1909
1909 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1906 1907 1908 - 1909 - 1910 1911 1912 |
దశాబ్దాలు: | 1880లు 1890లు - 1900లు - 1910లు 1920లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- ఏప్రిల్ 6 : భౌగోళిక ఉత్తర ధ్రువాన్ని మొట్టమొదటి సారిగా రాబర్ట్ పియరీ అనే అమెరికన్ సాహసయాత్రికుడు చేరుకున్నాడు.
జననాలు
మార్చు- జనవరి 1: చర్ల గణపతిశాస్త్రి, వేద పండితులు, గాంధేయవాది, ప్రాచీన గ్రంథాల అనువాదకులు. (మ.1996)
- జనవరి 20: జగదీష్ చంద్ర జైన్, భారత స్వాతంత్ర్య సమరయోధుడు,రచయిత. (మ.1993)
- జనవరి 22: యూ థాంట్, ఐక్యరాజ్య సమితి మూడవ ప్రధాన కార్యదర్శి. (మ.1974)
- మే 13: వజ్ఝల కాళిదాసు, కవి, రచయిత, బహుముఖ ప్రజ్ఞాని.
- జూన్ 21: డేవిడ్ అబ్రహం, హిందీ సినిమా నటుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.1982)
- జూలై 1: ఇంటూరి వెంకటేశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు సినిమా చరిత్ర పరిశోధకుడు. (మ.2002)
- జూలై 15: దుర్గాబాయి దేశ్ముఖ్, స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి. (మ.1981)
- జూలై 16: అరుణా అసఫ్ ఆలీ, భారత స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు. (మ.1996)
- జూలై 28: కాసు బ్రహ్మానందరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (మ.1994)
- ఆగష్టు 12: రాజేశ్వర్ దయాళ్, భారతీయ దౌత్యవేత్త, రచయిత. (మ.1999)
- ఆగష్టు 16: సర్దార్ గౌతు లచ్చన్న, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఆంధ్రరాష్ట్ర మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2006)
- ఆగష్టు 27: దాడి గోవిందరాజులు నాయుడు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ నాటకాలలో స్త్రీ పురుష పాత్రధారి. (మ.1970)
- సెప్టెంబర్ 3: జమలాపురం కేశవరావు, నిజాం నిరంకుశ పాలను ఎదిరించాడు.
- సెప్టెంబర్ 15: రోణంకి అప్పలస్వామి, సాహితీకారుడు. (మ.1987)
- సెప్టెంబర్ 22: గిసేల బాన్, జర్మన్ పాత్రికేయురాలు. పద్మశ్రీ ఆవార్డు గ్రహీత. (మ.1996)
- సెప్టెంబర్ 27: ముప్పవరపు భీమారావు, రంగస్థల నటుడు (మ.1969)
- సెప్టెంబర్ 28: పైడి జైరాజ్, భారత సినీరంగంలో నటుడు, నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.2000)
- అక్టోబర్ 14: సూరి భగవంతం, శాస్త్రవేత్త దేశ రక్షణకు సంబంధించిన పరిశోధనల్లో ఆద్యుడు. (మ.1989)
- అక్టోబరు 28: కొడవటిగంటి కుటుంబరావు, తెలుగు రచయిత, హేతువాది. (మ.1980)
- నవంబర్ 20: ప్రయాగ నరసింహశాస్త్రి, ఆకాశవాణి ప్రయోక్త, తెలుగు నటుడు. (మ.1983)
మరణాలు
మార్చు- జూన్ 28: దంపూరు వెంకట నరసయ్య - నేటివ్ అడ్వొకేట్, నెల్లూర్ పయొనీర్, పీపుల్స్ ఫ్రెండ్, ఆంధ్ర భాషా గ్రామవర్తమాని అనే పత్రికల సంపాదకుడు.(జ.1849)
- జూలై 25: అమ్మెంబాల్ సుబ్బారావు పాయ్, భారత్లోని ప్రఖ్యాత బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంకుతో పాటు మంగళూరులోని కెనరా ఉన్నత పాఠశాల స్థాపకుడు. (జ.1852)
పురస్కారాలు
మార్చుస్థాపితాలు
మార్చు- 1909 సంవత్సరంలో దేశోధ్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు బొంబాయి మహానగరం నుండి ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు.