చింతకింది మల్లేశం

లక్ష్మి అసు మెషిన్ (వీవింగ్ మెషిన్) యొక్క ఆవిష్కర్త

చింతకింది మల్లేశం చేనేత కార్మికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత.[1]

చింతకింది మల్లేశం
Chinthakindhi Mallesam.jpg
చింతకింది మల్లేశం
జననంషారాజీపేట, ఆలేరు మండలంయదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ, భారతదేశం
నివాస ప్రాంతంఆలేరు
ప్రసిద్ధిఆసు యంత్రం సృష్టికర్త
తల్లిలక్ష్మీ

జననంసవరించు

తెలంగాణ రాష్ట్రం లోని యదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం షారాజీపేటలో జన్మించారు.

చదువు - వృత్తిసవరించు

ఆర్థిక ఇబ్బందులతో స్కూల్ చదువు 6వ తరగతిలోనే అపేసాడు. చేనేత వృత్తిలో ఆధారపడిన తల్లి లక్ష్మీకి చేదోడు వాదోడుగా ఉండేవాడు.[2] ప్రైవేటుగా 7వ తరగతి చదివి, 10వ తరగతి కూడా పాసయ్యాడు.[3]

గుర్తింపుసవరించు

చేనేతకు సంబంధించిన ఆసు యంత్రాన్ని కనుగొన్నందుకు పద్మశ్రీ ఈయన ఈ అవార్డును అందుకున్నారు.amazing indians award.

 
లక్ష్మీ ఆసు యత్రం

ఆసు యంత్రం తయారిసవరించు

చింతకింది మల్లేశంది నిరుపేద చేనేత కుటుంబం. అమ్మచీరలు నేస్తుంది. ఒక చీరకు ఆసు పోయడానికి దారాన్ని పిన్నుల చుట్టు 9వేల సార్లు అటూ ఇటూ తిప్పాలి. ఇలా రోజుకి 18వేల సార్లు దారాన్ని కండెల చుట్టూ తిప్పితే గాని (25 కి.మీ) రెండు చీరలు తయారుకావు. దారాన్ని కండెల చుట్టూ తిప్పుతుంటే మల్లేషం తల్లి చేతులు లాగుతూ ఉండేవి. అమ్మ భుజం నొప్పితో రోజంతా బాధపడుతుంటే అమ్మ కష్టం గట్టేక్కేదెలా ఏదో ఒకటిచేయాలనుకున్నాడు. తనకొచ్చిన ఐడియాను ఇరుగుపొరుగుతో పంచుకున్నాడు. వాళ్లు నిరుత్సాహపరచినా తన ఆశయం నెరవేర్చకోవడంకోసం హైదరాబాద్ వచ్చాడు. పార్ట్‌ టైమ్ జాబ్ చేస్తూ ఆసు యంత్రాన్ని పార్టులు పార్టులుగా తయారుచేశాడు. మొత్తం యంత్రం తయారుచేయడానికి ఏడేళ్లు పట్టింది.

ఆసియాలో గొప్ప యంత్రంగా ప్రశంససవరించు

అమ్మ పేరుమీదనే 2000ల సంవత్సరంలో లక్ష్మీ ఆసు యత్రం కనిపెట్టాడు. 2011 సంవత్సరంలో ఈ యంత్రానికి పేటెంట్ హక్కులు వచ్చాయి. అదే సంవత్సరం చివరలో ఫోర్బ్స్ జాబితాలో మల్లేశం పేరు చోటు చేసుకుంది. 2011లో ఆసు యంత్రానికి సాఫ్ట్ వేర్ జత చేస్తామని అమెరికా ముందుకు వచ్చింది.[4] ఆసు యంత్రం ఆసియాలో ది బెస్ట్ అని అమెరికాకు చెందిన పాట్ లాబ్స్ ప్రశంసించింది. అదే ఏడాది ఉత్తమ గ్రామీణ ఆవిష్కర్తగా రాష్టప్రతి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాడు.[5]

మూలాలుసవరించు

  1. నమస్తే తెలంగాణ. "చింతకింది మల్లేశంకు పద్మశ్రీ". Retrieved 26 January 2017. Cite news requires |newspaper= (help)
  2. దరువు. "తెలంగాణ నేతన్న మల్లేశంకు పద్మశ్రీ పురస్కారం....!". www.dharuvu.com. Retrieved 26 January 2017.
  3. పల్లె సృజన. "Innovations AP / Sri Chintakindi Mallesham". www.pallesrujana.org. Retrieved 26 January 2017.
  4. తెలుగు యువర్ స్టోరి. "చేనేతల వెతలు తీర్చిన మల్లేశంకు ఘనమైన గౌరవం". telugu.yourstory.com. Retrieved 26 January 2017.
  5. ఆంధ్రభూమి, మెయిన్ ఫీచర్. "అమ్మకోసం ఓ అద్భుత యంత్రం". Retrieved 26 January 2017. Cite news requires |newspaper= (help)