "Charl Langeveldt quits as Bangladesh bowling coach, accepts South Africa role". ESPNcricinfo. 2019-12-17. Retrieved 2020-08-05.