పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము

తెలుగు విశ్వవిద్యాలయం
(పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి దారిమార్పు చెందింది)

'పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము' [1] భారతదేశంలోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఇది డిసెంబరు 2 1985 సంవత్సరంలో ప్రత్యేక శాసనసభ చట్టం సంఖ్య 27 ద్వారా హైదరాబాదులో స్థాపించబడింది. తరువాత 1989 సంవత్సరంలో కూచిపూడిలోని సిద్ధేంద్ర కళాక్షేత్రం ఇందులో విలీనం చేయబడింది. ఈ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాలలో తెలుగు భాష అభివృద్ధి ధ్యేయంగా ప్రారంభించబడింది. ఈ ధ్యేయం కోసం, రాష్ట్ర ప్రభుత్వం అదివరకున్న సాహిత్య, సంగీత, నాటక, నృత్య, లలిత కళా అకాడమీలను, అంతర్జాతీయ తెలుగు సంస్థ, తెలుగు భాషా సమితులను యూనివర్సిటీలో విలీనం చేసింది. ఈ విధంగా తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మరితర అన్నింటికి సంబంధించిన కేంద్ర సంస్థగా రూపొందింది. దీనిని "పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం"గా 1998 సంవత్సరంలో పేరు మార్చారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దీనిని 1990 సంవత్సరంలో గుర్తించింది. 2010 లో పరిపాలన పరంగా, సాంస్కృతిక శాఖలో భాగమైంది.

తెలుగు విశ్వవిద్యాలయము
తెలుగు విశ్వవిద్యాలయ భవనం
రకంప్రభుత్వ
స్థాపితం1985
ఛాన్సలర్తమిళిసై సౌందరరాజన్ (తెలంగాణ గవర్నర్)
స్థానంహైదరాబాదు, భారతదేశం
కాంపస్పట్టణ ప్రాంత
అనుబంధాలువిశ్వవిద్యాలయ గ్రాంట్ల సంఘం
జాలగూడుwww.teluguuniversity.ac.in
తెలుగు విశ్వవిద్యాలయ సభాంగణంలో ఒక కార్యక్రమం
Telugu Mahasabhalu, world telugu conference 2017

విభాగాలు, కోర్సులుసవరించు

లలితకళా ప్రాంగణం, హైదరాబాదుసవరించు

సామాజిక, ఇతర విజ్ఞానాల పీఠం

ప్రసార, పాత్రికేయ శాఖ, జ్యోతిష, వాస్తు శాఖ

తులనాత్మక అధ్యయన పీఠం

తులనాత్మక అధ్యయన శాఖ, అనువాదాల శాఖ

సాహిత్య పీఠం

తెలుగు సాహిత్య అధ్యయన శాఖ

లలిత కళల పీఠం

సంగీత శాఖ, నాట్య శాఖ, జానపద కళల శాఖ, రంగస్థల కళల శాఖ, శిల్ప, చిత్ర కళల శాఖ, సంస్కృతి మరియ పర్యటన శాఖ

నన్నయ ప్రాంగణం, రాజమండ్రిసవరించు

భాషాభివృద్ధి పీఠం

భాష అధ్యయన శాఖ, నిఘంటు తయారీ శాఖ

పోతన ప్రాంగణం, వరంగల్సవరించు

జానపద, తెగల సాహిత్య పీఠం

జానపద అధ్యయన శాఖ, తెగల అధ్యయన శాఖ

పాల్కురికి సోమనాథ ప్రాంగణం, శ్రీశైలంసవరించు

చరిత్ర, సంస్కృతి, పురాతత్వ పీఠం

తెలుగు మాట్లాడు ప్రజల చరిత్ర, సంస్కృతి శాఖ, ప్రాచీన శాసన, లిఖిత ఆధారాల శాఖ, పురాతత్వ శాఖ

శ్రీ సిద్ధేంద్రయోగి ప్రాంగణం, కూచిపూడిసవరించు

సిద్ధేంద్ర యోగి కళా పీఠం

కేంద్రాలుసవరించు

కొమర్రాజు వేంకట లక్ష్మణ రావు విజ్ఞాన సర్వస్వ కేంద్రముసవరించు

 
విజ్ఞాన సర్వస్వం- సంపుటి 4 దర్శనములు-మతములు, శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయము వారి కొమర్రాజు వేంకట లక్ష్మణరావు తెలుగు విజ్ఞానసర్వస్వ కేంద్రం వారిచే ప్రకటింపబడింది.

