చింతపట్ల వెంకటాచారి

డా. చింతపట్ల వెంకటాచారి తండ్రి: బ్రహ్మ శ్రీ. చింతపట్ల సతయ్యా చారి తల్లి: చింతపట్ల లక్ష్మి నరసమ్మ జననం: 1967 అక్టోబరు 14 మొగ్డుం పల్లి గ్రామం, బీబీనగర్ మండలం,  యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ. నివాస ప్రాంతం: వినోభానగర్ కాలనీ, లాలాపేట, సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ 500017 వృత్తి: ఇంటిరియర్ డిసైనర్, మాస్టర్ క్రాఫ్ట్స్ మెన్, డ్రాఫ్ట్స్ మెన్, పరిశోధన : రహస్య లిపి ( లైన్ స్క్రిప్ట్ ఆర్ట్ ) 8 భాలలో అనువాదం వ్యవస్థాపకులు : తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ పదవి : వ్యవస్థాపక అధ్యక్షులు, చైర్మన్ మతం హిందూ భార్య : రజని (వడ్లూరి రాజయ్య, నీలావతి గార్ల  కుమార్తె ) పిల్లలు: సాయి శ్రేయ, కుషి అల్లుడు : గోల్కొండ సందీప్ సంతకం:
  • Dr.చింతపట్ల వెంకటాచారి తొలిసారిగా లైన్ ఆర్ట్ ద్వారా ప్రపంచ రికార్డులు పొందిన వ్యక్తి. ఈయన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకుడు.

రహస్యలిపి, లైన్ ఆర్ట్ LINE SCRIPT ART wiki మార్చు

డాక్టర్ చింతపట్ల వెంకటాచారి, తండ్రి చింతపట్ల సత్తయ్యా చారి (దారు శిల్పి కళాకారుడు), తల్లి పేరు లక్ష్మి నర్సమ్మ ( పుట్టిన తేది : 14-10-1967) పుట్టిన ఊరు మొగ్డుంపల్లి గ్రామం, భువనగిరి, తాలుక, నల్గొండ జిల్లా, తెలంగాణా రాష్ట్రం. రహస్య లిపి - లైన్ స్క్రిప్ట్ ఆర్ట్ సృష్టి కర్త. కంప్యూటర్ బార్ కోడ్ పోలికగా ఉండే 'లైన్ స్క్రిప్ట్ ఆర్ట్&లో ' నిలువు గీతాలుగా కనిపిస్తాయి. ఈ లిపిని 1987లో కనుకొనడం జరిగింది.

వెంకటాచారికి వచ్చిన ఆలోచన ఒక అక్షరాన్ని సాగదీసి ఏటవాలుగా రాస్తే ఎలా కిన్పిస్తుంది అన్న ఆలోచన ఈ రహస్య లిపి - లైన్ స్క్రిప్ట్ ఆర్ట్ సృష్టికి దోహదపడింది. సాగదీసి రాసిన అక్షరాలను ఎలా చదవాలి అనే ఆలోచనకు సాగదీసి రాసిన అక్షారాలను ఏటవాలుగా ఒక కోణంలో పెట్టినట్టైతే ఆ అక్షరాలూ దగ్గరుకు వచ్చి చిన్నవిగా కనిపిస్తాయి అప్పుడే మనం చదువుకునే విదంగా ఉంటాయి. ఇందులో రహస్యంగా దాగి ఉన్న అక్షరాలు కనిపించవు ఎప్పుడైతే ఆ గీతాలను ఏటవాలుగా 45 నుండి 75 డిగ్రీల కోణంలో ఒక కన్ను మూసుకొని చేసినట్టైతే అందులో ఉన్న అక్షరాలూ అచ్చు అక్షరాల మాదిరిగా కనిపించి చదువుకునే క్రమంలో లిపిగా కనిపిస్తాయి.

ఈ లిపి ద్వారా డా: చింతపట్ల వెంకటాచారికి యునైటెడ్ తియోలాజికల్ రిసెర్చ్ యూనివర్సిటీ ద్వారా గౌరవ డాక్టరేట్ పొందినారు.

లిపి ఉపయోగాలు మార్చు

ఈ క్రమంలో ఉండే ఈ లిపిని ఎన్నో విదాలుగా వాడుకోవచ్చు . ఫన్ని గ్రీటింగ్స్ గా, రహస్య లేఖలు రాసుకోవచ్చు. సైన్సు ఫర్ములాస్ దాచిపెట్టుకోవచ్చు. గుప్తంగా ఉండవలసిన అక్షర నిధిని ఈ (రహస్య లిపి - లైన్ స్క్రిప్ట్ ఆర్ట్ ద్వారా దాచుకోవచ్చు. ఈ రహస్య లిపి - లైన్ స్క్రిప్ట్ ఆర్ట్ ఉపయోగించి రోడ్స్ పైన కాషన్ కోడ్స్ గా ఉపయోగిస్తున్నారు. అలాగే క్రికెట్ స్టేడియంలో కుడా ఈ లిపిని వాడడం జరుగుతుంది.

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ( తెలుగు వారి ఘనతల పుస్తకం) TELUGU BOOK OF RECORDS wiki మార్చు

గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ తరహాలో తెలుగు వారికి కూడా ఒక రికార్డు ( ఘనతల పుస్తకం ) బుక్ ఉండాలన్న ఉద్దేశంతో డా. చింతపట్ల వెంకటాచారి ఆలోచన మేరకు,4 వ తెలుగు ప్రపంచ మహా సభలను పురస్కరించుకొని తేది 24 -12-2012 రోజున మండలి బుద్ధప్రసాద్ గారి చేతులమీదుగా లోగో ఆవిష్కరణ హైదరాబాద్ లో, 30 -12- 2012 రోజున తుమ్మిడి చారిటబుల్ సంస్థ పక్షాన విశాకపట్టణంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వెబ్ సైట్ ఆవిష్కరణ చేయడం జరిగింది

తెలుగు వారిలో ఉన్న ప్రతిభాపాటవాలను వెలికి తీసి వారికి ఒక గుర్తింపు నిచ్చే ఘనతల పుస్తకంముగా ప్రారంభించబడిన సంస్థ తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్. ప్రవాస, నివాస తెలుగు వారు ఇందులో దరఖాస్తు పెట్టుకోవచ్చు, ఇందులో ముఖ్యంగా తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలు, తెలుగు ఔనత్యము, తెలుగు వారి కట్టు బొట్టు, తెలుగు పండుగలు, తెలుగు కవులు, తెలుగు ప్రాచీన కట్టడాలు, తెలుగు వారు నిర్వహించే వింతలూ విశేషాలు, వినోద, విజ్ఞాన వివిధ అంశాలకు ఇందులో నమోదు చేసుకోవడానికి అర్హత ఉండును

తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ గౌరవ సలహాదారులుగా తెలుగు అధికార భాష సంఘం అధ్యక్షులు, ప్రస్తుత సహాయ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ గారు, బృందావన పార్ధసారథి - (మార్షియాస్ తెలుగు గురుకుల పాఠశాల వ్యవస్థాపకులు), ప్రముఖ కుటుంబ సలహాల వైద్యులు, డాక్టర్ సమరం, అన్నవరం రామ స్వామి ( ప్రముఖ సంగీత విద్వాంసులు), జె . డి. లక్ష్మి నారాయణ గారు, ఐ ఏ ఎస్ . శ్రీ ఘంటసాల రత్న కుమార్ ( ప్రముఖ గాయకుడు) డా : సాయి శ్రీ గారు ( ప్రముఖ మానసిక నిపుణులు) ఉన్నారు.

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ గురించి వివరాలు తెలుసుకోవాలంటే : TELUGU BOOK OF RECORDS లేదా ఈ మెయిల్ ద్వారా తెలుసుకోవచ్చు : telugubookofrecords@gmail.com

రికార్డులు మార్చు

  • లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్ రెండు సార్లు 2009 - 2010
  • ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో 2009
  • గ్లోబల్ బుక్ అఫ్ రికార్డ్స్ - 2009
  • ఆసియా బుక్ అఫ్ రికార్డ్స్ 2010
  • వరల్డ్ రికార్డ్స్ ఇండియా - 2010
  • వరల్డ్ అమజింగ్ రికార్డ్స్ - 2011
  • ఎలైట్ వరల్డ్ రికార్డ్స్ - 2011
  • రికార్డ్స్ సెట్టర్ - న్యూ యార్క్ - 2011
  • గిన్నిస్ బుక్ అఫ్ రికార్డ్స్ సర్టిఫికేట్ సామూహిక ప్రదర్శనలో పాల్గొన్నందుకు .
  • రికార్డు హోల్డర్స్ రిపబ్లిక్ - యు.కె. - 2011 - 2012
  • ఎవరెస్ట్ వరల్డ్ రికార్డ్స్ లో - 2012
  • యూనివర్సల్ వరల్డ్ రికార్డ్స్ - 2012
  • అసిస్ట్ వరల్డ్ రికార్డ్స్ - 2012
  • అన్ లైన్ రికార్డ్స్ బ్రేకింగ్ - 2012
  • గోల్డెన్ బుక్ అఫ్ రికార్డ్స్ - USA . 2013 - 2014.

మూలాలు మార్చు