చిత్రకవి ఆత్రేయ

చిత్రకవి ఆత్రేయ[1]గా పిలువబడే చిత్రకవి. రామానుజాచార్యులు నెల్లూరు జిల్లా గూడూరులో 1933వ సంవత్సరం అక్టోబరు 19వ తేదీన జన్మించాడు. ఇండస్ట్రియల్ సోషియాలజీలో ఎం.ఎ. చేశాడు. బి.ఇడి. ఉత్తీర్ణుడయ్యాడు. విశాఖపట్టణంలోని భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసెల్స్ (బి.హెచ్.పి.వి)లో పర్సనల్ మేనేజర్‌గా పనిచేశాడు. సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ అండ్ కౌన్సిలింగ్‌కు డైరెక్టర్‌గా పనిచేశాడు. సహృదయసాహితి అనే సాహిత్య సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడు.ఆంధ్రుల ఇష్ట పత్రిక అయిన "ఆంధ్రజ్యోతి"పత్రికలో 1990-2010 సం.ల మధ్య కాలంలో "ధర్మ సందేహాలు" పేరిట ఆధ్యాత్మిక వివరణ లతో ఒక విశేష ఆధ్యాత్మిక వేత్త గా వెలుగొందారు. హిందూ ఆంగ్ల దినపత్రికలో సాహిత్యసమీక్షలు[2] చేశాడు. వీరు ముగ్గురు అన్నదమ్ములు.పెద్ద వారు చిత్ర కవి.భాష్యకాచార్యులు,చిన్న వారు చిత్ర కవి శ్రీనివాసా చార్యులు. వీరు ఆత్రేయ గారు మధ్యములు.

రచనలు సవరించు

 1. భారతి నా అమ్మణ్ణి (కవిత్వం)
 2. యమలోకంలో భూలోకం (నాటకం)
 3. మోహన్ గాంధీ (నాటకం)
 4. మనసు మనిషి (నాటకం)
 5. ఇదీ మన దేశం (నృత్యరూపకం)
 6. దిక్‌చక్రం[3] (కథల సంపుటి)
 7. ధర్మసందేహం (రెండు భాగాలు)
 8. తిరుప్పావై పూదండ
 9. వకుళాభరణ నాయకి (వ్యాసాలు)
 10. జీవన రామాయణము (నాటకం)
 11. ప్రవచనాచార్య శిరోమణి (శ్రీభాష్యం అప్పలాచార్యస్వామి జీవితచరిత్ర)
 12. నిత్యజీవితంలో భగవద్గీత

బిరుదము సవరించు

 • ఆదర్శాచార్య

పురస్కారాలు సవరించు

 • 2003లో ఉమర్ అలీషా సాహితీసమితి భీమవరం వారిచే హుస్సేన్ షా కవి పురస్కారం[4]

మూలాలు సవరించు

 1. Kartik, Chandra Dutt (1999). Who's who of Indian Writers (1 ed.). న్యూఢిల్లీ: సాహిత్య అకాడెమీ. p. 249. ISBN 81-260-0873-3. Retrieved 28 December 2014.
 2. Chitrakavi, Atreya (2002-12-09). "'Swarna Kankanam' for Kondepudi". The Hindu. Retrieved 28 December 2014.
 3. కిళాంబి, రామానుజాచార్యులు. "దిక్ చక్రం". కథానిలయం. కథానిలయం. Archived from the original on 10 మార్చి 2016. Retrieved 28 December 2014.
 4. http://www.sriviswaviznanspiritual.org/news/2010/feb2010/AnnualConventionsFeb2010.aspx[permanent dead link]