చుండూరి మృణాళిని

రచయిత్రి, పాత్రికేయురాలు, అనువాదకురాలు

చుండూరి మృణాళిని తెలుగు రచయిత్రి.

చుండూరి మృణాళిని

విశేషాలు

మార్చు

ఈమె తూర్పు గోదావరి జిల్లా, కాకినాడలో 1956, జూన్ 17వ తేదీన జన్మించింది. ఈమె విద్యాభ్యాసం కావలి, తిరుపతి, విశాఖపట్నంలలో సాగింది. ఈమె హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 1979లో తెలుగులో ఎం.ఎ., 1981లో ఎం.ఫిల్., 1986లో పి.హెచ్.డి., 1995లో ఇంగ్లీషులో ఎం.ఎ. పట్టాలను సాధించింది. ఈమె పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని తులనాత్మక పరిశీలన విభాగంలో లెక్చరర్‌గా పనిచేసింది. తరువాత 1982-83లో సుభాషిణి అనే మాసపత్రికకు సంపాదకురాలిగా వ్యవహరించింది. దర్పణం అనే వీడియో మ్యాగజైన్ నడిపింది. 1984-91 మధ్యకాలంలో ఉదయం దినపత్రికకు ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేసింది[1]. వరల్డ్ స్పేస్ రేడియోలో ప్రోగ్రాం డైరెక్టర్‌గా పనిచేసింది. తరువాత మళ్లీ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో చేరి ప్రస్తుతం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నది. ఈమె యు.ఎస్., చైనా, మారిషస్, మలేషియా, నార్వే తదితర దేశాలలో పర్యటించి పలు సాహితీగోష్టులలో పాల్గొని సిద్ధాంత పత్రాలను సమర్పించింది. ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, ఇతర తెలుగు ఛానళ్లలో 2000కు పైగా కార్యక్రమాలను నిర్వహించింది. యద్దనపూడి సులోచనారాణి, వాసిరెడ్డి సీతాదేవి, అబ్బూరి ఛాయాదేవి, తురగా జానకీరాణి పేర్లతో అందించే పురస్కారాలను అందుకుంది. రామినేని ఫౌండేషన్ వారి విశేష పురస్కారాన్ని స్వీకరించింది.[2] ప్రముఖ కవి పండితుడు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ ఈమెకు మాతామహుడు. ప్రముఖ రచయిత, పౌరహక్కుల ఉద్యమకారుడు కె.బాలగోపాల్ ఈమె సహోదరుడు.

రచనలు

మార్చు
  • ప్రేమిస్తే పెళ్ళవుతుందా? (నవల)
  • నెరేటివ్ టెక్నిక్ ఇన్ తెలుగు నావెల్ (ఆంగ్లంలో విమర్శాగ్రంథం)
  • తెలుగు ప్రముఖులు చమత్కార భాషణలు
  • ఇ(ం)తిహాసం
  • కోమలి గాంధారం
  • మాల్గుడి కథలు (అనువాదం)
  • గుల్జార్ కథలు (అనువాదం)
  • ప్రతిధ్వని
  • నిశ్శబ్ద విప్లవాలు
  • సకల
  • తాంబూలం
  • రఫీ (ఒక ప్రేమపత్రం)

పురస్కారాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. K.C.Dutt (1999). Who's Who of Indian Writers 1999 (in English). New Delhi: Sahitya Akademi. p. 801. ISBN 81-260-0873-3. Retrieved 2018-07-31.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  2. "చాగంటి కోటేశ్వరరావుకు "రామినేని" విశిష్ఠ పురస్కారం". Archived from the original on 2016-08-08. Retrieved 2020-03-05.
  3. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (14 July 2016). "'సమాజానికి నిజమైన వైద్యులు సాహితీవేత్తలే'". www.andhrajyothy.com. Archived from the original on 12 July 2020. Retrieved 12 July 2020.
  4. ఘనంగా సాహితీ పురస్కారాల ప్రదానోత్సవం, తెలుగువాణి, తెలుగు విశ్వవిద్యాలయ ప్రచురణ, ఏప్రిల్-ఆగస్టు 2016, హైదరాబాదు పుట. 42.