మధుబాబు
మధుబాబుగా ప్రసిద్ధుడైన వల్లూరు మధుసూదన రావు ప్రముఖ తెలుగు నవలా రచయిత. ఎక్కువగా పరిశోధనాత్మక (డిటెక్టివ్) నవలలు ప్రచురించాడు. వీరి చాలా నవలలో షాడో కథానాయకుడిగా కనిపిస్తాడు. కొన్ని నవలలలో వాత్సవ్‌ని కూడా కథానాయకుడిగా చేసి రాస్తూ ఉంటారు. ఈయన రచనా శైలిలో ఒక ప్రత్యేకత ఉన్నది, ఏ విషయాన్ని రచయతగా చెప్పారు. దానిని కథ లోని పాత్రలు మాట్లాడుకునేటట్లు చేస్తారు. ఈయన వ్రాసిన జానపద నవలలు కూడా ఇంతే స్థాయిలో చదువరులను ఆకట్టుకున్నాయి.
మధుబాబు | |
---|---|
జననం | వల్లూరు మధుసూదన రావు 1948 జూలై 6 [ఆధారం చూపాలి] |
ఇతర పేర్లు | మధుబాబు |
వృత్తి | ఉపాధ్యాయుడు రచయిత |
జీవిత భాగస్వామి | ఆదిలక్ష్మి |
పిల్లలు | ఉదయ్ |
తల్లిదండ్రులు |
|
విజయవాడకు దగ్గరున్న హనుమాన్ జంక్షన్‌కు చెందిన ఈయన 100కి పైగా నవలలను ప్రచురించాడు. ఈయన నవలలు ప్రాచుర్యము పొందడానికి పాత్రలలోని మానవీయత, హాస్యమేనని పాఠకులు భావిస్తారు. ప్రారంభదశలో మధుబాబు నవలలు మద్రాసులోని ఎం.వీ.ఎస్ పబ్లికేషన్స్ ప్రచురించింది. ఆ తరువాత ఈయన మధుబాబు పబ్లికేషన్స్ పేరుతో సొంత ప్రచురణాలయము ప్రారంభించారు. మధుబాబు నవలలు స్వాతి వార పత్రికలో చాలా సంవత్సరాలు వారం వారం ధారావాహికగా ప్రచురించబడ్డాయి. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి వారి నవ్య వీక్లీలో మధుబాబు నవలలు ధారావాహికలుగా ప్రచురించబడుతున్నాయి.
మధుబాబు చాలా కాలం వరకు కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేసి ఈమధ్యనే పదవీ విరమణ చేసారు. మెర్కురి ఎంటర్టైన్మెంట్ అనే చలన చిత్ర నిర్మాణ సంస్థకి ఒక కథను సమకూర్చారు. ఈయన పేరుకున్న ప్రాముఖ్యత దృష్ట్యా మధుబాబును అనుకరిస్తూ మధురబాబు, శ్రీ మధుబాబు వంటి రచయితలు వెలశారు.
