చింతల కనకారెడ్డి (ఫిబ్రవరి 10, 1951 - మే 11, 2019) తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు. 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి నుండి మల్కాజ్‌గిరి శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేశాడు.

చింతల కనకారెడ్డి
చింతల కనకారెడ్డి

చింతల కనకారెడ్డి


శాసనసభ సభ్యుడు
పదవీ కాలము
2014 – 2018
నియోజకవర్గము మల్కాజ్‌గిరి శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం ఫిబ్రవరి 10, 1951
సికింద్రాబాదు, తెలంగాణ, భారతదేశం
మరణం మే 11, 2019
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి ప్రమీల
సంతానము శ్రీనివాస్‌రెడ్డి, శ్రీపాల్‌రెడ్డి, శాలిని
నివాసము సికింద్రాబాదు, తెలంగాణ, భారతదేశం

జననం - కుటుంబంసవరించు

కనకారెడ్డి 1951, ఫిబ్రవరి 10న ముత్యంరెడ్డి, సత్తెమ్మ దంపతులకు అల్వాల్‌లో జన్మించాడు. 2005 నుంచి ఏపీ గ్రేప్స్ అసోషియేషన్ అధ్యక్షుడిగా కొనసాగాడు. కనకారెడ్డికి భార్య ప్రమీల, కుమారులు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీపాల్‌రెడ్డి, కూతురు షాలిని ఉన్నారు. కోడలు శాంతి శ్రీనివాస్‌రెడ్డి అల్వాల్ డివిజన్ కార్పొరేటర్‌గా పనిచేసింది.[1]

రాజకీయ ప్రస్థానంసవరించు

2009 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా రాజ్యం పార్టీ తరపున మల్కాజ్‌గిరి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయాడు. 2013లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పనిచేసి, 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందాడు.[2]

మరణంసవరించు

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కనకారెడ్డి కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2019, మే 11 శనివారంరోజున మరణించాడు.[3]

మూలాలుసవరించు

  1. ఈనాడు, రాష్ట్ర వార్తలు (12 May 2019). "మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి కన్నుమూత". మూలం నుండి 12 May 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 30 May 2019. Cite news requires |newspaper= (help)
  2. నమస్తే తెలంగాణ (12 May 2019). "మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి మృతి". మూలం నుండి 30 May 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 30 May 2019. Cite news requires |newspaper= (help)
  3. ఆంధ్రజ్యోతి, తెలంగాణ ముఖ్యాంశాలు (12 May 2019). "మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి మృతి". మూలం నుండి 30 May 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 30 May 2019. Cite news requires |newspaper= (help)