నాగర్‌కర్నూల్ మండలం
నాగర్‌కర్నూల్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఒక మండలం.[1]
నాగర్‌కర్నూల్ | |
— మండలం — | |
![]() |
|
అక్షాంశరేఖాంశాలు: 16°29′00″N 78°20′00″E / 16.4833°N 78.3333°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నాగర్‌కర్నూల్ జిల్లా |
మండల కేంద్రం | నాగర్‌కర్నూల్ |
గ్రామాలు | 23 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 223 km² (86.1 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 74,728 |
- పురుషులు | 37,619 |
- స్త్రీలు | 37,109 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 53.49% |
- పురుషులు | 64.46% |
- స్త్రీలు | 42.14% |
పిన్‌కోడ్ | 509209 |

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 23 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండలంలో 20 గ్రామపంచాయతీలున్నాయి.మండల కేంద్రం నాగర్ కర్నూల్.
మండల ప్రముఖులు సవరించు
జడ్పీ చైర్మెన్ గా పనిచేసిన కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన విఎన్ గౌడ్, ప్రముఖ సాహితీవేత్త కపిలవాయి లింగమూర్తి, విమోచనోద్యమకారులు పాపయ్య పర్సా, పెంటమరాజు సుదర్శనరావు, పాలెంను అభివృద్ధి పర్చిన తోటపల్లి సుబ్రహ్మణ్యశర్మ, రచయిత పెంటమరాజు నరసింగరావు ఈ మండలానికి చెందినవారు.
ప్రముఖ దేవాలయాలు సవరించు
మండల పరిధిలోని ఎండబెట్ల, భీమారం, శ్రీపురంలలో పురాతనమైన దేవాలయాలున్నాయి.
భౌగోళిక సమాచారం సవరించు
నాగర్‌కర్నూల్ పట్టణం 16°48" ఉత్తర అక్షాంశం, 78°32" తూర్పు రేఖాంశంపై ఉంది.
రవాణా సదుపాయాలు సవరించు
మహబూబ్ నగర్ నుంచి ఈ పట్టణానికి విరివిగా బస్సు సదుపాయం ఉంది. మహబూబ్ నగర్ నుంచి శ్రీశైలం వెళ్ళు మార్గంలో 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు. దగ్గరలోని రైల్వే స్టేషను జడ్చర్ల, మహబూబ్ నగర్.
పాలెంలో వ్యవసాయ పరిశోధన కేంద్రం ఉంది.
గణాంకాలు సవరించు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 74,728 - పురుషులు 37,619 - స్త్రీలు 37,109. అక్షరాస్యుల సంఖ్య 40394.[3]
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 223 చ.కి.మీ. కాగా, జనాభా 77,264. జనాభాలో పురుషులు 38,925 కాగా, స్త్రీల సంఖ్య 38,339. మండలంలో 16,749 గృహాలున్నాయి.[4]
లోకసభ నియోజకవర్గం సవరించు
నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో కొత్తగా పునర్వ్యవస్థీకరణ ప్రకారం (7) వనపర్తి, గద్వాల, ఆలంపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ శాసనసభ నియోజక వర్గాలు ఉన్నాయి.
పట్టణంలోని కళాశాలలు సవరించు
మండలం లోని గ్రామాలు సవరించు
రెవెన్యూ గ్రామాలు సవరించు
ఇవి కూడా చూడండి సవరించు
మూలాలు సవరించు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 243, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
- ↑ "నాగర్ కర్నూల్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
- ↑ Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.128
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
- ↑ "150-seat medical college for Nagarkurnool". The New Indian Express. 2022-08-07. Archived from the original on 2022-08-08. Retrieved 2022-11-02.