బాల్యం, విద్యాభ్యాసం
మార్చుమధుబాబు జులై 6, 1948 న కృష్ణా జిల్లా, తోట్లవల్లూరు గ్రామంలో జన్మించాడు. సూర్యనారాయణ రావు, భారతి ఈయన తల్లిదండ్రులు. తండ్రి కరణంగా పనిచేసేవాడు. వీరిది మధ్యతరగతి కుటుంబం. మధుబాబుకు నలుగురు చెల్లెళ్ళు ఉన్నారు. ఏడో తరగతి వరకు తోట్లవల్లూరు లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. చదువు అనుకున్నట్టుగా సాగకపోవడంతో తండ్రి ఈయనను ఎ. కొండూరు మండలం, కంభంపాడు గ్రామంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాబాయి దగ్గరకు పంపించాడు. అక్కడ చదువుతున్నప్పుడే నాటకాలమీద, సాహిత్యం మీద ఆసక్తి ఏర్పడ్డాయి. ఎస్. ఎస్. ఎల్. సి కోసం మళ్ళీ స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. తండ్రి స్వతహాగా సాహిత్యాభిమాని. ఆయన ఎక్కువగా శరత్ సాహిత్యం చదివేవాడు. వీరి ఇంట్లో సుమారు 2000 దాకా పుస్తకాలు ఉండేవి. మధుబాబు వీటిలో చాలా పుస్తకాలు చదివాడు. మచిలీపట్నంలో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేశాడు. కానీ ఆ వృత్తిలో ఎదుగుదల ఉండదని మొదట్లో అందులో చేరలేదు.[1]
వృత్తి
మార్చుహైదరాబాదులో దుర్గాబాయి దేశ్‌ముఖ్ స్థాపించిన ఆంధ్ర మహిళా సభ లో అకౌంటెంట్ గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. పగలు ఉద్యోగం చేస్తూ రాత్రి కళాశాలలో చదువుతూ పి. యు. సి, తర్వాత బి. కాం పూర్తి చేశాడు. తన పని చేసే చోటనే ఉన్న గ్రంథాలయంలో చాలా పుస్తకాలు చదివాడు. కొద్దికాలం హైదరబాదు రిజర్వు బ్యాంకులో కాయిన్, నోట్ ఎక్జామినర్ కూడా పనిచేశాడు. అదే సమయంలో నాటకాల మీద ఆసక్తితో చాలా నాటకాల్లో పాల్గొన్నాడు.
జీవితంలో ఏదో సాధించాలనే తపనతో అనేక ప్రాంతాల్లో పర్యటించడం మొదలుపెట్టాడు. 1972 నాటికి మద్రాసు చేరుకున్నాడు. అక్కడే రచనలు మొదలు పెట్టాడు. తన మొదటి రచన ప్రారంభించక మునుపే ఎం. వి. ఎస్. పబ్లిషర్స్ అనే సంస్థకు వెళ్ళి తన దగ్గర ఒక నవల ఉన్నదనీ ప్రచురిస్తారా అని అడిగాడు. విషయం బాగుంటే ప్రచురిస్తామన్నారు వాళ్ళు. దాని తర్వాత ఆయన కేవలం మూడు రోజుల్లో వాంటెడ్ డెడ్ ఆర్ అలైవ్ అనే నవలను రాసి వారికి ఇచ్చాడు. ఇది 15 సార్లు పునర్ముద్రితమైంది. ఆయన అందుకున్న తొలి పారితోషికం 50 రూపాయలు. ఈయన రచయిత కావడం వెనుక స్నేహితుడు బొర్రా సుబ్బారావు ప్రోత్సాహం ఉంది. ఈయన మధుబాబును మరిన్ని రచనలు చేసేలా ప్రోత్సహించాడు.
నవలలు రాస్తూ దాదాపు ఏడు సంవత్సరాల పాటు మద్రాసులో గడిపి రచయితగా మంచి గుర్తింపు సాధించాడు. తర్వాత 1979 లో స్వస్థలానికి తిరిగి వచ్చి తనకున్న విద్యార్హతలతోనే ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరాడు. తర్వాత ఉద్యోగంలో కొనసాగుతూనే ఖాళీ సమయాల్లో తన రచనా ప్రస్థానం కొనసాగించాడు.
పుస్తక పఠనం అనే అలవాటు మరుగున పడిపోయిన నేటి అంతర్జాల యుగంలో కొత్త తరానికి తన రచనలను దగ్గర చేద్దామనే ఉద్దేశ్యంతో ఇటీవలే 'షాడో మధుబాబు (అఫిషియల్) ఆడియోబుక్స్' అనే యూట్యూబ్ చానెల్ ను ప్రారంభించారు.
