తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్

తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ (ఆంగ్లం: Telugu Book of Records) తెలుగు వారిలో ఉన్న పతిభ పాటవాలను గుర్తించి వారికి ఒక గుర్తింపు తేవాలన్న ఆలోచన దేశ విదేశాలను పర్యటించి అక్కడి సంస్థల కార్యచారనలను తెలుసుకొని సంస్థకి సంబంధిత సమాచారాన్ని అవగహన చేసుకొని మారిషష్, సింగపూర్, శ్రీలంక, బ్యాంకాక్, మలేసియా వంటి దేశాల తెలుగు సంఘాల వారితో చర్చించి తుదకి తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ కి తిరుపతిలో జరిగిన 4వ తెలుగు ప్రపంచ మహా సభలను పురస్కరించుకొని వెలిసిన ఈ సంస్థ మండలి బుద్ధ ప్రసాద్ చేతుల మీదుగా సంస్థ లోగోను హైదరాబాదులో వారి ఛాంబర్లో 2012 డిసెంబర్ 24న అవిష్కరిచారు. అదే ఏడాది డిసెంబర్ 30న విశాఖపట్టణంలో తుమ్మిది చారిటాబుల్ సంస్థ సహకారంతో తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ కి సంబంధిత వెబ్ సైట్ https://www.telugubookofrecords.com/home/ని ఆవిష్కరించారు.[1]

జన విజ్ఞాన వేదిక
తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లోగో
రకంవరల్డ్ రికార్డ్స్
సంస్థ స్థాపన ఉద్దేశ్యముప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల కోసం ప్రత్యేకమైన వరల్డ్ రికార్డ్స్
కేంద్రస్థానంహైదరాబాదు, తెలంగాణ
కీలక వ్యక్తులుచింతపట్ల వెంకటాచారి
వెబ్‌సైటుhttps://telugubookofrecords.com/

ఆ సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షులుగా డా: చింతపట్ల వెంకటాచారి, సంస్థ కార్యదర్శిగా రజని బొనాలి, ముఖ్య సలహాదారులుగా మండలి బుద్ధప్రసాద్, జె.డి. లక్ష్మినారాయణ, అన్నవరం రామస్వామి, డా: సి. నారాయణ రెడ్డి. డా: అందెశ్రీ. డా: కూరెల్ల విటలాచారి. తుమ్మిది రామ్ కుమార్, డా:సాయి శ్రీ, డా: శ్రీనాథ చారి, డా:ఈటల సమ్మన్న, బృందావనం పార్ధసారథి ( మారిషష్ ) తదితరుల సలహాల మేరకు ఈ సంస్థను నెలకొల్పి దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారికి వారిలో ఉన్న ప్రతిభకు పట్టం కడుతూ.. మన తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలను, తెలుగు వారి కట్టు బొట్టు, తెలుగు పండుగలకు ప్రాధాన్యత నిస్తూ, ప్రవాస నివాస తెలుగు వారికి ఒక వేదికగా నిలుస్తుంది. 2016 సంవత్సరం నాటికి దేశ విదేశాల్లో 500 మందికి పైగా తెలుగు వారి ఘనతలను గుర్తించి వారిని సన్మానించింది.

తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో స్థానం పొందిన ప్రముఖ తెలుగు రికార్డులు మార్చు

