చిరాన్ ప్యాలెస్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ వనంలో ఉన్న ప్యాలెస్.[1] 1940లో నిర్మించబడిన చిరాన్ ప్యాలెస్, 400 ఎకరాల్లో విస్తరించి ఉంది.

చిరాన్ ప్యాలెస్
Chiran Palace, Hyderabad.jpg
చిరాన్ ప్యాలెస్
సాధారణ సమాచారం
రకంరాజభవనం
ప్రదేశంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
పూర్తి చేయబడినది1940
Native name
ఆంగ్లము: Chiran Palace
ఎవరి కొరకు నిర్మించబడినదిమీర్ ఉస్మాన్ అలీ ఖాన్
Ownerనిజాం వారసుడు ముక్రంజా

చరిత్రసవరించు

ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పదవిలోకి వచ్చాక, తాను ఉంటున్న కింగ్ కోఠి ప్రాంతంలో రద్ది పెరగడంతో నగర శివారల్లో ఉన్న జూబ్లీ హిల్స్ లోని అటవీ ప్రాంతంలో 1940లో 6,000 చదరపు మీటర్లలో ఈ చిరాన్ ప్యాలెస్ నిర్మించుకున్నాడు.[2] 1967లో ఉస్మాన్ అలీ ఖాన్ పెద్ద కొడుకు ఆజంజాను కాదని, అతని కొడుకైన తన మనమడు ముక్రంజాను వారసుడిగా ప్రకటించి, అతని పట్టాభిషేకంలో ఈ ప్యాలెస్ ను వారసత్వ సంపదగా ఇచ్చాడు.[3] ముక్రంజా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో నివసిస్తున్నాడు. ప్రతి ఏటా రెండుసార్లు హైదరాబాదుకి వచ్చి, ఈ ప్యాలెస్ లో గడుపుతాడు.[4]

నిర్మాణంసవరించు

నిజాం నవాబులకు చెందిన మిగిలిన రాజభవనాలకు భిన్నంగా ఉండి ఉన్న ఈ భవనం అనేక ఆధునిక సౌకర్యాలను కలిగి ఉంది. డూప్లెక్స్‌తో కూడి రెండు సెల్లార్‌లుగా ఉన్న ఈ ప్యాలస్‌లో సుమారు 30కి పైగా గదులు ఉన్నాయి. విశాలమైన కాన్ఫన్స్ హాల్, ఆయుధశాల, రెండు గెస్ట్‌రూంలతో పాటు మొదటి అంతస్థులో ఏడు బెడ్ రూంలు ఉన్నాయి. అక్కడ నిజాం తన భార్య, పిల్లలతో నివసించాడు.[2]

ఇతర వివరాలుసవరించు

  1. పీవీ నరసింహారావు ముఖ్యమంత్రి భూ పరిమితి చట్టం రావడంతో అనేక వాదోపవాదాలు, సుదీర్ఘ కోర్టు కేసుల తరువాత నిజాం వారసులకు కేవలం ఆరు ఎకరాల భూమి మాత్రమే ఇవ్వబడింది.
  2. 1998లో కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో జాతీయ పార్కుగా ప్రకటించబడింది.
  3. ఈ ప్యాలెస్ లో సినిమా షూటింగ్స్ కూడా జరుగుతాయి.[5]

మూలాలుసవరించు

  1. చిరాన్ ప్యాలెస్, ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 87
  2. 2.0 2.1 Prince Mukarram to give up Chiran Palace. The Times Of India, 9 July 2010.
  3. ఆంధ్రజ్యోతి, తెలంగాణ కథనాలు (16 September 2017). "నాడు రాజ ప్రాసాదంలో నేడు 2 గదుల్లో." మూలం నుండి 25 April 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 25 April 2019. Cite news requires |newspaper= (help)
  4. చిరాన్ ప్యాలెస్, ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 87
  5. ఆంధ్రప్రభ, సినిమా (30 October 2017). "చిరాన్ ప్యాలెస్ లో మ‌హేష్ మూవీ షూటింగ్." మూలం నుండి 25 ఏప్రిల్ 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 25 April 2019. Cite news requires |newspaper= (help)

ఇతర లంకెలుసవరించు