రచనలు
మార్చురచన పేరు | విభాగం | ప్రచురణ | పబ్లికేషన్ | సంవత్సరం |
---|---|---|---|---|
2 మైల్స్ టు ది బోర్డర్ | పాస్ట్ లైఫ్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
అతను | క్రైమ్ | స్వాతి | శ్రీ శ్రీనివాసా | |
అపరిచితుడు | క్రైమ్ | స్వాతి | శ్రీ శ్రీనివాసా | |
ఆనందజ్యోతి | జానపదం | స్వాతి | శ్రీ శ్రీనివాసా | |
ఆపరేషన్ అరిజోనా | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | 1976 |
ఆపరేషన్ కాబూల్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | 1992 |
ఆపరేషన్ కౌంటర్ స్పై | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
ఆపరేషన్ డబుల్‌క్రాస్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
ఆపరేషన్ బెంగాల్ టైగర్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ||
ఆర్తి | క్రైమ్ | డైరెక్ట్ | సత్యవాణి | |
ఇన్స్పెక్టర్ షాడో | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
ఎ జర్నీ టు హెల్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
హర్రర్స్ ఆఫ్ డార్క్నెస్ (భాగం-3) | షాడో ఎడ్వెంచర్, హర్రర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | 1985 |
ఎ బుల్లెట్ ఫర్ షాడో | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
ఎ మినిట్ ఇన్ హెల్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
ఎసాల్ట్ ఆన్ షాడో | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.బి | |
ఎసైన్మెంట్ కరాచీ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
ఎసైన్మెంట్ లవ్‌బర్డ్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | 1992 |
హర్రర్స్ ఆఫ్ డార్క్నెస్ (భాగం-2) | షాడో ఎడ్వెంచర్, హర్రర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
కంకణ రహస్యం | వాత్సవ & శ్యామ్ | డైరెక్ట్ | ||
కాళికాలయం (భాగం-2) | జానపదం | డైరెక్ట్ | ఎం.బి | |
కమాండర్ షాడో | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
కాళికాలయం (భాగం-3) | జానపదం | డైరెక్ట్ | ఎం.బి | |
కార్నివాల్ ఫర్ కిల్లర్స్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
కాల కన్య | జానపదం | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
కాల నాగు | జానపదం | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
కాళికాలయం (భాగం-1) | జానపదం | డైరెక్ట్ | ఎం.బి | |
కిల్ క్విక్ ఆర్ డై | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | 1979 |
కిల్ దెమ్ మిష్టర్ షాడో | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
కిస్ కిస్ కిల్ కిల్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
కిస్ మి డార్లింగ్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | 1973 |
కెండో వారియర్ | షాడో ఎడ్వెంచర్ | డైరెక్ట్ | ఎం.బి | |
కౌంటర్ ఫీట్ కిల్లర్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
క్రైమ్ కార్నర్ | క్రైమ్ | డైరెక్ట్ | సత్యవాణి | |
గండు చీమ | జానపదం | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
గన్ ఫైట్ ఇన్ గ్రీన్లాండ్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
గన్స్ ఇన్ ది నైట్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
గోల్డెన్ రోబ్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.బి | |
గ్రనేడ్ గ్రూప్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
ఘర్షణ | వాత్సవ & శ్యామ్ | శ్రీ శ్రీనివాసా | ||
చక్రతీర్థం | క్రైమ్ | స్వాతి | శ్రీ శ్రీనివాసా | |
చతుర్నేత్రుడు (భాగం-1) | జానపదం | స్వాతి | శ్రీ శ్రీనివాసా | |
చతుర్నేత్రుడు (భాగం-2) | జానపదం | స్వాతి | శ్రీ శ్రీనివాసా | |
