చుక్కభట్ల సత్యనారాయణమూర్తి

చుక్కభట్ల సత్యనారాయణమూర్తి (1909 - ఆగష్టు 21, 1953) ప్రముఖ రంగస్థల నటుడు, ప్రయోక్త, నాటక రచయిత, స్వాతంత్ర్యోద్యమ కార్యకర్త.[1]

చుక్కభట్ల సత్యనారాయణమూర్తి
జననం1909
మరణంఆగష్టు 21, 1953
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల నటుడు, ప్రయోక్త, నాటక రచయిత, స్వాతంత్ర్యోద్యమ కార్యకర్త

జననంసవరించు

సత్యనారాయణమూర్తి 1909లో సుబ్బారావు, సీతమ్మ దంపతులకు జన్మించాడు.

రంగస్థల ప్రస్థానంసవరించు

1928-29 ప్రాంతంలో చర్లలో కొంతమంది మిత్రులతో కలిసి చెన్నకేశ్వర నాట్యమండలిని స్థాపించాడు. ఏలూరి హనుమంతరావు, గాలి లక్ష్మణస్వామి, బుయ్యవరపు తిరువెంగళయ్య, విశ్వన్మయాచారి, చింతలపూడి వెంకన్న, ముదపాక వెంకటరత్నం, చీమకుర్తి సుబ్బారావు, కామాడ జగ్గారావు, తోటపల్లి ఆదినారాయణ వంటి నటులకు శిక్షణ ఇచ్చాడు.

నటించినవిసవరించు

  1. చింతామణి
  2. వరవిక్రయం
  3. సత్యహరిశ్చంద్ర
  4. భక్తరామదాసు
  5. గయోపాఖ్యానం
  6. మధు సేవ

రచించినవిసవరించు

  1. ఝాన్సీలక్ష్మీబాయి (08.06.1931 లో ఈ నాటకాన్ని బ్రిటీష్ ప్రభుత్వం నిషేదించింది)
  2. వీరతానాజీ
  3. గొల్లభామ

మరణంసవరించు

ఈయన 1953, ఆగష్టు 21న మరణించాడు.

మూలాలుసవరించు

  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.623.