చింతలరాయస్వామి దేవాలయం
చింతలరాయస్వామి దేవాలయం (శ్రీ చింతల వెంకటరమణ దేవాలయం), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పట్టణంలో ఉన్న హిందూ వైష్ణవ దేవాలయం.[1] ఈ దేవాలయంలో విష్ణువు రూపమైన వేంకటేశ్వరుడు (చింతల వెంకటరమణ) కొలువై ఉన్నాడు.[2] ఈ ఆలయాన్ని పెమ్మసాని నాయకుల వంశానికి చెందిన 2వ పెమ్మసాని తిమ్మనాయుడు నిర్మించాడు. ఈ దేవాలయం పెన్నా నది ఒడ్డున ఉంది. ఈ ఆలయం గ్రానైట్ శిల్పాలకు పేరొందింది. భారత పురాతత్వ సర్వే సంస్థ చేత జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నాలలో ఒకటిగా వర్గీకరించబడింది. ఈ ఆలయంలో, తిరిగే గ్రానైట్ చక్రాలతో గరుడ మండపం ఒక రథంగా నిర్మించబడింది. ఇది హంపిలోని విఠల ఆలయంలో కనిపించే మాదిరిగానే ఉంటుంది.
పద వివరణ
మార్చుపురాణాల ప్రకారం, చింతచెట్టులో వేంకటేశ్వరుడు దొరకడంవల్ల, చింతల వెంకటరమణ అనే పేరు వచ్చింది.[2]
చరిత్ర
మార్చు16వ శతాబ్దం మధ్యకాలంలో విజయనగర సామ్రాజ్యం పాలనలో ఈ దేవాలయం నిర్మించబడింది.[3] 2వ పెమ్మసాని తిమ్మనాయుడు, వీరనరసింహ రాయలు, శ్రీ కృష్ణదేవ రాయలు ఈ ఆలయాన్ని నిర్మించారు.[4][5] తిమ్మనాయుడికి విష్ణువు కలలో కనపడి తాడిపత్రిలో తన కోసం ఒక ఆలయం నిర్మించాలని చెప్పడంతో ఈ ఆలయాన్ని నిర్మించాడని చరిత్రకారుల అభిప్రాయం.[6][7] తిమ్మనాయుడు ఈ ఆలయంలో ఇద్దరు అర్చకులను, ఒక ప్రధాన పూజారిని నియమించి, ఆలయానికి భూములు బహుమతిగా ఇచ్చాడు.[8] చింతలరాయస్వామి ఆలయం విజయనగర నిర్మాణానికి ఉత్తమ ఉదాహరణలలో ఒకటిగా పరిగణించబడుతోంది.[8] ప్రారంభ నిర్మాణం సాలువ రాజవంశానికి చెందినది కాగా, కాని ప్రవేశ స్తంభాలు తులువ రాజవంశానికి చెందినవి.[3]
నిర్మాణ శైలి
మార్చుఈ ఆలయాన్ని ద్రావిడ శైలిలో నిర్మించారు.[3]
చిత్రమాలిక
మార్చు-
విమానాల గోపురాలతో చింతలరాయ ఆలయం
-
దేవాలయంలోని భారీ స్తంభం
-
శిల్పాలతో కూడిన గోడ
-
నార్తక ముద్ర
-
దేవతను వర్ణించే విగ్రహం
-
ఏనుగులు బొమ్మలు
మూలాలు
మార్చు- ↑ Poverty Alleviation Through Self-Help Groups in Anantapur District of Andhra Pradesh. Anchor Academic Publishing. 2017. ISBN 9783960671619.
- ↑ 2.0 2.1 Guide to Monuments of India. Viking. 1989. ISBN 9780670806966.
- ↑ 3.0 3.1 3.2 Architecture and Art of Southern India: Vijayanagara and the Successor States 1350-1750. Cambridge University Press. 1995. ISBN 9780521441100.
- ↑ Sriramamurty, Y. (1973), "The Pemmasani Family" (PDF), Studies in the History of the Telugu country during the Vijayanagara period 1336 to 1650 A D, Karnatak University/Shodhganga, p. 272, hdl:10603/107988
- ↑ Ramaswami, N.S (1975), Temples of Tadpatri, Govt. of Andhra Pradesh, p. 10–11
- ↑ Sriramurty 1973, p. 272
- ↑ Ramaswami 1975, pp. 10–11
- ↑ 8.0 8.1 Sriramurty 1973, p. 273