చిచ్చర పిడుగు | షాడో ఎడ్వెంచర్ | డైరెక్ట్ | ||
చైనీస్ పజిల్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | 1980 |
చైనీస్ బ్యూటీ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | 1977 |
చైనీస్ మాస్క్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.బి | |
జాగ్వార్ జస్వంత్ | జానపదం | డైరెక్ట్ | ఎం.వి.యస్ | 1977 |
జూనియర్ ఏజెంట్ శ్రీకర్ | శ్రీకర్ ఎడ్వెంచర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
జ్వాలాముఖి | వాత్సవ & శ్యామ్ | డైరెక్ట్ | శ్రీ శ్రీనివాసా | |
టాప్ సీక్రెట్ | ||||
టార్గెట్ ఫైవ్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ||
టార్గెట్... షాడో | షాడో స్పై థ్రిల్లర్ | స్వాతి | సత్యవాణి | 2021 |
టెంపుల్ ఆఫ్ డెత్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
టెన్ ఎగైనెస్ట్ షాడో (భాగం - 1) | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.బి | |
టెన్ ఎగైనెస్ట్ షాడో (భాగం - 2) | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.బి | |
టెర్రర్ ఐలండ్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | 1987 |
టెర్రా 205 (భాగం-1) | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ||
టెర్రా 205 (భాగం-2) | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ||
టేస్ట్ ఫర్ డెత్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.బి | |
టైగర్ మున్నా | షాడో ఎడ్వెంచర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
టైగర్ వాత్సవ | వాత్సవ & శ్యామ్ | శ్రీ శ్రీనివాసా | ||
డర్టీ డెవిల్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
డాక్టర్ జీరో | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
డాక్టర్ శ్రీకర్ ఎంబిబియస్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.బి | |
డాక్టర్ షాడో | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.బి | |
చిచ్చర పిడుగు (భాగం-2) | షాడో ఎడ్వెంచర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
డియర్ షాడో | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ||
డెడ్లీ స్పై (భాగం-1) | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
డెడ్లీ స్పై (భాగం-2) | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
డెత్ వారెంట్ | క్రైమ్ | డైరెక్ట్ | సత్యవాణి | |
డెవిల్స్ ఇన్ నికోబార్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | 1974 |
డెవిల్స్ డిన్నర్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
డేంజరస్ గేమ్ (భాగం-1) | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.బి | |
డేంజరస్ గేమ్ (భాగం-2) | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.బి | |
డేంజరస్ డయబాలిక్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | 1986 |
డేర్ డెవిల్ | వాత్సవ & శ్యామ్ | నవ్య | 2015 | |
డైనమైట్ డోరా | షాడో స్పై థ్రిల్లర్ | |||
డౌన్ స్ట్రీట్ మిస్టరీ | క్రైమ్ | |||
డ్యుయల్ ఎట్ డబుల్ రాక్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | 1982 |
ది కర్స్ ఆఫ్ కుంగ్‌ఫూ | పాస్ట్ లైఫ్ | ఎం.బి | ||
ది కిల్లర్ ఫ్రం సిఐబి | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
ది గర్ల్ ఫ్రం సిఐబి | - | |||
ది బ్రెయిన్ వాషర్స్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
దుర్మార్గుడు | పాస్ట్ లైఫ్ | నవ్య | సత్యవాణి | 2019 |
దొంగ... దొంగ... దొంగ పట్టుకోండి... పట్టుకోండి | షాడో ఎడ్వెంచర్ | స్వాతి | 2010 | |
నందిని | వాత్సవ & శ్యామ్ | సత్యవాణి | ||
నరుడు | జానపదం | నవ్య | 2014 | |
నల్లతాచు | షాడో ఎడ్వెంచర్ | |||
