గూడూరు (తిరుపతి జిల్లా)

ఆంధ్ర ప్రదేశ్, తిరుపతి జిల్లా పట్టణం
(గూడూరు (నెల్లూరు) నుండి దారిమార్పు చెందింది)

గూడూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని పట్టణం. ఇది నిమ్మకాయల వ్యాపారానికి ప్రముఖ కేంద్రం.

పట్టణం
పటం
Coordinates: 14°08′50″N 79°50′52″E / 14.1473°N 79.8477°E / 14.1473; 79.8477
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతిరుపతి జిల్లా
మండలంగూడూరు మండలం
విస్తీర్ణం
 • మొత్తం9.42 కి.మీ2 (3.64 చ. మై)
జనాభా
 (2011)[1]
 • మొత్తం74,037
 • జనసాంద్రత7,900/కి.మీ2 (20,000/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1033
ప్రాంతపు కోడ్+91 ( 08624 Edit this on Wikidata )
పిన్(PIN)524101 Edit this on Wikidata
WebsiteEdit this at Wikidata

చరిత్ర

మార్చు

ఈ పట్టణం చోళరాజుల కాలం నుండే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పట్టణంలోని అళగనాథ స్వామి వారి దేవాలయం చోళుల కాలంలో నిర్మింపబడినట్లు చెప్తారు. తదుపరి కాలంలో ఈ ఆలయం చుట్టుప్రక్కల ఊరు అభివృద్ధి చెందినదట. శాతవాహనులు, పల్లవులు, తెలుగు చోళులు, కాకతీయులు, విజయనగర రాజులు, గోల్కొండ నవాబులు, వెంకటగిరి సంస్థానాధీశుల ఏలుబడిలో ఈ ప్రాంతం ఉండేది.

జనగణన వివరాలు

మార్చు

2011 జనగణన ప్రకారం గూడూరు పట్టణ జనాభా 74,037.

పరిపాలన

మార్చు

గూడూరు పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

రవాణా సౌకర్యాలు

మార్చు

రహదారి మార్గం

మార్చు

ఈ పట్టణం చెన్నై - కోల్ కతా జాతీయ రహదారి (NH-16) మీద చెన్నై - నెల్లూరు నగరాల మధ్య ఉంది.

రైలు మార్గం

మార్చు
 
గూడూరు రైలు నిలయం ప్రవేశద్వారం

గూడూరు జంక్షన్ చెన్నై - విజయవాడ, తిరుపతి-విజయవాడ రైలు మార్గములో ప్రధాన కూడలి. ఈ స్టేషను నుండే చెన్నై, తిరుపతి లకు రైలు మార్గాలు వేరుపడతాయి.

విద్యా సౌకర్యాలు

మార్చు

పట్టణంలో రెండు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి.

  • నారాయణ ఇంజనీరింగ్ కళాశాల,
  • ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల.

వైద్య సౌకర్యాలు

మార్చు

గూడూరు ప్రాంతీయ పశువైద్యశాల.

పరిశ్రమలు

మార్చు

నిమ్మకాయలు

మార్చు

నిమ్మకాయలు ఇక్కడ ప్రధానమైన ఉత్పత్తి. గూడూరు చుట్టుప్రక్కల నిమ్మకాయల పంట విస్తారంగా సాగులో ఉంది. ఇక్కడి నుండి నిమ్మకాయలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఎగుమతి చేయబడతాయి.

అభ్రకం (మైకా)

మార్చు

కొంతకాలం కింద వరకూ ఇక్కడి మైకా గనులు కూడా వ్యాపారంలో ప్రముఖ పాత్ర వహించాయి. భారతదేశంలోనే రెండవ అతిపెద్ద మైకా గనులు గూడూరు పరిసర ప్రాంతాలలో ఉన్నాయి. ఇక్కడి మైకా గనులు 1,000 చ.అ. విస్తీర్ణంలో ఉన్నాయి. ఇక్కడ ముస్కోవైట్, క్వార్ట్జ్, ఫెల్డ్ స్పార్, వెర్మిక్యులైట్ రకముల మైకా లభిస్తుంది.

రొయ్యల సాగు

మార్చు

గూడూరు పరిసర ప్రాంతాలలో రొయ్యల సాగు ఒక ప్రధాన ఆదాయ వనరు. ఇక్కడి రొయ్యలు వివిధ దేశాలకు ఎగుమతి చేయబడతాయి.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు
  • శ్రీ తాళ్ళమ్మ తల్లి ఆలయం (గూడూరు పురదేవత)

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018

వెలుపలి లంకెలు

మార్చు