చైనీస్ బ్యూటీ డిటెక్టివ్ నవలా రచయిత అయిన మధు బాబు వ్రాసారు. మధు బాబు చైనీస్ బ్యూటీ నవలను 1977లో వ్రాసారు. ఈ నవల మొదటి ముద్రణ అక్టోబరు 1977లో విడుదలైంది, ద్వితీయ ముద్రణ జూన్ 1981లో విడుదలైంది. ఈ నవలలో కథానాయకుని పాత్ర పేరు షాడో.

చైనీస్ బ్యూటీ
చైనీస్ బ్యూటీ
కృతికర్త: మధు బాబు
దేశం: భారత దేశం
భాష: తెలుగు
ప్రక్రియ: నవల
విభాగం (కళా ప్రక్రియ): డిటెక్టివ్ నవల
ప్రచురణ: ఎం.వి.ఎస్.పబ్లికేషన్స్
విడుదల: 1977


కథా విశేషాలు మార్చు

చైనాలోని దుష్ట సైంటిస్టులు భూకంపాలు సృష్టించే యంత్ర సామాగ్రి కనుగొని భారతదేశాన్ని, చైనాను గడగడలాడిస్తుంటే - అదే సమయంలో భారతదేశం షాడోను రంగంలోకి దించుతుంది, కలిసి పనిచేద్దాం అనే మిషతో షాడోను హతమార్చడానికి చైనీస్ బ్యూటీ రంగంలోకి దిగుతుంది, ఆ కథలో షాడో ఆ చైనీస్ బ్యూటీని ఎలా ఎదుర్కుంటాడో, చివరకు ఏ మజిలీ చేరుకుంటుందో మధుబాబు ఈ నవలలో విరచిత రోమాంచితమైన స్పై ధ్రిల్లర్ గా వ్రాశారు.

పాత్రలు మార్చు

  1. షాడో
  2. బిందు
  3. రాజు
  4. కులకర్ణి
  5. చంద్ర
  6. లీనా హొరూషి
  7. అషీబా
  8. యూబా
  9. ఉలూ

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు

కినిగెలో చైనీస్ బ్యూటీ Archived 2012-01-04 at the Wayback Machine