నిశాచరుడు | జానపదం | నవ్య | 2018 | |
నిశ్శబ్దనాదం | వాత్సవ & శ్యామ్ | నవ్య | 2013 | |
నెంబర్ 28 | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ||
నెవర్ లవ్ ఎ స్పై | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
నైట్ వాకర్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.బి | 1993 |
పాము | క్రైమ్ | డైరెక్ట్ | ||
పులి మడుగు | క్రైమ్ | డైరెక్ట్ | సత్యవాణి | |
ప్రొఫెసర్ షాడో | - | |||
ప్లీజ్ హెల్ప్ మి | హర్రర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
ఫినిషింగ్ టచ్ | వాత్సవ & శ్యామ్ | |||
ఫిస్ట్ ఆఫ్ షాడో | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.బి | |
ఫైటింగ్ ఫూల్ | పాస్ట్ లైఫ్ | డైరెక్ట్ | ఎం.బి | |
ఫైటింగ్ ఫోర్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.బి | |
ఫైనల్ వార్నింగ్ | క్రైమ్ | |||
ఫ్లయింగ్ ఫాల్కన్ | షాడో ఎడ్వెంచర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | 1977 |
ఫ్లయింగ్ బాంబ్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
ఫ్లయింగ్ హార్స్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.బి | |
బంజాయ్ | పాస్ట్ లైఫ్ | డైరెక్ట్ | ఎం.బి | 1982 |
బద్మాష్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
బఫెలో హంటర్స్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | 1979 |
బర్మా డాల్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.బి | |
బాబా | పాస్ట్ లైఫ్ | డైరెక్ట్ | ఎం.బి | |
బాబింగ్ స్క్వాడ్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
బైరాగి | క్రైమ్ | స్వాతి | శ్రీ శ్రీనివాసా | |
బొమ్మ | వాత్సవ & శ్యామ్ | శ్రీ శ్రీనివాసా | ||
బ్రోకెన్ రివాల్వర్ | షాడో స్పై థ్రిల్లర్ | |||
బ్లడీ బోర్డర్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
బ్లడ్ హౌండ్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
భవాని | క్రైమ్ | డైరెక్ట్ | మధుప్రియ | 2007 |
భోలా శంకర్ (భాగం-1) | పాస్ట్ లైఫ్ | స్వాతి | ఎం.బి | |
భోలా శంకర్ (భాగం-2) | పాస్ట్ లైఫ్ | స్వాతి | ఎం.బి | |
మచ్చల గుర్రం | జానపదం | |||
మధుమాలిని | జానపదం | ఎం.బి | ||
మరకత మంజూష (బాగం-1) | జానపదం | నది | మధుప్రియ | 2017 |
మరకత మంజూష (బాగం-2) | జానపదం | నది | మధుప్రియ | 2017 |
మర్డరింగ్ డెవిల్స్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | 1983 |
మిడ్నైట్ ఎడ్వెంచర్ (భాగం-1) | పాస్ట్ లైఫ్ | స్వాతి | ఎం.బి | |
మిడ్నైట్ ఎడ్వెంచర్ (భాగం-2) | పాస్ట్ లైఫ్ | స్వాతి | ఎం.బి | |
మిడ్నైట్ ప్లస్ ఒన్ (భాగం-1) | షాడో స్పై థ్రిల్లర్ | స్వాతి | ఎం.బి | |
మిడ్నైట్ ప్లస్ ఒన్ (భాగం-2) | షాడో స్పై థ్రిల్లర్ | స్వాతి | ఎం.బి | |
మిషన్ టు పెకింగ్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.బి | |
మిస్సింగ్ నెంబర్ | క్రైమ్ | ఎం.బి | ||
మేరా నామ్ రజూలా | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
యక్షకన్య | జానపదం | |||
యముడు | షాడో ఎడ్వెంచర్ | డైరెక్ట్ | ఎం.బి | |
రన్ ఫర్ ది బోర్డర్ | షాడో ఎడ్వెంచర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
రన్ ఫర్ ది హైలాండ్స్ | షాడో ఎడ్వెంచర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
రన్ షాడో రన్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
రహస్యం | క్రైమ్ | |||
రివెంజ్ రివెంజ్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
రుద్రనాగు | జానపదం | |||
రుద్రభూమి | క్రైమ్ | సత్యవాణి | ||
రుద్రాణి | షాడో ఎడ్వెంచర్ | |||
రుద్రుడు | జానపదం | |||
రెడ్ అలెర్ట్ | క్రైమ్ | |||
రెడ్ షాడో (భాగం-1) | షాడో ఎడ్వెంచర్ | |||