తెలుగు భాషా సమితి విషయాల క్రమంలో విజ్ఞాన సర్వస్వం ముద్రించింది. ఆ తరువాత తెలుగు విశ్వవిద్యాలయములో విజ్ఞానసర్వస్వ కేంద్రము వాటిని పరిష్కరించి మరల కొత్త వాటిని ముద్రించింది. 1986 అక్టోబరు 15న తెలుగు భాషా సమితి విలీనంతో విజ్ఞాన సర్వస్వ కేంద్రము ప్రారంభించబడింది. దీనిని తరువాత కొమర్రాజు వేంకట లక్ష్మణ రావు విజ్ఞాన సర్వస్వ కేంద్రముగా పేరు మార్చారు. వివిధ విషయాలలో 38 పైగా సంపుటాలను విడుదలచేయలనే ప్రణాళికలున్నాయి.తెలుగుభాషా సమితి 14 సంపుటాలను ప్రచురించింది. వీటిని ఆధునీకరించేపనిని కొత్త వి తయారుచేసే పనిని ఈ కేంద్రం చేపట్టింది. భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, భారత భారతి, దర్శనములు-మతములు[2], విశ్వసాహితి[3], భారతభారతి, జ్యోతిర్విజ్ఞానము, ఆయుర్విజ్ఞానము, తెలుగు సంస్కృతి, నాటక విజ్ఞాన సర్వస్వం (2008) ప్రచురించబడినవి. ఇంగ్లిషులో హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఆంధ్రాస్ అన్న సంపుటము ముద్రించబడింది. 11వ పంచవర్షప్రణాళికలో భాగంగా పని జరుగుతున్న సంపుటాలు.

  • దేశము-చరిత్ర
  • సిరిసంపదలు
  • తెలుగు జానపద విజ్ఞాన సర్వస్వము
  • సాహిత్య దర్శనము

అంతర్జాతీయ తెలుగు కేంద్రముసవరించు

ఇతర రాష్ట్రాలు, లేక దేశాలలోని తెలుగువారికోసం ఈ కేంద్రం పనిచేస్తుంది.తెలుగు పాఠ్యపుస్తకాలు, పాఠశాలలకు సహాయం, ఉపాధ్యాయ శిక్షణ, ఆధునిక తెలుగు, కూచిపూడి నాట్యం మొదలైన వాటిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

దూర విద్యాకేంద్రముసవరించు

వివిధ అంశాలలో (తెలుగు, సంస్కృతంభాషలు, జ్యోతిషం, వార్తలు, సంగీతం, సినిమా సంభాషణ...) సర్టిఫికేట్, బిఎ, పిజిడిప్లొమా, ఎమ్ఎ, సర్టిఫికేట్ కోర్సులు

ప్రచురణలుసవరించు

చూడండి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము ప్రచురణలు

అవార్డులు - పురస్కారాలుసవరించు

కీర్తి పురస్కారాలుసవరించు

తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి కీర్తి పురస్కారాలు అందజేస్తారు.[4]

  1. తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2012)[5]
  2. తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2013)
  3. తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2014)
  4. తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2015)
  5. తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2017)

ప్రతిభా పురస్కారాలుసవరించు

తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా ప్రక్రియల్లో విశిష్ట సేవలందించిన సాహితీమూర్తులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తారు.[6]

  1. తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు (2012)[7]
  2. తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు (2013)
  3. తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు (2014)[8]
  4. తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు (2015)
  5. తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు (2017)

సాహితీ పురస్కారాలుసవరించు

తెలుగు సాహిత్యంలో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు సాహితీ పురస్కారాలు అందజేస్తుంది.[9]

  1. తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు (2012)[10]
  2. తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు (2013)[11][12]
  3. తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు (2016)[13][14]
  4. తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు (2017)[15]

ఇతర పురస్కారాలుసవరించు

  1. విశిష్ట పురస్కారాలు
  2. రంగస్థల యువ పురస్కారం

ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతుల జాబితాసవరించు

క్రమసంఖ్య పనిచేసిన కాలం పేరు ఇతర వివరాలు
1
2
3
4
5
6
7 ఆవుల మంజులత
8 అనుమాండ్ల భూమయ్య
9 ఎల్లూరి శివారెడ్డి
10 2016 జూలై 26 - ఆగస్టు, 2019 ఆచార్య ఎస్వీ సత్యనారాయణ[16]
11

