చునీలాల్ వైద్య
చునీలాల్ వైద్య (1917 సెప్టెంబరు 2- 2014 డిసెంబరు 19) గుజరాత్‌కు చెందిన స్వాతంత్ర్యోద్యమ కార్యకర్త, గాంధేయవాది. [1][2] ఆయన్ను చునీభాయ్ అని గుజరాతీ పద్ధతిలో పిలుస్తారు. చునీకాకా అని కూడా పిలుస్తారు, ప్రముఖ గాంధేయవాది. గాంధేయ మార్గంలో పయనించి ఎందరికో స్పూర్తిగా నిలిచారాయన.
జీవిత విశేషాలు
మార్చుచునీలాల్ వైద్య గుజరాత్, పటాన్ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో 1918 సెప్టెంబరు 2 న జన్మించాడు. అతను గాంధేయవాది, సర్వోదయ నాయకుడు. అతను భారత స్వాతంత్ర్య ఉద్యమంలోను తరువాత వినోబా భావే చేపట్టిన భూదాన్ ఉద్యమంలోనూ పాల్గొన్నాడు. 1960లలో హింస చెలరేగినప్పుడు అస్సాంలో శాంతి కోసం పనిచేశాడు. ఆయన భూమిపుత్ర పత్రికకు సంపాదకుడుగా పనిచేసాడు. 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని వ్యతిరేకించి జైలుకెళ్లాడు. 1980లో గుజరాత్ లోక్ సమితి అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. 1986 - 1988 కాలంలో గుజరాత్‌లో కరువు ఏర్పడినపుడు అతను పటాన్ జిల్లాలో 12000 హెక్టార్ల భూమికి సాగునీరు అందించే చెక్ డ్యామ్‌ల నిర్మాణంలోను ఇతర కరువు సహాయక చర్యల లోనూ పాల్గొన్నాడు. 2002 లో జరిగిన గుజరాత్ హింసను కూడా అతను విమర్శించాడు. [3] [4]
వైద్య గాంధీ హత్య: వాస్తవాలు, అబద్ధం అనే పుస్తకం రాసాడు. అది పదకొండు భాషల్లోకి అనువదించబడింది. [3] [4]
పురస్కారాలు
మార్చుతాను చేసిన పాత్రికేయ కృషికి గాను వైద్య, గురూజీ నిర్భయ్ పాత్రకారితా పురస్కారం అందుకున్నాడు. విశ్వ గుజరాతీ సమాజ్ అందించే విశ్వ గుజరాతీ ప్రతిభా పురస్కారం కూడా అందుకున్నాడు. [5][6] 2010 లో ఆయనకు జమ్నాలాల్ బజాజ్ అవార్డు లభించింది [7] అంతేకాకుండా ఆయనను సేన్ గురూజీ నిర్భయ్ పత్రకారిత అవార్డు కూడా ఆయనను వరించింది[8][9].
మరణం
మార్చువైద్య 97 సంవత్సరాల వయస్సులో 2014 డిసెంబరు 19 న అహ్మదాబాద్‌లో మరణించాడు. నగరంలోని వడజ్ ప్రాంతంలోని దధీచి శ్మశానవాటికలో అతని అంత్యక్రియలు నిర్వహించారు. [3] [4]
మూలాలు
మార్చు- ↑ PM condoles the passing away of eminent Gandhian Shri Chunibhai Vaidya
- ↑ "Veteran freedom fighter Chunibhai Vaidya died". Archived from the original on 2015-01-10. Retrieved 2015-08-15.
- ↑ 3.0 3.1 3.2 "Gandhian Chunibhai Vaidya dies aged 97". Ahmedabad: Business Standard. Press Trust of India. 19 December 2014. Retrieved 18 January 2015.
- ↑ 4.0 4.1 4.2 varsha (19 December 2014). "Veteran freedom fighter Chunibhai Vaidya passed away". Jagran Josh. Retrieved 18 January 2015.
- ↑ "Gandhian Chunibhai Vaidya dies aged 97". Ahmedabad: Business Standard. Press Trust of India. 19 December 2014. Retrieved 18 January 2015.
- ↑ varsha (19 December 2014). "Veteran freedom fighter Chunibhai Vaidya passed away". Jagran Josh. Retrieved 18 January 2015.
- ↑ "Jamnalal Bajaj Award". Jamnalal Bajaj Foundation. 2015. Retrieved 13 October 2015.[dead link]
- ↑ ప్రముఖ గాంధేయవాది ఛునిభాయ్ మృతి[permanent dead link]
- ↑ http://indianexpress.com/article/cities/ahmedabad/chunibhai-vaidya-face-of-resistance-on-public-issues/