రెడ్ షాడో (భాగం-2) | షాడో ఎడ్వెంచర్ | |||
రెడ్ సిల్వర్ | క్రైమ్ | సత్యవాణి | ||
లైసెన్స్ టు కిల్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
లోన్ వోల్ఫ్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
వన్స్ ఎగైన్ షాడో | పాస్ట్ లైఫ్ | సత్యవాణి | ||
వాంటెడ్ డెడ్ ఆర్ ఎలైవ్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
విప్లవం వర్థిల్లాలి | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
వెన్నెల మడుగు | క్రైమ్ | డైరెక్ట్ | సత్యవాణి | |
శంకర్ దాదా (బాగం-1) | క్రైమ్ | స్వాతి | ||
శంకర్ దాదా (బాగం-2) | క్రైమ్ | స్వాతి | ||
శశిబాల | జానపదం | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
శిక్ష (భాగం-1) | క్రైమ్ | స్వాతి | ||
శిక్ష (భాగం-2) | క్రైమ్ | స్వాతి | ||
శివంగి | జానపదం | డైరెక్ట్ | సత్యవాణి | |
శివుడు (భాగం-1) | క్రైమ్ | |||
శివుడు (భాగం-2) | క్రైమ్ | |||
శ్రావణి | వాత్సవ & శ్యామ్ | |||
షాడో | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.బి | |
షాడో ఇన్ కొచ్చిన్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
షాడో ఇన్ జపాన్ | షాడో ఎడ్వెంచర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
షాడో ఇన్ ది జంగిల్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
షాడో ఇన్ బాగ్దాద్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
షాడో ఇన్ బోర్నియో | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
షాడో ఇన్ సిక్కిం | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
షాడో ఇన్ హైదరాబాద్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
షాడో ది ఎవెంజర్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
షాడో ది స్పై కింగ్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
షాడో వస్తున్నాడు జాగ్రత్త | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
షాడో! షాడో!! (భాగం-1) | పాస్ట్ లైఫ్ | స్వాతి | ఎం.బి | 2004 |
షాడో! షాడో!! (భాగం-2) | పాస్ట్ లైఫ్ | స్వాతి | ఎం.బి | 2004 |
షాడో!షాడో!!షాడో!!! | షాడో ఎడ్వెంచర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
సాధన | వాత్సవ & శ్యామ్ | 1985 | ||
సాలభంజిక | వాత్సవ & శ్యామ్ | శ్రీ శ్రీనివాసా | ||
సి.ఐ.డి. షాడో | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
సిల్వర్ కింగ్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
సిసీలియన్ ఎడ్వెంచర్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
సీక్రెట్ ఏజెంట్ మిష్టర్ షాడో | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
సెవెన్త్ కిల్లర్ | షాడో స్పై థ్రిల్లర్ | ఎం.బి | ||
సైంటిస్ట్ మిస్ మాధురి | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
సైంటిస్ట్ షాడో | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
స్టార్ ఫైటర్ | పాస్ట్ లైఫ్ | నవ్య | 2017 | |
స్పందన | క్రైమ్ | ఎం.బి | ||
స్పైడర్ వెబ్ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
స్వర్ణ ఖడ్గం (భాగం-1) | జానపదం | స్వాతి | ||
స్వర్ణ ఖడ్గం (భాగం-2) | జానపదం | స్వాతి | ||
హంటర్ షాడో | షాడో స్పై థ్రిల్లర్ | నవ్య | మధుప్రియ | |
హర్రర్స్ ఆఫ్ డార్క్నెస్ (భాగం-1) | షాడో ఎడ్వెంచర్, హర్రర్ | |||
హూ ఆర్ యూ | షాడో స్పై థ్రిల్లర్ | డైరెక్ట్ | ఎం.వి.యస్ | |
హెచ్చరిక | వాత్సవ & శ్యామ్ | శ్రీ శ్రీనివాసా |
టీవీ ధారావాహికలు
మార్చు- చక్ర తీర్థం (ఈ టీవీ)
- కాళికాలయం ( జెమిని టీవీ)
- శంకర్ దాదా
- శిక్ష
మూలాలు
మార్చు- ↑ టి. డి., ప్రసాద్ (2008). ఈనాడు ఆదివారం. విజయవాడ: ఈనాడు. pp. 20, 21.