చేబియ్యం సోదెమ్మ
'చేబియ్యం సోదెమ్మ' గారు ఆంధ్రరాష్టం గర్వపడే స్వాతంత్ర్య సమరయోధురాలు, సంఘసేవకురాలు.
చేబియ్యం సోదెమ్మ | |
---|---|
జననం | జూలై 15, 1895 |
జీవిత భాగస్వామి | సోమయ్య |
తల్లిదండ్రులు |
|
నేపథ్యము
మార్చు1895 వ సంవత్సరంలో భీమవరంలో శ్రీ చివుకుల సూర్యనారాయణ గారికి జన్మించారు. భర్త సోమయ్యతో కలిసి పోలవరం గ్రామంలో సురాజ్య ఆశ్రమాన్ని స్థాపించారు. గిరిజనుల అక్షరాస్యత, ఖాదీ ప్రచారానికి దాదాపు దశాబ్దం పాటు దంపతులిద్దరూ కృషి చేశారు.1920 నుండి 1921 వరకు సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. అటు పిమ్మట 1930 వ సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు.1932 లో శాసన ధిక్కారమునకు పాల్పడి 1932 జనవరి 27 నుండి ఆరు నెలల పాటు వెల్లూరు, కన్ననూరు కారాగారాలలో కఠిన శిక్షను అనుభవించారు. రాజమండ్రిలో అస్పృశ్యతా నివారణోద్యమంలో పాల్గొన్నారు. తన చివరి జీవితం రాజమండ్రిలోనే గడిపారు.
సంస్మరణ
మార్చురాజమండ్రి నగరంలోని కోటిపల్లి బస్టాండ్ వద్ద ఉన్న స్వాతంత్ర్య సమరయోధుల పార్కులో చేబియ్యం సోదెమ్మ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు. ఈ విగ్రహం కింద ఏర్పాటుచేసిన ఫలకంలో ఆమె జీవితవిశేషాలు, స్వాతంత్ర్య సమరంలోనూ, సంఘసంస్కరణలోనూ చేసిన కృషి వంటివి సవివరంగా చెక్కించారు. 2002 ఫిబ్రవరి 2న జి.నరసింహం, గ్రంథి లలితల సౌజన్యంతో ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నాటి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ సతీష్ చంద్ర ఆవిష్కరించారు.