చేసిన పాపం (నాటకం)


చేసిన పాపం కొప్పరపు సుబ్బారావు రచించిన వచన నాటిక. చేసిన పాపం చెబితే పోతుందన్న సందేశంతో ఈ నాటకం రాయబడింది.[1]

చేసిన పాపం
[[దస్త్రం:|200px]]
చేసిన పాపం పుస్తక ముఖచిత్రం
కృతికర్త: కొప్పరపు సుబ్బారావు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: నాటకం
ప్రచురణ: లక్ష్మి పవర్ ప్రెస్, ది మోడరన్ పబ్లీషర్స్, నవజీవన్ గ్రంథమాల, తెనాలి
విడుదల: ఆగస్టు 1946 (రెండవ ముద్రణ)
పేజీలు: 28 (మొత్తం పుస్తకం-122)

కథానేపథ్యం మార్చు

అహంకార మదోన్మితుడైన రాజకుమారునికి కనువిప్పు కలిగించిన బౌద్ధబిక్షువుని ఇతివృత్తం నేపథ్యంలో ఈ నాటకం ఉంటుంది.

పాత్రలు మార్చు

  1. బౌద్ధ బిక్షువు
  2. దేశ దిమ్మరి
  3. రాజకుమారుడు (నలందా పాలకుడు)
  4. మాయ (పూజారిణి)

ఇతర వివరాలు మార్చు

  1. 1947లో విజయవాడలో జరిగిన ఆంధ్ర నాటక కళా పరిషత్తు సాంఘీక నాటిక పోటీల్లో ఆంధ్ర ప్రజానాట్యమండలి (కృష్ణలంక) తరపున ఎన్టీఆర్, జగ్గయ్య, కేవీఎస్ శర్మ, పసల సూర్యచంద్రరావు, అట్లూరి పుండరీకాక్షయ్యలు కలిసి ఈ నాటికను ప్రదర్శించగా ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ నటుడు (ఎన్టీయార్) విభాగంతో బహుమతులు వచ్చాయి. ఈ పోటీలకు అతిథిగా విచ్చేసిన సినీ దర్శకుడు బి.ఎ.సుబ్బారావు ఎన్టీయార్ నటన చూసి సినిమాలో అవకాశం ఇచ్చాడు.

మూలాలు మార్చు

  1. చరిత్ర సృష్టించిన చేసిన పాపం, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 4 సెప్టెంబరు 2017, పుట.14

ఇతర లంకెలు మార్చు