మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం
నల్గొండ జిల్లా లోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం 5 మండలాలు ఉన్నాయి.
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలుసవరించు
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులుసవరించు
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం | అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య | పేరు | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2019 | 93 | మునుగోడు | జనరల్ | కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి | పు | కాంగ్రెసు | కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి | పు | తెరాస | ||
2014 | 93 | మునుగోడు | జనరల్ | కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి | పు | TRS | 65496 | పాల్వాయి స్రవంతి | స్త్రీ | IND | 27441 |
2009 | 93 | మునుగోడు | జనరల్ | ఉజ్జిని యాదగిరిరావు | పు | CPI | 57383 | పాల్వాయి గోవర్ధన్ రెడ్డి | పు | INC | 53789 |
2004 | 293 | మునుగోడు | జనరల్ | పల్లా వెంకట్రెడ్డి | పు | CPI | 55252 | చిలువేరు కాశీనాథ్ | పు | తె.దే.పా | 43967 |
1999 | 293 | మునుగోడు | జనరల్ | పాల్వాయి గోవర్ధన్ రెడ్డి | పు | INC | 45134 | మార్కండేయ జెల్ల | పు | తె.దే.పా | 41095 |
1994 | 293 | మునుగోడు | జనరల్ | ఉజ్జిని నారాయణరావు | పు | CPI | 55209 | పాల్వాయి గోవర్ధన్ రెడ్డి | పు | IND | 23655 |
1989 | 293 | మునుగోడు | జనరల్ | ఉజ్జిని నారాయణరావు | పు | CPI | 51445 | పాల్వాయి గోవర్ధన్ రెడ్డి | పు | INC | 43183 |
1985 | 293 | మునుగోడు | జనరల్ | ఉజ్జిని నారాయణరావు | పు | CPI | 44733 | పుంగల నారాయణరావు | పు | INC | 23950 |
1983 | 293 | మునుగోడు | జనరల్ | పాల్వాయి గోవర్ధన్ రెడ్డి | పు | INC | 30084 | బొమ్మగాని ధర్మభిక్షం | పు | CPI | 19773 |
1978 | 293 | మునుగోడు | జనరల్ | పాల్వాయి గోవర్ధన్ రెడ్డి | పు | INC | 31635 | కంచర్ల రామకృష్ణారెడ్డి | పు | JNP | 18004 |
1972 | 286 | మునుగోడు | జనరల్ | పాల్వాయి గోవర్ధన్ రెడ్డి | పు | INC | 24995 | ఉజ్జిని నారాయణరావు | పు | CPI | 16266 |
1967 | 286 | మునుగోడు | జనరల్ | పాల్వాయి గోవర్ధన్ రెడ్డి | పు | INC | 26204 | ఉజ్జిని నారాయణరావు | పు | CPI | 10582 |
2004 ఎన్నికలుసవరించు
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి సి.పి.ఐ పార్టీకి చెందిన పల్లా వెంకటరెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చిలువెరు కాశీనాథ్‌పై 11285 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. వెంకటరెడ్డి 55252 ఓట్లు పొందగా, కాశీనాథ్ 43967 ఓట్లు సాధించాడు.