  • అత్యధిక తెలుగు వారు తెలుగేతర దేశం మలేసియాలో  ఒకే ప్రాంగణంలో పది వేలమంది కలసి సామూహికంగా ఉగాది పండుగను జరుపుట.
  • ఉస్మానియా యూనివర్సిటీ  శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశం లోనే అత్యధిక భారీ త్రివర్ణ పతాకం తయారీకి గాను ( హైదరాబాదు)
  • తిరుమల తిరుపతి దేవస్థానం ఒకే నెలలో కోటి లడ్డులను పంపిణి చేసిన సందర్భానికి గాను ( తిరుపతి)
  • అమెరికన్ తెలుగు అసోసియేషన్ రజతోత్సవ సభల సందర్భంగా ( హైదరాబాదు ) ( అమెరికా)
  • డా :సమరం - అత్యధిక దాపత్య జీవితానికి సంబంధిత పుస్తకాలను 200 పైగా రచనలకు గాను ( విజయవాడ)
  • డా; బ్రహ్మ శ్రీ . చాగంటి కోటేశ్వరరావు గారికి - రామాయణ, మహాభారతలపైనా అత్యధిక ప్రసంగాలకు గాను ( కాకినాడ)
  • డా: మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి - తెలుగు వాగ్గేయ కారులుగా తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో స్థానం . ( చెన్నై - మద్రాసు)
  • డా: అన్నవరం రామ స్వామి - 25 వేలకు పైగా వయోలిన్ లో కచేరీలు గాను ( విజయవాడ)
  • డా: అందెశ్రీ - ఒక నదిపైన కవిత్వం రాసే దిశలో ప్రపంచ లోని నదులన్నీ పర్యటణ గాను ( హైదరాబాదు)
  • డా: దాసరి నారాయణరావు - అత్యధిక తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషలలో చిత్ర నిర్మాణాలకు గాను ( హైదరాబాదు)
  • డా: రాజేంద్ర ప్రసాద్ - అత్యధిక హాస్యభరితంగా సినిమాల్లో నటించడం, 10 యేండ్లు వరుసగా ఒక సినిమా డైరెక్టరీకి ముఖ చిత్రంగా ప్రచురించినందుకు గాను ( హైదరాబాదు )
  • డా: తుర్లపాటి కుటుంబ రావు - 15000 వేల సార్లు ప్రముఖ వేదికలపైనా ప్రసంగాల గాను ( విజయవాడ).
  • డా: సి. నారాయణ రెడ్డి గారికి - 50 యేండ్ల సినిమా రచనలకు గాను ( హైదరాబాదు)
  • శ్రీమతి రమాప్రభ - ప్రముఖ సినీ నటి - అత్యధిక తల్లి పాత్రలకు గాను - చిత్తూరు
  • డా: వంశీ రామ రాజు - అంతర్జాతీయ వంశీ సంస్థల అధినేత - 40 వసంతాల సేవాకార్యక్రమమాల నిర్వాహణ గాను
  • శ్రీ. ఘంటసాల రత్నకుమార్ - 12 గంటలపాటు సుదీర్ఘ డబ్బింగ్ గాను (మద్రాసు )
  • లక్ష్మణ రేఖ గోపాలకృష్ణ - ప్రపంచ సినిమా పరిశ్రమకు త్రివర్ణ పతాకం నిర్మాణం ( హైదరాబాదు)
  • స్వచ్ గాంధేయం అనే నినాదంతో అవనిగడ్డలో - శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ చేతులమీదుగా వేళా మంది విదార్థులు గ్రామ శుభ్రం ( అవనిగడ్డ)
  • శ్రీ రాఘవేంద్ర స్వామి పీఠం వారి నిర్వహణ - ఒకే వేదికగా 2500 మంది స్త్రీలు ఒకే ప్రాంగణంలో హనుమాన్ భక్తి గీతాలు ( మంత్రాలయం )


తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ - 25 డిసెంబర్ 2022 న సంస్థ ప్రధాన కార్యాలయ ప్రాంగణం లో దశమ వార్షికోత్సవం కార్యక్రమం జరిగినది - అందులో పలువురికి అవార్డులు అందజేసారు అలాగే సంస్థ కు సహకరించన వారికి ఆత్మీయ సత్కారాన్ని అందజేశారు.

రికార్డ్స్‌లో చిన్నారులు మార్చు

తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన గోవర్ధన్‌, గౌతమి దంపతుల కుమారుడైన సా యి మాన్విత్‌కు చోటుదక్కింది. సా యి మాన్విత్‌ కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో మంకమ్మతోటలోని ఓ హైస్కూ ల్లో ఒకటో తరగతి చదువు తున్నాడు. హైదరాబాద్‌లోని తార్నాకలో 2022లో జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో 35 గేయాలను ఐదు నిమిషాల వ్యవధిలోనే పాడి ఆహూతులను ఆకట్టుకున్నాడు.[2]

అలాగే తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో హైదరాబాదు ఎస్‌ఆర్‌ నగర్‌కు చెందిన నూకతోటి స్నితిక్‌ ప్రాశ్‌రే(6) స్థానం సంపాదించాడు. బైబిల్‌లోని 66 రకాల పుస్తకాల పేర్లను 2 నిమిషాల 43 సెకండ్ల వ్యవధిలో తెలుగు, ఆంగ్ల భాషల్లో చెప్పి సూపర్‌ కిడ్స్‌ విభాగంలో అరుదైన రికార్డు సృష్టించాడు. 2022 జూన్ 1న లాలాపేట్‌లో సంస్థ ప్రధాన కార్యాలయంలో వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ చింతపట్ల వెంకటాచారి స్నితిక్‌కు అవార్డు అందజేశారు.

మూలాలు మార్చు

  1. అధికార వెబ్‌సైట్
  2. "తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో విద్యార్థికి చోటు - Andhrajyothy". web.archive.org. 2022-06-06. Archived from the original on 2022-06-06. Retrieved 2022-06-06.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

ఇతర లింకులు మార్చు