ఇప్పటివరకు పనిచేసిన రిజిస్ట్రార్ ల జాబితాసవరించు

క్రమసంఖ్య పనిచేసిన కాలం పేరు ఇతర వివరాలు
ఆశీర్వాదం
2017, నవంబరు - 2019, నవంబరు ఆచార్య అలేఖ్య పుంజాల[17]
2019 నవంబరు 19 - ప్రస్తుతం ప్రొ. భట్టు రమేష్‌[18]

చిత్రమాలికసవరించు

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము వెబ్సైట్
  2. విజ్ఞాన సర్వస్వము సంపుటి 4 దర్శనములు-మతములు
  3. విజ్ఞాన సర్వస్వము సంపుటి 5విశ్వసాహితి
  4. నవతెలంగాణ (30 April 2016). "కీర్తి పురస్కారాలు ప్రకటించిన తెలుగు విశ్వవిద్యాలయం". Retrieved 4 May 2018. CS1 maint: discouraged parameter (link)
  5. సాక్షి, ఆంధ్రప్రదేశ్ (21 November 2013). "32 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". Archived from the original on 27 May 2019. Retrieved 27 May 2019. CS1 maint: discouraged parameter (link)
  6. ఆంధ్రజ్యోతి (15 November 2018). "12 మందికి తెలుగు వర్సిటీ పురస్కారాలు". Archived from the original on 15 November 2018. Retrieved 15 November 2018. CS1 maint: discouraged parameter (link)
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-07-16. Retrieved 2019-07-16.
  8. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (29 June 2016). "తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారాలు". www.andhrajyothy.com. Archived from the original on 10 July 2020. Retrieved 10 July 2020. CS1 maint: discouraged parameter (link)
  9. ఈనాడు, హైదరాబాదు (18 June 2019). "తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాలు". Archived from the original on 18 June 2019. Retrieved 16 July 2019. CS1 maint: discouraged parameter (link)
  10. నవ తెలంగాణ, స్టోరి (16 June 2015). "ఉత్తమ గ్రంథాలకు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాలు". NavaTelangana. Archived from the original on 21 July 2020. Retrieved 21 July 2020. CS1 maint: discouraged parameter (link)
  11. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (14 July 2016). "'సమాజానికి నిజమైన వైద్యులు సాహితీవేత్తలే'". www.andhrajyothy.com. Archived from the original on 12 July 2020. Retrieved 12 July 2020. CS1 maint: discouraged parameter (link)
  12. ఘనంగా సాహితీ పురస్కారాల ప్రదానోత్సవం, తెలుగువాణి, తెలుగు విశ్వవిద్యాలయ ప్రచురణ, ఏప్రిల్-ఆగస్టు 2016, హైదరాబాదు పుట. 42.
  13. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (23 December 2018). "పది మందికి తెలుగు విశ్వవిద్యాలయ అవార్డులు". www.andhrajyothy.com. Archived from the original on 8 July 2020. Retrieved 8 July 2020. CS1 maint: discouraged parameter (link)
  14. డైలీహంట్, నమస్తే తెలంగాణ (23 December 2018). "తెలుగు వర్సిటీ 2016 సాహితీ పురస్కారాలు". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 8 July 2020. Retrieved 8 July 2020. CS1 maint: discouraged parameter (link)
  15. ఈనాడు, హైదరాబాదు (29 June 2019). "తెలుగువర్సిటీ సాహితీ పురస్కారాల ప్రదానం". Archived from the original on 16 July 2019. Retrieved 8 July 2019. CS1 maint: discouraged parameter (link)
  16. నమస్తే తెలంగాణ, తెలుగుయూనివర్సిటీ. "తెలుగువర్సిటీ వీసీగా ఎస్వీ సత్యనారాయణ". Retrieved 27 July 2016. CS1 maint: discouraged parameter (link)[permanent dead link]
  17. వార్త, తెలంగాణ (26 November 2017). "తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్‌గా తొలి మహిళ అలేఖ్య". Archived from the original on 14 మే 2019. Retrieved 2 December 2019. CS1 maint: discouraged parameter (link)
  18. ఈనాడు, హైదరాబాదు (1 December 2019). "తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా రమేష్‌". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 2 December 2019. Retrieved 2 December 2019. CS1 maint: discouraged parameter (link)

బయటి లింకులుసవరించు