తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)
తెలంగాణ మొదటి శాసనసభ 2014 జూన్ 2న ఏర్పడి, 2018 సెప్టెంబరు 6 వరకు 4 సంవత్సరాల 3 నెలల 5 రోజుల పాటు కొనసాగింది. 2014, జూన్ 2న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర మొదటి ప్రభుత్వం ఏర్పాటయింది.[1] 2014లో ఎన్నికైన తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా ఈ కింద ఇవ్వబడింది.[2]
తెలంగాణ విధానసభ ఎన్నికలు (2014) సభ్యుల జాబితా
మార్చుతెలంగాణ విధానసభ ఎన్నికలు (2014) సభ్యుల జాబితా |
తొలి శాసనసభ రద్దు
మార్చు2018 సెప్టెంబరు 6న (మరో 9 నెలల వ్యవధి ఉండగానే) మధ్యాహ్నం 1 గంటకు తొలి శాసనసభను రద్దు చేయబడింది. హైదరాబాదులోని ప్రగతి భవన్‌లో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టిన శాసనసభ రద్దు తీర్మానానికి మంత్రివర్గం మద్దతు పలికి, రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆ తరువాత మధ్యాహ్నం 1.15 గంటలకు కేసీఆర్ రాజ్ భవన్ వెళ్ళి, రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తూ కేబినెట్ చేసిన తీర్మానం ప్రతిని గవర్నర్ ఈ.ఎస్.ఎల్.నరసింహన్కు అందించాడు. దాంతో రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ ఆమోదముద్ర వేశాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని మంత్రివర్గాన్ని ఆపద్ధర్మ ప్రభుత్వంగా కొనసాగాలని గవర్నర్ సూచించాడు. తదుపరి ప్రభుత్వం ఏర్పడేవరకు ముఖ్యమంత్రి, మంత్రుల పదవులు, బాధ్యతలు యధావిధిగా కొనసాగాయి.[1]
మొదటి శాసనసభ విశేషాలు
మార్చు- సభ సమావేశమైన రోజులు: 126
- సమావేశమైన గంటలు: 612.27 గంటలు
- ప్రశ్నలు – సమాధానాలు: 667 గంటలు
- లిఖిత పూర్వక సమాధానాలు: 318 గంటలు
- స్వల్ప వ్యవధి చర్చలు: 16
- ఆమోదించిన బిల్లులు: 71
- తీర్మానాలు: 21
- ఆర్డినెన్స్‌లు: 25
- ప్రభుత్వం చేసిన ప్రకటనలు: 18
- సభలో ప్రవేశ పెట్టిన పత్రాలు: 95
- గవర్నర్ ప్రసంగం: 5 సార్లు
- సభ్యులు చేసిన ప్రసంగాలు : 858
- బడ్జెట్: 5 సార్లు ప్రవేశ పెట్టారు
- సభ జరిగిన సెషన్లు: 11
- సభా సమావేశమైంది: 13 సార్లు
- సమావేశమైన మొదటి రోజు: 2014 జూన్ 9
- శాసనసభ రద్దయిన రోజు: 2018 సెప్టెంబరు 6
- ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్: 2016 మార్చి 31
- అసెంబ్లీ స్పీకర్: సిరికొండ మధుసూదనా చారి
- సభా నాయకుడు: కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
- ప్రతిపక్ష నాయకుడు: కుందూరు జానారెడ్డి
- అసెంబ్లీ వ్యవహారాల మంత్రి: తన్నీరు హరీశ్ రావు
- డిప్యూటీ స్పీకర్: పద్మా దేవేందర్ రెడ్డి
- అసెంబ్లీ కార్యదర్శి: రాజా సదారం (2017 ఆగస్టు 31 వరకు), వేదాంతం నర్సింహాచార్యులు (2017 సెప్టెంబరు 1 నుండి)
ఇవి కూడా చూడండి
మార్చు- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1957)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1962)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1967)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1972)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1978)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1983)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1985)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1989)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1994)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1999)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2004)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2009)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2014)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2019)
- తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)
- తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2023)
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 Thum, Jayadeep (2018-10-04). "తొలి శాసనసభ రద్దు". తెలంగాణ. Archived from the original on 2020-02-14. Retrieved 2022-07-05.
- ↑ "Telangana Lok Sabha Election Results 2019 - State Wise and Party Wise Results". Elections in India. Archived from the original on 2022-06-19. Retrieved 2022-07-05.