చెరువుకొమ్ము పాలెం (నందిగామ)
చెరువుకొమ్ముపాలెం, కృష్ణా జిల్లా నందిగామ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
చెరువుకొమ్ముపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°46′30″N 80°10′43″E / 16.774890°N 80.178588°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణాజిల్లా |
నందిగామ | నందిగామ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
సాగునీటి సౌకర్యం
మార్చుఈ గ్రామమునకు ఎగువున 99 ఎకరాలలో ఒక చెరువు విస్తరించియున్నది. ఈ వెరువుద్వారా ఈ గ్రామానికేగాక, పెద్దవరం, కాండ్రపాడు, బ్రహ్మభొట్లవారిపాలెం గ్రామాలలోని సుమారు 600 ఎకరాలకు సాగునీరు అందుచున్నది. ఈ భూములలో వరితోపాటు, మెట్ట పంటలు గూడా పండించుచున్నారు. అంతేగాక, ఈ చెరువును చేపల పెంపకానికి అద్దెకు ఇచ్చి, పంచాయతీకి ఆదాయం సమకూర్చుకుంటున్నారు.
దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు
మార్చుశ్రీ అలివేలుమంగా, పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవాలయం:- ఈ దేవాలయంలో, 2014,ఏప్రిల్-14, సోమవారం నాడు, లక్షమల్లెల అర్చన నేత్రపర్వంగా సాగినది. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని, మహిళలు సామూహికంగా లక్ష మల్లెల అర్చనలో పాలుపంచుకున్నారు. వేదపండితులు శాస్త్రోక్తంగా వేడుక నిర్వహించారు. గోవిందనామాలతో గ్రామం పులకించిపోయినది.