కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి (జననం 1965) తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు. 2014-2018 మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ[2][3] తరపున మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.[4] 2022 నవంబరు 3న మునుగోడు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో గెలుపొందాడు.
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి | |||
| |||
నియోజకవర్గం | మునుగోడు శాసనసభ నియోజకవర్గం | ||
---|---|---|---|
పదవీ కాలం 2014 – 2018 | |||
పదవీ కాలం 2022 – ప్రస్తుతం | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1965 (age 58–59) లింగవారిగూడెం, సంస్థాన్ నారాయణపూర్ మండలం, యాదాద్రి - భువనగిరి జిల్లా, తెలంగాణ | ||
తల్లిదండ్రులు | జంగారెడ్డి, కమలమ్మ [1] | ||
జీవిత భాగస్వామి | అరుణ | ||
సంతానం | ఒక కుమారుడు, ఒక కుమార్తె |
తొలి జీవితం
మార్చుప్రభాకర్ రెడ్డి 1965లో జంగారెడ్డి, కమలమ్మ దంపతులకు యాదాద్రి - భువనగిరి జిల్లా, నారాయణపూర్ మండలంలోని సర్వేల్ గ్రామంలో జన్మించాడు. హైదరాబాదులోని వివేక వర్ధిని కళాశాల నుండి బి.ఎడ్. విద్యను, నల్గొండలోని నాగార్జున కళాశాల నుండి బిఎస్సీ విద్యను పూర్తిచేశాడు.[5] రాజకీయాల్లోకి రాకముందు కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసి, ఒక విద్యాసంస్థను కూడా ప్రారంభించాడు.[6]
రాజకీయ జీవితం
మార్చుతెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన తన గురువు కళ్ళెం యాదగిరి రెడ్డితో కలిసి ప్రభాకర్ రెడ్డి 2002లో తెలంగాణ రాష్ట్ర సమితి చేరాడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రాష్ట్ర సాధన కోసం పోరాడాడు. మునుగోడు ప్రాంతంలో రాష్ట్ర సాధనకోసం జరిగిన అనేక ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభాకర్ రెడ్డి, అక్కడి ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందాడు. ప్రభాకర్ తల్లి ఫ్లోరోసిస్ బాధితురాలు. ఈ ప్రాంతంలో ఫ్లోరోసిస్ బాధితులు ఎక్కువగా ఉండేవారు.
ఎమ్మెల్యేగా
మార్చుకూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 2009లో మహేశ్వరం నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి 8వ స్థానంలో నిలిచాడు. ఆయన 2014లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా అత్యధికంగా 38,055 ఓట్ల మెజారిటీతో మునుగోడు శాసనసభ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందాడు.[7] మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ద్వారా నీటిలోని ఫ్లోరోసిస్ అంతం చేయడానికి, ఆరోగ్యం, విద్య మొదలైన ప్రధాన కార్యక్రమాల ప్రయోజనాలను మునుగోడు ప్రజలకు అందించడానికి ఆయన చురుకుగా పనిచేశాడు. 2018లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మరోసారి టిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 22,552 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2022 ఆగస్టు 2న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో 2022 నవంబరు 3న జరిగే ఉప ఎన్నికకు టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించింది.[8] నవంబరు 6న ఉప ఎన్నిక ఫలితాలు ప్రకటించబడ్డాయి. బిజేపి అభ్యర్థిగా పోటీచేసిన రాజగోపాల్ రెడ్డిపై 10,309 ఓట్ల మెజారిటీతో ప్రభాకర్ రెడ్డి గెలుపొందాడు.[9] కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నవంబరు 10న ఎమ్మెల్యేగా ప్రమాణం స్వీకారం చేశాడు.[10]
- 2014 ఎన్నికల వివరాలు
2014లో తెలంగాణ శాసనసభకు జరిగిన తొలి ఎన్నికలు[11]
Party | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
తెలంగాణ రాష్ట్ర సమితి | కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి | 65,496 | 36.6% | ||
స్వతంత్ర | పాల్వాయి స్రవంతి | 27,441 | 16.0% | ||
భారతీయ జనతా పార్టీ | గంగిడి మనోహర్ రెడ్డి | 27,434 | 16.0% |
| |
మెజారిటీ | 38,055 | 20.6% | |||
మొత్తం పోలైన ఓట్లు | 82.63% | ||||
తెలంగాణ రాష్ట్ర సమితి gain from | Swing |
- 2022 ఉప ఎన్నిక
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం | ||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | |
టీఆర్‌ఎస్ | కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి | 97,006 | 43 | |
బీజేపీ | కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి | 86,697 | 38.4 | |
కాంగ్రెస్ | పాల్వాయి స్రవంతి రెడ్డి | 23,906 | 10.6 | |
నోటా | పైవేవీ కాదు | |||
మెజారిటీ | 10309 | |||
బీజేపీ పై టీఆర్‌ఎస్ గెలిచింది |
వ్యక్తిగత జీవితం
మార్చుప్రభాకర్ రెడ్డికి అరుణతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
మూలాలు
మార్చు- ↑ Sakshi (17 November 2014). "కమలమ్మకు శ్రద్ధాంజలి". Retrieved 11 August 2021.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ Pradeep, B. (2018-02-26). "Falling short of political will". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-08-11.
- ↑ "District reorganisation eased administration, says Jagadish Reddy". archive.telanganatoday.com. Archived from the original on 2021-08-11. Retrieved 2021-08-11.
- ↑ "Job mela in Telangana attracts 2,305 youth, 699 bag government jobs". archive.telanganatoday.com. Archived from the original on 2021-08-11. Retrieved 2021-08-11.
- ↑ "'Water for every house in Nalgonda by 2017 end'". archive.telanganatoday.com. Archived from the original on 2021-08-11. Retrieved 2021-08-11.
- ↑ "Bathukamma Sarees distribution begins in Telangana; over 1 crore sarees to be distributed". archive.telanganatoday.com. Archived from the original on 2021-08-11. Retrieved 2021-08-11.
- ↑ Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
- ↑ Namasthe Telangana (7 October 2022). "మునుగోడు టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి". Archived from the original on 7 October 2022. Retrieved 7 October 2022.
- ↑ "Munugode bypoll: తెరాస విజయహాసం". EENADU. 2022-11-07. Archived from the original on 2022-11-07. Retrieved 2022-11-07.
- ↑ Namasthe Telangana (10 November 2022). "ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం". Archived from the original on 10 November 2022. Retrieved 10 November 2022.
- ↑ "Munugode Results". Archived from the original on 2018-12-25. Retrieved 2021-08-11.